T20WC: సూపర్-8లో ఆస్ట్రేలియా షెడ్యూల్ ఇదే! భారత్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
అన్ని ఫార్మాట్లలో విశ్వవిజేతగా నిలవాలని ఆస్ట్రేలియా పట్టుదలతో ముందుకెళ్తోంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్, వన్డే వరల్డ్ కప్‌ను కైవసం చేసుకున్న కంగారూల సేన పొట్టి ఫార్మాట్ కప్‌పై గురిపెట్టింది. టీ20 వరల్డ్ కప్-2024లో లీగ్ స్టేజ్‌లో వరుస విజయాలతో హోరెత్తించి మరో మ్యాచ్ మిగిలుండగానే సూపర్-8కు అర్హత సాధించిది.
పసికూన నమీబియాతో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజృంభించింది. 5.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి రికార్డు విజయాన్ని సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన నమీబియా ఆసీస్ బౌలర్ల ధాటికి 72 పరుగులకే కుప్పకూలింది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ వికెట్ కోల్పోయి పవర్‌ప్లేలోపే విజయతీరాలకు చేరింది. ఆసీస్‌కు ఇది హ్యాట్రిక్ విజయం.

కాగా, గ్రూప్-బీలో ఉన్న ఆసీస్ ఆడిన మూడింట్లో గెలిచి ఆరు పాయింట్లతో ప్రస్తుతం టేబుల్ టాప్‌లో నిలిచింది. స్కాట్లాండ్ మినహా ఇతర జట్టు కంగారూల పాయింట్లను అధిగమించే అవకాశం లేదు. దీంతో ఆస్ట్రేలియా తదుపరి దశకు అధికారికంగా అర్హత సాధించింది. ఇక ఆసీస్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌తో ఆడనుంది. సూపర్ ఫామ్‌లో ఉన్న కంగారూలు స్కాట్లాండ్‌ను ఓడించడం దాదాపు ఖాయమే.
మరోవైపు ఆస్ట్రేలియాతో పాటు గ్రూప్-డీలో ఉన్న దక్షిణాఫ్రికా కూడా లీగ్ స్టేజ్‌ను దాటడంతో సూపర్-8 షెడ్యూల్ దాదాపు ఖరారైంది. స్కాట్లాండ్‌పై నెగ్గి గ్రూప్ బీ టాపర్‌గా ఆస్ట్రేలియా నిలిస్తే.. గ్రూప్-ఏ, గ్రూప్-సీలోని రెండో స్థానంలో నిలిచే జట్లతో, గ్రూప్-డీలో అగ్రస్థానంలో ఉన్న జట్టుతో కంగారూలు పోటీపడాల్సి ఉంటుంది. గ్రూప్-డీలో సౌతాఫ్రికా టాపర్ అవ్వడం దాదాపు ఖాయమైంది. దీంతో సూపర్-8లో జూన్ 21న ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా తలపడాల్సి ఉంటుంది.
అయితే గ్రూప్-ఏలో భారత్ అగ్రస్థానంలో నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టేబుల్ టాపర్‌గా టీమిండియా లీగ్ స్టేజ్‌ను ముగిస్తే సూపర్-8లో ఆస్ట్రేలియాతో మన జట్టు పోటీపడే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే గ్రూప్-ఏలో సెకండ్ టాపర్‌తో మాత్రమే ఆసీస్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఈ లెక్క ప్రకారం రెండో స్థానం సాధించే అమెరికా/పాకిస్థాన్‌తో కంగారూలు తలపడాలి.
ఆస్ట్రేలియా సూపర్-8 షెడ్యూల్ (అంచనా)
జూన్ 19- ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్/అఫ్గానిస్థాన్
జూన్ 21- ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా
జూన్ 23- ఆస్ట్రేలియా వర్సెస్ అమెరికా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications