For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup: చరిత్రలో ఫస్ట్ టైమ్..ఒమన్ వరల్డ్ రికార్డ్

టీ20 వరల్డ్ కప్ -2024‌లో సంచలన విజయాలు నమోదవుతున్నాయి. నమీబియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. బార్బడోస్ వేదికగా సూపర్ ఓవర్‌కు దారితీసిన మ్యాచ్‌లో ఒమన్‌పై ఘన విజయం సాధించింది. స్లో పిచ్‌పై సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ 19.4 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటైంది. ఖలీద్ కైల్ (34; 39 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) టాప్ స్కోరర్. ట్రంపెల్మన్ (4/21) నాలుగు వికెట్లు, డేవిడ్ వైసే (3/28) మూడు వికెట్లతో సత్తాచాటారు.

అనంతరం ఛేదనలో నమీబియా 20 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 109 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన తరుణంలో నమీబియా ఒక్క పరుగే సాధించింది. జేన్ ఫ్రైలింక్ (45; 48 బంతుల్లో, 6 ఫోర్లు) పోరాడాడు. ఒమన్ బౌలర్ మెహ్రన్ ఖాన్ (3/7) మూడు వికెట్లతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.

T20 World Cup 2024 Mehran Khan Defends Lowest Final Over Target in Men s T20 World Cup

అనంతరం సూపర్ ఓవర్‌లో నమీబియా చెలరేగింది. 21 పరుగులు సాధించింది. డేవిడ్ వైసే తొలి నాలుగు బంతుల్లో 13 పరుగులు సాధించాడు. తొలి బంతిని సిక్సర్‌గా మలిచిన డేవిడ్ రెండో బంతిని బౌండరీకి తరలించాడు. చివరి రెండు బంతుల్ని ఎరాస్మస్ రెండు ఫోర్లు కొట్టాడు. అయితే సూపర్ ఓవర్ ఛేదనలో ఒమన్ వికెట్ కోల్పోయి 10 పరుగులే చేసింది.

అయితే ఈ మ్యాచ్‌లో అరుదైన రికార్డులు నమోదయ్యాయి. ఒమన్ జట్టులో ఆరుగురు ప్లేయర్లు ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగారు. మెన్స్ టీ20ల్లో ఓ జట్టులో అత్యధిక మంది వికెట్లు ముందు దొరికిపోవడం ఇదే. అంతకుముందు ఈ రికార్డు నెదర్లాండ్స్, స్కాట్‌లాండ్ పేరిట ఉన్నాయి. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ అయిదుగురు ప్లేయర్లు, అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కాట్‌లాండ్ అయిదుగురు ఆటగాళ్లు ఎల్బీగా ఔటయ్యారు.

కాగా, ఈ పోరులో ఆఖరి ఓవర్‌లో అయిదు పరుగులను డిఫెండ్ చేసి మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌కు మలిచిన ఒమన్ బౌలర్ మెహ్రన్ ఖాన్ సంచలన రికార్డు నెలకొల్పాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఆఖరి ఓవర్‌లో అత్యంత తక్కువ పరుగులను కాపాడుకున్న బౌలర్‌గా చరిత్రకెక్కాడు. నమీబియా విజయానికి అయిదు పరుగులు అవసరవమవ్వగా మెహ్రన్ 4 పరుగులే ఇచ్చాడు. అంతకుముందు ఈ రికార్డు డేల్ స్టెయిన్ పేరిట ఉంది. 2014 టీ20 ప్రపంచకప్‌లో స్టెయిన్ 7 పరుగులను డిఫెండ్ చేశాడు.

Story first published: Monday, June 3, 2024, 12:22 [IST]
Other articles published on Jun 3, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+