For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20 వరల్డ్ కప్ వేళ.. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన డాషింగ్ ఓపెనర్

T20 World Cup 2024: ఐపీఎల్ సీజన్ ముగిసిన వెంటనే టీ20 వరల్డ్ కప్‌ 2024 టోర్నమెంట్‌‌ మొదలు కానుంది. ఈ నెల 27వ తేదీన ఐపీఎల్ ఫైనల్స్ ముగిసిన వారం రోజుల వ్యవధిలో టీ20 వరల్డ్ కప్ క్రికెట్ ప్రేమికులను పలకరిస్తుంది. నెల రోజుల పాటు ఉర్రూతలూగించనుంది.

జూన్ 2వ తేదీన టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నమెంట్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. 29వ తేదీ వరకు కొనసాగుతుంది. వెస్టిండీస్, అమెరికా.. సంయుక్తంగా ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తోన్నాయి. ఈ రెండు దేశాలు కలిపి మొత్తంగా ఏడు స్టేడియాల్లో మ్యాచ్‌లు షెడ్యూల్ కానున్నాయి.

T20 World Cup 2024 New Zealand opener Colin Munro announces retirement

తొలి సగం మ్యాచ్‌లు వెస్టిండీస్‌లోని ఆంటిగ్వా అండ్ బార్బుడా, బార్బడోస్, గయానా, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగోల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి. మిగిలిన సగం మ్యాచ్‌లు- అమెరికాలోని డల్లాస్, ఫ్లోరిడా, న్యూయార్క్‌ స్టేడియాల్లో నిర్వహించనుంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ట్రినిడాడ్, గయానాల్లో రెండు సెమీ ఫైనల్స్, బార్బడోస్‌లో ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.

ఈ సారి ఏకంగా 20 జట్లు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో ఆడబోతోన్నాయి. భారత్ సహా అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కూడా ఈ టీ20 వరల్డ్ కప్‌లో ఆడబోయే జట్లను ఇప్పటికే ప్రకటించాయి కూడా. ఐపీఎల్ 2024 సీజన్‌లో ప్లేఆఫ్స్, ఫైనల్స్ ఆడబోయే ఫ్రాంఛైజీల ప్లేయర్లు మినహా టీమిండియాకు ఎంపికైన మిగిలిన క్రికెటర్లు ఈ నెల 24వ తేదీన వెస్టిండీస్‌కు బయలుదేరే అవకాశం ఉంది.

ఈ పరిస్థితుల్లో న్యూజిలాండ్ డాషింగ్ ఓపెనర్ కొలిన్ మున్రో.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టీ20 వరల్డ్ కప్‌లో చోటు దక్కకపోవడం వల్లే అతను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు. అన్ని ఫార్మట్ల నుంచీ వైదొలగుతున్నట్లు చెప్పాడు. టీ20ల్లో భారీ స్కోర్లు సాధించడంలో ఎప్పుడూ రాజీపడలేదని, ఈ ఫార్మట్‌లో జాతీయ జట్టుకు ఎంపిక కాకపోవడం నిరాశ కలిగించిందని అన్నాడు.

టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన తరువాత.. క్రికెట్‌కు వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయం అని భావించానని వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ వంటి ఫ్రాంఛైజీ క్రికెట్‌లో అందుబాటులోనే ఉంటానని, ఇంకొన్నాళ్లు ఈ మ్యాచ్‌లు ఆడతానని పేర్కొన్నాడు.

లెఫ్ట్ హ్యాండెడ్ ఓపెనర్ అయిన కొలిన్ మున్రో 2012లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. టీ20 స్పెషలిస్ట్ ప్లేయర్‌గా అతనికి పేరుంది. 57 వన్డేలు, 65 టీ20 మ్యాచ్‌లను ఆడాడు. వన్డేల్లో 1,271, టీ20 ఇంటర్నేషనల్స్‌ల్లో 1,724 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 154. 44తో అతని బ్యాటింగ్ పరుగులు పెట్టింది.

47 బంతుల్లోనే మెరుపు సెంచరీ చేసిన రికార్డ్ అతని పేరు మీదే ఉంది. 2018లో వెస్టిండీస్‌పై అతనీ ఘనత సాధించాడు. రెండుసార్లు ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 14 బంతుల్లోనే రెండుసార్లు 50 కొట్టాడు.

టీ20 వరల్డ్ కప్ ఆడబోయే న్యూజిలాండ్ జట్టులో- కేన్ విలియమ్సన్ (కేప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లోకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిఛెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిఛెల్ శాంట్నర్, ఈష్ సోధీ, టిమ్ సౌతీలకు చోటు దక్కింది. ట్రావెలింగ్ రిజర్వ్డ్‌గా బెన్ సియర్స్ ఉంటాడు.

Story first published: Friday, May 10, 2024, 9:53 [IST]
Other articles published on May 10, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+