Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20WC: టీ20ల్లో ఇంగ్లండ్ చెత్త రికార్డు

టీ20 వరల్డ్ కప్-2024లో ఘనంగా బోణీ కొట్టాలనుకున్న డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు వరుణుడు షాక్ ఇచ్చాడు. గ్రూప్-బీలో స్కాట్లాండ్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణం అయ్యింది. వరుణుడు దోబుచులాడిన ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్ పది ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసింది. కానీ వర్షం ధాటికి ఆటను కొనసాగించలేక మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ పది ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 90 పరుగులు చేసింది. ఓపెనర్లు జార్జ్‌ మున్సీ (41 నాటౌట్‌; 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మైకెల్‌ జోన్స్‌ (45 నాటౌట్‌; 30 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తాచాటారు. అయితే టాస్ పడిన తర్వాత వెంటనే ఆటకు అంతరాయం కలిగింది. కానీ కాసేపటికే మ్యాచ్‌ను ప్రారంభించారు.

T20 World Cup 2024 England Still Winless Against European Teams in T20Is

దూకుడుగా ఆడిన స్కాట్లాండ్ పవర్‌ప్లేలో 49 పరుగులు చేసింది. అయితే 6.2 ఓవర్లకు 51/0 స్థితిలో ఉన్నప్పుడు ఆటకు తొలిసారి అంతరాయం కలిగింది. దాదాపు రెండు గంటల తర్వాత మ్యాచ్‌ను తిరిగి ప్రారంభించారు. కానీ మ్యాచ్‌ను పది ఓవర్లకే కుదించారు. స్కాట్లాండ్ 90 పరుగులు చేసినప్పటికీ డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఇంగ్లండ్‌‌కు లక్ష్యాన్ని 10 ఓవర్లకు 109 పరుగులుగా నిర్ణయించారు. కానీ వరుణుడి ధాటికి ఛేదన ప్రారంభంకాలేదు. దీంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

అయితే వరుణుడి కారణంగా ఇంగ్లండ్ చెత్త రికార్డును కొనసాగించాల్సి వచ్చింది. టీ20 ఫార్మాట్‌లో ఇంగ్లండ్ ఇప్పటివరకు యూరోపియన్ జట్లపై గెలుపు రుచి చూడలేకపోయంది. ఈ పొట్టి కప్‌లో అయినా ఈ రికార్డును బ్రేక్ చేయాలనుకున్న ఇంగ్లండ్‌కు వరుణుడు గట్టి షాక్ ఇచ్చాడు. దీంతో యూరోపియన్ జట్లతో జరిగిన అయిదు మ్యాచ్‌ల్లో విజయం లేకుండా ముగించాల్సి వచ్చింది.

2009లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓటమిపాలైంది. 2010లో ఐర్లాండ్‌తో జరిగిన టీ20లో ఫలితం తేలలేదు. 2014లో నెదర్లాండ్స్‌తో తలపడిన పోరులో, అలాగే 2022లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ పరాజయాన్ని చవిచూసింది. తాజాగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ వర్షార్పరణం అయ్యింది. మొత్తంగా టీ20ల్లో యూరోపియన్ జట్లతో ఆడిన అయిదు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ మూడింట్లో ఓడింది. రెండు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు.

Story first published: Wednesday, June 5, 2024, 10:43 [IST]
Other articles published on Jun 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+