For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20WC: సెమీస్‌కు చేరే జట్లు ఇవే- లారా & గవాస్కర్ జోస్యం

మరో నాలుగు రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ మహా సమరంలో విజేతగా నిలవడానికి ఈసారి ఏకంగా 20 జట్లు పోటీపడుతున్నాయి. దాదాపు నెల రోజుల పాటు సాగే ఈ టోర్నీటో 55 మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే ప్రపంచకప్ ప్రారంభంకాక ముందే విజేతగా ఎవరు నిలుస్తారు? సెమీ ఫైనల్స్‌కు ఏఏ జట్లు దూసుకెళ్తాయనే చర్చ మొదలైంది.

బలాబలాను అంచనా వేస్తూ సెమీస్‌కు చేరే టీమ్స్‌ను కొందరు మాజీ క్రికెటర్లు ముందే అంచనా వేశారు. అయితే ఒక్కొక్కరి అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. సెమీ ఫైనల్స్‌కు అఫ్గానిస్థాన్ అర్హత సాధిస్తుందని వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా పేర్కొనడం గమనార్హం. మరోవైపు తెలుగు తేజం అంబటి రాయుడు ఆతిథ్య జట్టు వెస్టిండీస్ సెమీస్‌కు వెళ్లదని తేల్చేశాడు. జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్‌కు వెస్టిండీస్‌తో పాటు అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.

T20 World Cup 2024 Gavaskar and Lara s Semi-Final Predictions

మాజీల అంచనాల ప్రకారం టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్‌కు చేరే జట్లు ఇవే
అంబటి రాయుడు: భారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా
బ్రియాన్ లారా: భారత్, ఇంగ్లండ్, వెస్టిండీస్, అఫ్గనిస్థాన్
సునీల్ గవాస్కర్: భారత్, ఇంగ్లండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా
కాలింగ్‌వుడ్: భారత్, ఇంగ్లండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా
క్రిస్ మోరిస్: భారత్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, ఆస్ట్రేలియా
ఆరోన్ ఫించ్: భారత్, ఇంగ్లండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా
మహ్మద్ కైఫ్: భారత్, ఇంగ్లండ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా
టామ్ మూడీ: భారత్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా
శ్రీశాంత్: భారత్, ఇంగ్లండ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా

కాగా, మహా సమరంలో మునుపెన్నడూ లేని విధంగా ఇరవై దేశాలు బరిలోకి దిగుతున్నాయి. వీటన్నింటినీ అయిదు జట్ల చొప్పున నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ స్టేజ్‌లో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి.సూపర్-8కు క్వాలిఫై అయిన ఎనిమిది జట్లను మళ్లీ రెండు గ్రూప్‌లుగా ఏర్పాటు చేస్తారు. వీటిలో టాప్-2‌లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు చేరుతాయి. సెమీస్‌లో గెలిచిన జట్లు జూన్ 29న బార్బడోస్ వేదికగా ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.

Story first published: Tuesday, May 28, 2024, 14:15 [IST]
Other articles published on May 28, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+