For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20 ప్రపంచకప్‌లో కొత్త జట్లు రాబోతోన్నాయ్: ప్రధాన జట్లకు బిగ్ ఛాలెంజ్: మరింత ఇంట్రెస్టింగ్

T20 World Cup 2022: Zimbabwe and Netherlands is booked their place

క్యాన్‌బెర్రా: ప్రస్తుతం క్రికెట్ ఆడే దేశాల దృష్టి మొత్తం టీ20 ప్రపంచకప్ మెగా టోర్నమెంట్ మీదే ఉంది. అందుకే ఆయా దేశాలన్నీ తీరిక లేని క్రికెట్ ఆడుతోన్నాయి. భారత్ సహా ప్రధాన దేశాల జట్లన్నీ టీ20 సిరీస్‌, వన్డే ఇంటర్నేషనల్స్‌ల్లో ప్రత్యర్థులతో తలపడుతున్నాయి. టీమిండియా ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోంది. ఆస్ట్రేలియా జట్టు శ్రీలంకతో అన్ని ఫార్మట్‌ల సిరీస్‌లల్లో తలపడింది. బంగ్లాదేశ్.. వెస్టిండీస్‌లో టూర్ కొనసాగిస్తోంది. న్యూజిలాండ్ జట్టు- ఐర్లాండ్‌తో ఆడుతోంది.

క్రికెట్ ప్రపంచం బిజీ..

క్రికెట్ ప్రపంచం బిజీ..

ఇంగ్లాండ్ పర్యటన ముగిసిన వెంటనే టీమిండియా అటు నుంచి అటే వెస్టిండీస్ వెళ్తుంది. దక్షిణాఫ్రికా జట్టు ఇంగ్లాండ్‌లో దిగుతుంది. పాకిస్తాన్ ఇప్పటికే శ్రీలంక పర్యటనకు బయలుదేరి వెళ్లింది. ఈ రెండు దేశాల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ఈ ఉదయం 10 గంటలకు ఆరంభం కానుంది. ఇలా క్రికెట్ ఆడే దేశాలన్నీ టైట్ షెడ్యూల్‌ను ఎదుర్కొంటోన్నాయి. ఆయా జట్లన్నీ తమ సిరీస్‌లల్లో టీ20 మ్యాచ్‌లకు అధిక ప్రాధాన్యత ఇస్తోన్నాయి.

ఆస్ట్రేలియా వేదికగా..

ఆస్ట్రేలియా వేదికగా..

దీనికి ప్రధాన కారణం- టీ20 ప్రపంచ కప్ ముందుండటమే. అక్టోబర్ 16వ తేదీ నుంచి టీ20 ప్రపంచ కప్ మెగా టోర్నమెంట్ ఆరంభం కాబోతోంది. దీనికి ఆస్ట్రేలియా ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. ఈ టోర్నమెంట్‌ను ఆస్ట్రేలియా నిర్వహించబోతోండటం ఇదే తొలిసారి. దీనికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఇక మిగిలింది వంద రోజులు మాత్రమే. ఇవ్వాళ్టి నుంచి సరిగ్గా వందో రోజు టీ20 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్ ఆరంభమౌతుంది. ఫైనల్‌తో కూడా కలుపుకొని మొత్తం 45 మ్యాచ్‌లు ఉంటాయి.

కొత్త జట్లు ఎంట్రీ..

కొత్త జట్లు ఎంట్రీ..

ఈ టోర్నమెంట్‌లో తాజాగా రెండు కొత్త జట్లు ఎంట్రీ ఇచ్చాయి. ఇందులో ప్రవేశించడానికి నిర్వహించిన క్వాలిఫయర్స్‌లల్లో తమ ప్రత్యర్థులను మట్టి కరిపించాయి. ఆ రెండు జట్లు.. జింబాబ్వే, నెదర్లాండ్స్. బులవాయోలో జరిగిన క్వాలిఫయర్‌లో జింబాబ్వే జట్టు పపువా న్యూగినియాను 27 పరుగుల తేడాతో ఓడించింది. టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.

జింబాబ్వేను చూడబోతోన్నాం..

జింబాబ్వేను చూడబోతోన్నాం..

ఓపెనర్లు రెజిస్ చకబ్వా-30, కేప్టెన్ క్రెగ్ ఇర్విన్-38, వెస్లీ మధెవెరె-42, సికందర్ రెజా-22, సీన్ విలియమ్స్-22 పరుగులు చేశారు. మిల్టన్ షుంబా-29, ర్యాన్ బర్ల్-10 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. అనంతరం బరిలోకి దిగిన పపువా న్యూగినియా జట్టు చివరి వరకూ పోరాడింది గానీ లక్ష్యాన్ని అందుకోలేదు. 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఓపెనర్ లెగా సియాకా డకౌట్ అయ్యాడు. కేప్టెన్ అస్సద్ వాల-7, ఛార్లెస్ అమిని-31, సెసె బవు-5, టోని ఉరా-66, రిలే హెకురె-17, నోర్మన్ వనువ-3, హిలావరె-9, కబువా మొరియా-16, సైమన్ అతై-2 పరుగులు చేశారు.

నెదర్లాండ్స్ కూడా..

నెదర్లాండ్స్ కూడా..

మరో క్వాలిఫయర్‌లో నెదర్లాండ్ జట్టు యూఎస్ఏను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ 19.4 ఓవర్లల్లో 138 పరుగులు చేయగా.. నెదర్లాండ్స్ దాన్ని ఛేదించింది. 19 ఓవర్లల్లో మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అధిగమించింది. బస్ డె లెడె 91 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఓపెనర్ స్టీఫెన్ డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ మాక్స్ ఓ డోవ్డ్ 16 పరుగులకే వెనుదిరిగాడు. కేప్టెన్ ఎడ్వర్డ్స్‌తో కలిసి లెడె జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ గెలుపుతో నెదర్లాండ్స్ కూడా టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది.

Story first published: Saturday, July 16, 2022, 7:51 [IST]
Other articles published on Jul 16, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+