For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

AFG vs UGA: రెచ్చిపోయిన ఓపెనర్లు.. అఫ్గానిస్థాన్ భారీ స్కోరు

T20 World Cup 2024: గయానా వేదికగా ఉగాండతో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ (76; 45 బంతుల్లో, 4 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇబ్రహీం జద్రాన్ (70; 46 బంతుల్లో, 9 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధశతకాలతో రెచ్చిపోయారు. కాస్మస్ (2/25), బ్రియాన్ మసాబా (2/21) చెరో రెండు వికెట్లు తీశారు.

అయితే అఫ్గానిస్థాన్ ఓ దశలో 14 ఓవర్లకు 152/0తో పటిష్టస్థితిలో నిలిచింది. 200+ స్కోరు అఫ్గాన్ సులువుగా సాధిస్తుందని భావించారతంతా. కానీ ఉగాండ బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. క్రమంగా వికెట్లు తీస్తూ స్కోరుబోర్డును కట్టడి చేశారు. చివరి ఆరు ఓవర్లలో 31 పరుగులే ఇచ్చి అయిదు వికెట్లు పడగొట్టాడు.

T20 World Cup 2024 Afghanistan s Gurbaz and Zadran Hit Half-Centuries in Big Score Against Uganda

టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన అఫ్గానిస్థాన్‌కు శుభారంభం దక్కింది. తొలి వికెట్‌కు గుర్బాజ్-జద్రాన్ 154 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఆది నుంచే వీరిద్దరు దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డు పరుగులు పెట్టించారు. పవర్‌ప్లేలో 66 పరుగులు సాధించారు. ఈ క్రమంలో గుర్జాబ్ 28 బంతుల్లో, జద్రాన్ 34 బంతుల్లో అర్ధశతకాలు సాధించారు. అనంతరం గేర్ మార్చి మరింత దూకుడుగా ఆడారు. 14 ఓవర్లలోనే 150 పరుగుల మార్క్‌ను అందుకున్నారు.

అయితే ఉగాండ కెప్టెన్ మసాబా అఫ్గాన్ ఇన్నింగ్స్‌ను మలుపు తిప్పాడు. జద్రాన్‌ను ఔట్ చేసి అఫ్గాన్‌ను తొలి దెబ్బకొట్టాడు. తర్వాతి ఓవర్‌లోనే గుర్బాజ్‌ను అల్పేష్ ఔట్ చేసి అఫ్గాన్ స్కోరు వేగానికి కళ్లెం వేశాడు. ఆ తర్వాత బ్యాటర్లు వరుసగా వికెట్లు కోల్పోయారు. నజీబుల్లా (2; 3 బంతుల్లో), మహ్మద్ నబీ (14*; 16 బంతుల్లో), గుల్బాదిన్ (4; 5 బంతుల్లో), అజ్మతుల్లా (5; 5 బంతుల్లో) నిరాశపరిచారు. ఓపెనర్లు మినహా మిగిలిన బ్యాటర్లెవరూ బౌండరీ సాధించకపోవడం గమనార్హం.

Story first published: Tuesday, June 4, 2024, 8:16 [IST]
Other articles published on Jun 4, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+