For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup: చరిత్ర సృష్టించిన జోన్స్..యువీ సిక్సర్ల రికార్డు బ్రేక్

టీ20 వరల్డ్ కప్ - 2024 ప్రారంభ మ్యాచ్‌లోనే రికార్డులు బద్దలయ్యాయి. క్రికెట్ లవర్స్ ఆశించినట్లుగానే మెగా టోర్నీ ఘనంగా ఆరంభమైంది. తొలి మ్యాచ్‌లోనే పరుగుల వరద పారింది. సినిమాలో ట్విస్ట్‌లు మాదిరిగానే గెలుపు ఆశలు లేని స్థితి నుంచి అమెరికా అదరగొట్టి విజయతీరాలకు చేరింది. కెనడాపై ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. గ్రూప్-ఏలో రెండు పాయింట్లతో బోణీ కొట్టింది.

తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 194 పరుగులు చేసింది. నవనీత్ దాలివాల్ (61; 44 బంతుల్లో, 6 ఫోర్లు, 3 సిక్సర్లు), నికోలస్ కిర్టన్ (51; 31 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలు సాధించారు. అలీ ఖాన్, హర్మీత్ సింగ్, కోరి అండర్సన్ తలో వికెట్ తీశారు. అనంతరం ఛేదనలో అమెరికా 17.4 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

T20 World Cup 2024 Aaron Jones Sets Record for Highest Score in T20I World Cup Run Chase by a Non-Opener

ఆరోన్ జోన్స్ (94 నాటౌట్; 40 బంతుల్లో, 4 ఫోర్లు, 10 సిక్సర్లు), ఆండ్రిస్ గోస్ (65; 46 బంతుల్లో, 7 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర బ్యాటింగ్ చేశారు. ఓ దశలో ఎనిమిది ఓవర్లకు అమెరికా 48/2 స్కోరు మాత్రమే చేసింది.కానీ జోన్స్-గోస్ ఇన్నింగ్స్ స్వరూపాన్ని మార్చేశారు. మూడో వికెట్‌కు 131 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును గెలిపించారు.

అయితే ఈ క్రమంలో ఆరోన్ జోన్స్ అరుదైన రికార్డులు నెలకొల్పాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఛేదనలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన నాన్ ఓపెనర్‌గా నిలిచాడు. అలాగే అత్యధిక సిక్సర్లు బాదిన నాన్‌ఓపెనర్‌గానూ చరిత్రకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా ప్లేయర్ రొసో పేరిట ఉండేది. రోసో ఎనిమిది సిక్సర్లు సాధించాడు.

టీ20 వరల్డ్ కప్‌లో ఓవరాల్‌గా ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు సాధించిన రెండో ప్లేయర్‌గా ఆరోన్ జోన్స్ నిలిచాడు. పొట్టి ప్రపంచకప్‌లో క్రిస్ గేల్ ఇంగ్లండ్‌పై 11 సిక్సర్లు, దక్షిణాఫ్రికా‌పై 10 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో గేల్, జోన్స్ తర్వాతి స్థానాల్లో రోసో (8), యువరాజ్ సింగ్ (7), డేవిడ్ వార్నర్ (7) ఉన్నారు.

Story first published: Sunday, June 2, 2024, 11:52 [IST]
Other articles published on Jun 2, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+