Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20WC: సంచలనం.. న్యూజిలాండ్‌పై అఫ్గానిస్థాన్ ఘన విజయం

టీ20 వరల్డ్ కప్‌-2024లో మరో సంచలనం నమోదైంది. న్యూజిలాండ్‌ను అఫ్గానిస్థాన్‌ను చిత్తుగా ఓడిచింది. గ్రూప్-సీలో భాగంగా గయానా వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో కివీస్‌పై అఫ్గాన్ 84 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఆల్‌రౌండ్ షోతో సత్తాచాటి ఛాంపియన్‌లా ప్రదర్శన చేసింది. అంతర్జాతీయ క్రికెట్‌లో న్యూజిలాండ్‌పై అఫ్గానిస్థాన్‌కు ఇదే తొలి విజయం. రహ్మనుల్లా గుర్బాజ్ (80; 56 బంతుల్లో, 5 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగడంతో మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 159 పరుగులు చేసింది.

ఇబ్రహీం జద్రాన్ (44; 41 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) నిదానంగా ఆడాడు. కివీస్ బౌలర్లలో బౌల్ట్ (2/22), మ్యాట్ హెన్రీ (2/37) చెరో రెండు వికెట్లు, ఫెర్గూసన్ (1/28) ఓ వికెట్ తీశారు. అనంతరం ఛేదనలో న్యూజిలాండ్ 15.2 ఓవర్లలోనే 75 పరుగులకు కుప్పకూలింది. ఫజాల్లా ఫరూకీ (4/17), రషీద్ ఖాన్ (4/17) చెరో నాలుగు వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. మహ్మద్ నబీ (2/16) రెండు వికెట్లు తీశాడు.

T20 World Cup 2024 Afghanistan Stuns New Zealand with Sensational Victory

ఛేజింగ్‌లో ఏ దశలోనూ న్యూజిలాండ్ పోరాట పటిమ చూపించలేదు. ఇన్నింగ్స్ తొలి బంతికే ఫరూకీ చేతిలో ఫిన్ అలెన్ గోల్డెన్ డకౌటయ్యాడు. ఆ తర్వాత బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. స్లో పిచ్‌పై కివీస్ బ్యాటర్లు వణికిపోయారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (9; 13 బంతుల్లో, 1 ఫోర్) సైతం అఫ్గాన్ బౌలర్లకు తలవంచాడు. ఇద్దరు బ్యాటర్లు మినహా మిగిలెనవరూ రెండంకెల స్కోరును అందుకోలేకపోయారు. గ్లెన్ ఫిలిప్స్ (18; 18 బంతుల్లో, 2 ఫోర్లు), హెన్రీ (12; 17 బంతుల్లో) టాప్ స్కోరర్లు.

T20 World Cup 2024 Afghanistan Stuns New Zealand with Sensational Victory

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్‌కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు గుర్బాజ్-జద్రాన్ మరోసారి శతక భాగస్వామ్యాన్ని నమోదుచేశారు. 14.3 ఓవర్లలో తొలి వికెట్‌కు 103 పరుగులు జత చేశారు. అయితే జద్రాన్ జాగ్రత్తగా ఆడటంతో భాగస్వామ్యం నిదానంగా సాగింది. వన్‌డౌన్‌లో వచ్చిన అజ్మతుల్లా (22; 13 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు) దూకుడుగా పరుగులు సాధించాడు.

Story first published: Saturday, June 8, 2024, 8:42 [IST]
Other articles published on Jun 8, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+