Gautam Gambhir: హెడ్ కోచ్‌గా ద్రావిడ్ రిటెన్షన్.. అలా చేస్తే సంతోషం అంటూ.. గంభీర్ కీలక వ్యాఖ్యలు!
Rahul Dravid: కొన్ని రోజుల క్రితం ముగిసిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఒప్పందం ముగిసింది. దీంతో కొత్తగా హెడ్ కోచ్ పదవి ఎవరికి దక్కుతుందని అంతా చర్చించుకున్నారు. వీరేంద్ర సెహ్వాగ్, ఆశిష్ నెహ్రా తదితరులకు ఈ అవకాశం ఇస్తారని చర్చ జరిగింది. అయితే ఈ అవకాశాన్ని ఆశిష్ నెహ్రా తిరస్కరించినట్లు తెలుస్తోంది.
దీంతో రాహుల్ ద్రావిడ్‌నే ఈ పదవిలో కొనసాగించాలని బీసీసీఐ భావించింది. దీనికి ద్రావిడ్ కూడా ఒప్పుకోవడంతో అతని ఒప్పందాన్ని బీసీసీఐ పొడిగించింది. అతనితోపాటు ఫీల్డింగ్, బౌలింగ్ కోచ్‌లు కూడా కొనసాగుతున్నారు. 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత మాజీ కోచ్ రవిశాస్త్రి పదవీ కాలం ముగిసింది.

ఈ సమయంలోనే రాహుల్ ద్రావిడ్‌కు హెడ్ కోచ్‌గా పదవి దక్కింది. ఈ వరల్డ్ కప్ ఫైనల్ ముగిసిన తర్వాత ద్రావిడ్ పదవీకాలం కూడా ముగిసింది. అయితే అతన్ని ఈ పదవిలో కొనసాగిస్తున్నట్లు బుధవారం నాడు బీసీసీఐ ప్రకటించింది. ఇది చూసిన చాలామంది ఫ్యాన్స్ తెగ సంతోషం వ్యక్తం చేశారు.
దీనిపై మాజీ లెజెండ్ గౌతం గంభీర్ కూడా సంతోషం వ్యక్తం చేశాడు. ద్రావిడ్ కోచింగ్‌లో భారత జట్టు ఇకపై కూడా క్రికెట్‌ను డామినేట్ చేస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు. ద్రావిడ్‌తోపాటు బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్, ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ ఒప్పందాలను కూడా బీసీసీఐ పొడిగించిన సంగతి తెలిసిందే.
'ఇది నిజంగా మంచి నిర్ణయం. టీ20 వరల్డ్ కప్ త్వరలోనే జరగనుంది. ఇలాంటి సమయంలో మొత్తం సపోర్ట్ స్టాఫ్‌ను మార్చడం కరెక్ట్ కాదు. రాహుల్ కూడా దీనికి ఒప్పుకోవడం సంతోషం. చాలాకాలంగా చేస్తున్నట్లే ఇకపై కూడా భారత జట్టు డామినేటింగ్ క్రికెట్ ఆడుతుందని ఆశిస్తున్నా' అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications