Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2024కు అర్హత సాధించిన ఆసియా పసికూన: పెద్ద జట్లకు పెను సవాల్..!!

లక్నో: ఐసీసీ ప్రపంచకప్ 2023 టోర్నమెంట్‌లో భాగంగా రెండు చిన్న జట్లు తలపడుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ తన తదుపరి మ్యాచ్ ఆడుతోంది. నెదర్లాండ్స్‌తో ఢీ కొడుతోంది. ఉత్తరప్రదేశ్ లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏక్నా స్టేడియంలో షెడ్యూల్ అయిందీ మ్యాచ్. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లల్లో మూడు ఘన విజయాలను సాధించింది ఆఫ్ఘన్.

వచ్చే సంవత్సరం జరగబోయే ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 (T20 World Cup 2024)కు సన్నాహాలు త్వరలో మొదలుకానున్నాయి. అమెరికా, వెస్టిండీస్‌లల్లో ఈ మెగా టోర్నమెంట్‌ను నిర్వహించబోతోంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. దీనికి సంబంధించిన షెడ్యూల్ వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

T20 World Cup 2024: Nepal qualified after defeatingUAE

టీ20 ప్రపంచ కప్ 2024లో పెను సంచలనాలు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వరల్డ్ కప్‌లో ఆఫ్ఘనిస్తాన్, నెదర్లాండ్స్ వంటి జట్లు పెద్ద టీమ్‌లకు చెమటలు పట్టించిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్, పాకిస్తాన్, శ్రీలంకలను ఓడించి జెయింట్ కిల్లర్స్‌గా గుర్తింపు పొందింది ఆఫ్ఘనిస్తాన్.

అటు నెదర్లాండ్స్ కూడా తీసిపారేయని విధంగా ఆడుతోంది ఈ టోర్నమెంట్‌లో. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లల్లో రెండింట్లో గెలిచింది. దక్షిణాఫ్రికన్లను మట్టికరిపించిన ఘనత ఉందా డచ్ టీమ్‌కు. టీ20 ప్రపంచ కప్‌లోనూ ఇలాంటి కనీవినీ ఎరుగని విజయాలు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

దీనికి కారణం లేకపోలేదు. చిన్న జట్టయిన నేపాల్.. టీ20 ప్రపంచకప్ 2024కు అర్హత సాధించడమే. ఆసియా దేశాలకు సంబంధించి ఐసీసీ నిర్వహించిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో మెరుపులు మెరిపించింది నేపాల్. సెమీ ఫైనల్స్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను మట్టికరిపించింది. ఈ విజయంతో అమెరికా, వెస్టిండీస్‌లల్లో జరిగే టీ20 వరల్డ్ కప్‌కు తన బెర్త్‌ను ఖరారు చేసుకుంది.

T20 World Cup 2024: Nepal qualified after defeatingUAE

ఖాట్మాండూలోని ముల్పానీ స్టేడియం జరిగిన టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగింది యుఏఈ. నిర్ణీత 20 ఓవర్లల్లో తొమ్మిది వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ బ్యాటర్ విృత్యా అరవింద్ ఒక్కడే టాప్ స్కోరర్. 64 పరుగులు చేశాడు. ఓపెనర్ మహ్మద్ వసీం- 26 తప్ప మరెవరూ పెద్దగా రాణించలేదు.

సొంత గడ్డపై నేపాల్ బౌలర్లు రెచ్చిపోయారు. యూఏఈ బ్యాటర్లకు చుక్కలు చూపారు. ఒక దశలో భారీ స్కోర్ చేస్తుందనిపించిన యూఏఈని ఎక్కడికక్కడ కట్టడి చేశారు. వరుస వికెట్లు తీసుకున్నారు. నేపాల్ బౌలర్లల్లో కుశాల్ మల్లా మూడు వికెట్లతో చెలరేగాడు. సందీప్ లామిచ్ఛానె 2, సోంపాల్ కమి, రోహిత్ పౌఢెల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ బ్యాటర్లు బౌలర్లపై పూర్తి ఆధిపత్యాన్ని కనపర్చారు. 17.1 ఓవర్లల్లోనే లక్ష్యాన్ని అందుకున్నారు. రెండు వికెట్ నష్టానికి 135 పరుగులను చేశారు. ఓపెనర్ ఆసిఫ్ షేక్- 64, కేప్టెన్ రోహిత్ పౌఢెల్- 34 పరుగులతో అజేయులుగా నిలిచారు. జట్టును విజయ తీరాలకు చేర్చారు.

ఈ మ్యాచ్‌ను చూడ్డానికి జనం తండోపతండాలుగా తరలిరావడం.. క్రికెట్‌పై వారికి ఉన్నఆసక్తిని చాటింది. గ్రౌండ్‌కు అభిమానులు పోటెత్తారు. సమీపంలో ఉన్న మిద్దెలు, మేడలు ఎక్కి మరీ మ్యాచ్‌ను వీక్షించారు. ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ వారు లెక్కచేయలేదు. జట్టు విజయాన్ని ఆస్వాదించారు.

Story first published: Friday, November 3, 2023, 14:35 [IST]
Other articles published on Nov 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+