Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2024: సూపర్ ఓవర్‌లో నమీబియా సంచలన విజయం

టీ20 వరల్డ్ కప్‌లో నమీబియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. బార్బడోస్ వేదికగా సూపర్ ఓవర్‌కు దారితీసిన మ్యాచ్‌లో ఒమన్‌పై ఘన విజయం సాధించింది. స్లో పిచ్‌పై సాగిన ఈ మ్యాచ్ ఆద్యంతం హోరాహోరీగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ 19.4 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటైంది. ఖలీద్ కైల్ (34; 39 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) టాప్ స్కోరర్. ట్రంపెల్మన్ (4/21) నాలుగు వికెట్లు, డేవిడ్ వైసే (3/28) మూడు వికెట్లతో సత్తాచాటారు.

అనంతరం ఛేదనలో నమీబియా 20 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 109 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన తరుణంలో నమీబియా ఒక్క పరుగే సాధించింది. జేన్ ఫ్రైలింక్ (45; 48 బంతుల్లో, 6 ఫోర్లు) పోరాడాడు. ఒమన్ బౌలర్ మెహ్రన్ ఖాన్ (3/7) మూడు వికెట్లతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.

Namibia won the Super Over against Oman

అనంతరం సూపర్ ఓవర్‌లో నమీబియా చెలరేగింది. 21 పరుగులు సాధించింది. డేవిడ్ వైసే తొలి నాలుగు బంతుల్లో 13 పరుగులు సాధించాడు. తొలి బంతిని సిక్సర్‌గా మలిచిన డేవిడ్ రెండో బంతిని బౌండరీకి తరలించాడు. చివరి రెండు బంతుల్ని ఎరాస్మస్ రెండు ఫోర్లు కొట్టాడు. అయితే సూపర్ ఓవర్ ఛేదనలో ఒమన్ వికెట్ కోల్పోయి 10 పరుగులే చేసింది.

నమీబియా తరఫున బంతి అందుకున్న డేవిడ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. తొలి అయిదు బంతులకు నాలుగు పరుగులే ఇచ్చాడు. విజయంలో కీలక పాత్ర పోషించిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన ఒమన్‌కు శుభారంభమే దక్కలేదు. ఖాతా తెరవకముందే రెండు వికెట్లు కోల్పోయింది. కశ్యప్, కెప్టెన్ అకిబ్ ఇలియాస్‌ను గోల్డెన్ డకౌట్ అయ్యారు. జీషన్ మక్సూద్ (22; 20 బంతుల్లో, 4 ఫోర్లు)తో కలిసి ఖలీద్ ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించారు.

కొంపముంచిన వికెట్ కీపర్
అయితే నమీబియా బౌలర్లు పుంజుకోవడంతో ఒమన్ క్రమంగా వికెట్లు కోల్పోయింది. ఒమన్ బ్యాటర్లలో నలుగురు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. అనంతరం ఛేదనలో నమీబియాకు కూడా శుభారంభం దక్కలేదు. కానీ, నికోలాస్ (24; 31 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్)తో కలిసి జేన్ ఫ్రైలింక్ ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించారు. వీరిద్దరూ క్రీజులో ఉన్నంత సేపు నమీబియా ఫేవరేటులో ఉంది. కానీ మెహ్రన్ ఖాన్ బంతి అందుకోవడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. నమీబియా వరుసగా వికెట్లు కోల్పోయింది.

ఆఖరి ఓవర్‌లో అయిదు పరుగులు అవసరమవ్వగా మెహ్రన్ రెండు వికెట్లు తీసి నాలుగు పరుగులు ఇచ్చాడు. తొలి బంతికి ఫ్రైలింక్‌ను బౌల్డ్ చేశాడు. మూడో బంతికి జేన్ గ్రీన్‌ను ఔట్ చేయడంతో తొలి మూడు బంతుల్లో ఒక్క పరుగు కూడా రాలేదు. అయితే నాలుగో బంతికి సింగిల్, అయిదో బంతికి రెండు పరుగులు రావడంతో నమీబియా విజయ సమీకరణం చివరి బంతికి రెండు పరుగులుగా మారింది. మెహ్రన్ వేసిన బంతిని డేవిడ్ వైసే బ్యాటుకు తాకించలేకపోయాడు. వికెట్ కీపర్ నసీమ్ స్టంప్స్ వెనకే ఉన్నప్పటికీ రనౌట్ చేయలేకపోయాడు.

Story first published: Monday, June 3, 2024, 9:55 [IST]
Other articles published on Jun 3, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+