Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నిర్ణయం మార్చుకున్న బీసీసీఐ: బుమ్రా గాయపడ్డ వేళ - సన్‌రైజర్స్ స్పీడ్‌స్టర్‌కు పిలుపు

T20 World Cup 2022: Umran Malik and Mohammad Siraj to travel with team India

ముంబై: రోహిత్ శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ కోసం సన్నద్ధమౌతోంది. దక్షిణాఫ్రికాతో టీ20, వన్డే ఇంటర్నేషనల్స్ ఆడుతోంది. భారత పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా జట్టుతో ఇప్పటికే తొలి టీ20 మ్యాచ్‌ను ముగించుకుంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో 1-0 తేడాతో ముందంజలో ఉంది. ఆదివారం రెండో టీ20 మ్యాచ్ జరుగనుంది. గువాహటి దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. తిరువనంతపురం నుంచి ఈ రెండు జట్లు అస్సాం చేరుకున్నాయి.

బుమ్రా తప్పుకోవడంతో..

బుమ్రా తప్పుకోవడంతో..

ఈ సిరీస్ నుంచి టీమిండియా స్పీడ్‌స్టర్ జస్‌ప్రీత్ బుమ్రా తప్పుకొన్న విషయం తెలిసిందే. వెన్నెముక ఫ్రాక్చర్‌తో అతను బాధపడుతున్నాడు. దక్షిణాఫ్రికాతో టీ20, వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్‌కు అందుబాటులో ఉండట్లేదు. బ్యాక్ పెయిన్ ప్రభావం వల్ల వచ్చే టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌కు కూడా దూరమౌతాడంటూ వార్తలొచ్చాయి. అనేక కథనాలు వెలువడ్డాయి. వెన్నెముక ఫ్రాక్చర్‌కు సర్జరీ చేయించుకోవాలనే ఉద్దేశంతో బుమ్రా ఉన్నాడని, సర్జరీ చేయించుకుంటే మాత్రం బెడ్ రెస్ట్ అవసరమౌతుందంటూ అంచనా వేశాయి.

సిరాజ్ సెలెక్ట్..

సిరాజ్ సెలెక్ట్..

బుమ్రా అందుబాటులో లేకపోవడం వల్ల దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం ఇప్పటికే హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేసింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్. బుమ్రా స్థానాన్ని సిరాజ్‌తో భర్తీ చేసినట్లు ఇదివరకే ప్రకటించింది. తుదిజట్టులో చోటు దక్కుతుందా? లేదా? అనేది పక్కన పెడితే మిగిలిన రెండు టీ20 మ్యాచ్‌ల కోసం అతణ్ని ఎంపిక చేసింది బీసీసీఐ. ఈ సిరీస్ తరువాత ఆరంభం అయ్యే మూడు వన్డే ఇంటర్నేషనల్స్ కోసం మహ్మద్ షమీని తీసుకోవచ్చనే ప్రచారమూ ఉంది.

ఉమ్రాన్ మాలిక్‌కూ పిలుపు..

ఉమ్రాన్ మాలిక్‌కూ పిలుపు..

ఇప్పుడు తాజాగా మరో కొత్త పేరు కూడా వెలుగులోకి వచ్చింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పీడ్ స్టర్ ఉమ్రాన్ మాలిక్‌ను కూడా పిలిపించింది బీసీసీఐ. ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్.. ఇద్దరూ టీ20 ప్రపంచకప్ కోసం జట్టుతో కలిసి ఆస్ట్రేలియా విమానం ఎక్కబోతోన్నారు. బుమ్రా అందుబాటులో లేకపోవడం వల్ల నెట్ ప్రాక్టీస్ సమయంలో ఆ లోటును భర్తీ చేయడానికే- వీరిద్దరినీ బీసీసీఐ ఆస్ట్రేలియాకు పంపించనున్నట్లు చెబుతున్నారు. నెట్ బౌలర్లకు బ్యాకప్‌గా వీరిద్దరూ ఆస్ట్రేలియాకు బయలుదేరి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ఐపీఎల్‌లో సత్తా..

ఐపీఎల్‌లో సత్తా..

ఐపీఎల్‌లో ఉమ్రాన్‌కు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. నిలకడగా 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులను సంధించగల శక్తి సామర్థ్యాలు అతని సొంతం. ఐపీఎల్ 2022 సీజన్‌లో మొత్తంగా 22 వికెట్లను పడగొట్టాడీ సన్‌రైజర్స్ బౌలర్. టీ20 ఇంటర్నేషనల్స్‌లో అరంగేట్రం చేశాడు. జూన్‌లో ఐర్లాండ్‌లో పర్యటించాడు. అక్కడ అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయాడు. పేలవమైన ఎకానమీ రేటు 12.44ను నమోదు చేశాడు. మూడు టీ20ల్లో రెండు వికెట్లే పడగొట్టాడు.

Story first published: Saturday, October 1, 2022, 10:04 [IST]
Other articles published on Oct 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+