For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2024: సూపర్-8లో భారత్‌తో తలపడే జట్లు ఇవే!

మరో నాలుగు రోజుల్లో మహా సమరం ప్రారంభం కానుంది. జూన్ 2న నుంచి మొదలయ్యే టీ20 వరల్డ్ కప్‌కు అమెరికా-వెస్టిండీస్ ఉమ్మడిగా ఆతిథ్యం ఇస్తున్నాయి. వన్డే వరల్డ్ కప్‌ను తృటిలో చేజార్చుకున్న భారత్ పొట్టి ప్రపంచకప్‌లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ సారి కప్‌ను ముద్దాడాలని పక్కా ప్రణాళికలతో రోహిత్ సేన యూఎస్‌ఏలో అడుగుపెట్టింది.

దాదాపు నెల రోజుల పాటు సాగే ఈ టోర్నీటో 55 మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే ఈ సారి మునుపెన్నడూ లేని విధంగా ఈసారి పొట్టి కప్ వేటలో ఇరవై జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఈ జట్లను అయిదు దేశాల చొప్పున నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ దశలో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. ఈ ఎనిమిది జట్లను మళ్లీ రెండు గ్రూప్‌లుగా ఏర్పాటు చేస్తారు. వీటిలో టాప్-2‌లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు చేరుతాయి.

T20 World Cup 2024 India s Super-8 Opponents Revealed

గ్రూప్-ఏలో భారత్‌తో పాటు పాకిస్థాన్, అమెరికా, కెనడా, ఐర్లాండ్ దేశాలు ఉన్నాయి. పాకిస్థాన్ మినహా మిగిలిన మూడు జట్లు పసికూనలే. దీంతో భారత్ సూపర్-8కు అర్హత సాధించడం ఖాయమే. అయితే సూపర్-8లో భారత్ తలపడే ప్రత్యర్థి జట్లు ఏంటని అందరిని వెంటాడుతున్న ప్రశ్న. గ్రూప్‌ బీ, సీ, డీ ల్లో టాప్-2లో నిలిచిన జట్ల ఫలితాలపై సూపర్-8లో భారత్ ప్రత్యర్థి ఎవరని తేలనుంది.

గ్రూప్-ఏలో దాదాపు టీమిండియానే టాపర్‌గా నిలుస్తుంది. దీంతో గ్రూప్‌-సీలో నిలిచిన టాపర్‌ (న్యూజిలాండ్/వెస్టిండీస్)తో, అలాగే గ్రూప్- బీ, గ్రూప్‌-డీలో రెండో ర్యాంక్‌లో ఉన్న జట్లతో (ఇంగ్లండ్/ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా/శ్రీలంక) తదుపరి దశలో రోహిత్ సేన మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. గ్రూప్-బీలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ప్రధాన జట్లు ఉన్నాయి. దీనిలో రెండో ర్యాంక్ ఆస్ట్రేలియా సాధిస్తుందని నిపుణుల అంచనా. అలాగే గ్రూప్-సీలో న్యూజిలాండ్ టాపర్ అవుతుందని, గ్రూప్-డీలో శ్రీలంక రెండో ర్యాంక్‌లో నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.

ఈ లెక్కల ప్రకారం సూపర్-8కు అర్హత సాధించిన జట్లను రెండు గ్రూప్‌లు విభజిస్తే.. గ్రూప్-1లో భారత్‌‌తో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక పోటీ పడనున్నాయి. ఈ నాలుగు జట్లలో టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. అలాగే సూపర్-8లో గ్రూప్-2కు ఇంగ్లండ్, వెస్టిండీస్, పాకిస్థాన్, సౌతాఫ్రికా అర్హత సాధిస్తే.. వీటిలో టాప్-2లో నిలిచిన జట్లు సెమీస్‌కు వెళ్తాయి.

Story first published: Friday, May 31, 2024, 17:28 [IST]
Other articles published on May 31, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+