Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20WC: భారత్ మ్యాచ్‌ల టైమింగ్స్ ఏంటి? రాత్రంతా మేల్కోవాలా? పూర్తి షెడ్యూల్!

ఐపీఎల్ ముగిసిందని బాధ పడాల్సిన అవసరం లేదు!! క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించడానికి మరో మెగా టోర్నీ సిద్ధంగా ఉంది. మరో నాలుగు రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. జూన్ 2న మొదలయ్యే ఈ టోర్నీకి అమెరికా-వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ మహా సమరంలో మునుపెన్నడూ లేని విధంగా ఇరవై దేశాలు బరిలోకి దిగుతున్నాయి.

ఈ దేశాలను అయిదు జట్ల చొప్పున నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ స్టేజ్‌లో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. సూపర్-8కు అర్హత సాధించిన ఎనిమిది జట్లను రెండు గ్రూప్‌లుగా ఏర్పాటు చేస్తారు. వీటిల్లో టాప్-2 జట్లు సెమీఫైనల్స్‌కు చేరుతాయి. సెమీస్‌లో గెలిచిన జట్లు జూన్ 29న బార్డబోస్ వేదికగా ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.

T20 World Cup 2024 India Squad schedule date venues match time

టీమిండియా గ్రూప్-ఏలో ఉంది. భారత్‌తో పాటు పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడా, ఆతిథ్య జట్టు అమెరికా ఉన్నాయి. గ్రూప్-ఏ మ్యాచ్‌లన్నింటికీ అమెరికానే ఆతిథ్యం ఇస్తుంది. అయితే ఈ మ్యాచ్‌లు భిన్నసమయాల్లో ప్రారంభం కానున్నాయి. కానీ భారత్ మ్యాచ్‌లు మాత్రం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. అక్కడ స్థానిక కాలమాన ప్రకారం కొన్ని ఉదయం 9.30 గంటలకు, కొన్ని ఉదయం 10.30 గంటలకు మొదలైనా మన టైమింగ్స్‌లో మాత్రం రాత్రి 8 గంటలకే.

గ్రూప్-ఏలో భారత్ తలపడే మ్యాచ్‌‌లు
జూన్ 5: భారత్ వర్సెస్ ఐర్లాండ్, న్యూయార్క్ - రాత్రి 8 గంటలకు (స్థానికంగా ఉదయం 9.30)
జూన్ 9: భారత్ వర్సెస్ పాకిస్థాన్, న్యూయార్క్ - రాత్రి 8 గంటలకు (స్థానికంగా ఉదయం 9.30)
జూన్ 12: భారత్ వర్సెస్ అమెరికా, న్యూయార్క్ - రాత్రి 8 గంటలకు (స్థానికంగా ఉదయం 9.30)
జూన్ 15: భారత్ వర్సెస్ కెనడా, ఫ్లోరిడా - రాత్రి 8 గంటలకు (స్థానికంగా ఉదయం 10.30)

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్
రిజర్వ్ ప్లేయర్లు: శుభ్‍మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్

టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్‌‌లు
గ్రూప్‌-ఎ: భారత్, కెనడా, ఐర్లాండ్, పాకిస్థాన్, అమెరికా
గ్రూప్‌-బి: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, నమీబియా, ఒమన్, స్కాట్లాండ్‌
గ్రూప్‌-సి: అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్, పపువా న్యూ గినియా, ఉగాండా, వెస్టిండీస్‌
గ్రూప్‌-డి: బంగ్లాదేశ్, నేపాల్, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, శ్రీలంక

Story first published: Tuesday, May 28, 2024, 9:11 [IST]
Other articles published on May 28, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+