T20 World Cup: హెడ్‌కోచ్‌గా మళ్లీ ద్రావిడ్.. బీసీసీఐ తీసుకున్న బెస్ట్ నిర్ణయం అంటున్న ఫ్యాన్స్!
Rahul Dravid: కొన్ని రోజుల క్రితం ముగిసిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఒప్పందం ముగిసింది. దీంతో కొత్తగా హెడ్ కోచ్ పదవి ఎవరికి దక్కుతుందని అంతా చర్చించుకున్నారు. వీరేంద్ర సెహ్వాగ్, ఆశిష్ నెహ్రా తదితరులకు ఈ అవకాశం ఇస్తారని చర్చ జరిగింది. అయితే ఈ అవకాశాన్ని ఆశిష్ నెహ్రా తిరస్కరించినట్లు తెలుస్తోంది.
దీంతో రాహుల్ ద్రావిడ్‌నే ఈ పదవిలో కొనసాగించాలని బీసీసీఐ భావించింది. దీనికి ద్రావిడ్ కూడా ఒప్పుకోవడంతో అతని ఒప్పందాన్ని బీసీసీఐ పొడిగించింది. అతనితోపాటు ఫీల్డింగ్, బౌలింగ్ కోచ్‌లు కూడా కొనసాగుతున్నారు. 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత మాజీ కోచ్ రవిశాస్త్రి పదవీ కాలం ముగిసింది.

ఈ సమయంలోనే రాహుల్ ద్రావిడ్‌కు హెడ్ కోచ్‌గా పదవి దక్కింది. ఈ వరల్డ్ కప్ ఫైనల్ ముగిసిన తర్వాత ద్రావిడ్ పదవీకాలం కూడా ముగిసింది. అయితే అతన్ని ఈ పదవిలో కొనసాగిస్తున్నట్లు బుధవారం నాడు బీసీసీఐ ప్రకటించింది. ఇది చూసిన చాలామంది ఫ్యాన్స్ తెగ సంతోషం వ్యక్తం చేశారు.
వచ్చే ఏడాది యూఎస్, వెస్టిండీస్ వేదికగా జరిగే టీ20 వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో కొత్త కోచ్‌ను తీసుకోవడం ఎంత వరకు సమంజసం అని కొందరు ప్రశ్నించారు. వాళ్లంతా కూడా ద్రావిడ్‌ను కొనసాగించడం బీసీసీఐ తీసుకున్న చాలా గొప్ప నిర్ణయం అని అంటున్నారు.
ద్రావిడ్‌ను కొనసాగించడం వల్ల భారత జట్టు మరింత బలంగా తయారవుతుందని, వచ్చే పొట్టి ప్రపంచకప్‌లో కచ్చితంగా సత్తా చాటుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రవిశాస్త్రి కూడా రెండు టర్మ్‌లు కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడని, ద్రావిడ్‌కు కూడా అలాంటి అవకాశం ఇవ్వడం కరెక్ట్ నిర్ణయమని అంటున్నారు. మరి వన్డే వరల్డ్ కప్‌లో చూపించినట్లే.. పొట్టి ప్రపంచ కప్‌లో కూడా భారత్ సత్తా చాటుతుందేమో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications