T20 World Cup: చరిత్ర సృష్టించిన అఫ్గాన్.. రికార్డులే రికార్డులు!
టీ20 వరల్డ్ కప్-2024ను అఫ్గానిస్థాన్ ఘనంగా ఆరంభించింది. గయానా వేదికగా మంగళవారం ఉగాండతో జరిగిన మ్యాచ్‌లో 125 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. స్లో పిచ్‌పై ఆల్‌రౌండ్ షోతో సత్తాచాటి రెండు పాయింట్లు గెలిచి గ్రూప్-సీలో టాప్‌లో నిలిచింది. +6.250 రన్‌రేటు సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 183 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు వచ్చిన ఉగాండ 16 ఓవర్లలో 58 పరుగులకే కుప్పకూలింది. ఈ క్రమంలో అఫ్గానిస్థాన్ పలు రికార్డులు నెలకొల్పింది. టీ20 కప్ చరిత్రలో అఫ్గాన్‌కు పరుగుల పరంగా ఇది రెండో అత్యధిక విజయం. 2021 ప్రపంచకప్‌లో స్కాట్‌లాండ్‌పై 130 పరుగుల గెలుపు అఫ్గాన్ అత్యుత్తం.

ఇక ఓవరాల్‌గా టీ20 వరల్డ్ కప్‌లో ఇది నాలుగో ఘన విజయం. తొలి మూడు స్థానాల్లో శ్రీలంక (కెన్యాపై, 172 పరుగులు), అఫ్గానిస్థాన్ (స్కాట్‌లాండ్, 130 పరుగులు), దక్షిణాఫ్రికా (స్కాట్‌లాండ్‌పై, 130 పరుగులు) ఉన్నాయి. కాగా, విజయంలో కీలక పాత్ర పోషించిన రహ్మనుల్లా గుర్బాజ్ (76; 45 బంతుల్లో, 4 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇబ్రహీం జద్రాన్ (70; 46 బంతుల్లో, 9 ఫోర్లు, 1 సిక్సర్), బౌలర్ ఫరూకీ (5/9) కూడా రికార్డులకెక్కారు.
టీ20 వరల్డ్ కప్ చరిత్రలో తొలి వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన రెండో జోడీగా చరిత్రకెక్కారు. ఓవరాల్‌గా ఏ వికెట్‌కు అయినా అత్యధిక పరుగుల భాగస్వామ్యం జోడించిన నాలుగో జోడీగా ఘనత సాధించారు. ఈ జాబితాలో హేల్స్-బట్లర్ (170 రన్స్, తొలి వికెట్‌కు), రొసో-డికాక్ (168 రన్స్, రెండో వికెట్‌కు), సంగక్కర, జయవర్థనే (166, రెండో వికెట్‌కు), గుర్బాజ్-జద్రాన్ (154 రన్స్, తొలి వికెట్‌కు) టాప్-4లో ఉన్నారు.
ఇక అయిదు వికెట్లతో విజృంభించిన ఫరూకీ టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో అత్యుత్తమ గణాంకాలు సాధించిన బౌలర్ల జాబితాలో నాలుగో స్థానం దక్కించుకున్నాడు. అజంతా మెండిస్ (6/8), హెరాత్ (5/3), ఉమర్ గుల్ (5/6), ఫరూకీ (5/9), సామ్ కరన్ (5/10) టాప్-5లో ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications