For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20 ప్రపంచకప్ అండర్ డాగ్స్ - సంచలనాలు ఖాయం..!!

T20 World Cup 2022, SL vs NAMIBIA: West Indies and Sri Lanka favored in first round

మెల్‌బోర్న్: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్ ఇంకాస్సేపట్లో ఆరంభం కాబోతోంది. ఇవ్వాళ రెండు మ్యాచ్‌లు షెడ్యూల్ అయ్యాయి. ఇందులో ఒకటి ఉదయం 9:30 గంటలకు మొదలవుతుంది. తొలి మ్యాచ్‌కు మెల్‌బోర్న్‌ గీలాంగ్‌లోని సైమండ్స్ స్టేడియం వేదికగా మారింది. శ్రీలంకతో నమీబియా తలపడబోతోంది తొలి రౌండ్ మ్యాచ్‌లో. మధ్యాహ్నం 1:30కు రెండో మ్యాచ్ ఆరంభమౌతుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్-నెదర్లాండ్స్ పోటీ పడనున్నాయి.

తొలి రౌండ్ మ్యాచ్‌లో శ్రీలంక ఆడబోతోండటం ఆసక్తి కలిగించేదే. 2007లో ఈ మెగా ఈవెంట్ ఆరంభమైనప్పటి నుంచీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా కప్‌ను అందుకోలేదు లంకేయులు. మూడుసార్లు మాత్రం ఫైనల్స్ చేరారు గానీ అదృష్టం వారిని వెక్కిరించింది. డాసన్ శనక సారథ్యంలోని లంక జట్టు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. గ్రూప్ దశలో పోటీ పడాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది. తొలి మ్యాచ్‌లో నమీబియాతో తలపడటానికి సన్నద్ధమైంది.

ఈ టోర్నమెంట్‌లో శ్రీలంక ఓ రకంగా అండర్ డాగ్‌గా ఎంట్రీ ఇచ్చినట్టే. గ్రూప్ దశ దాటుకుంటేనే సూపర్ 12కు అర్హత సాధిస్తుంది. గతం ఎలా ఉన్నప్పటికీ- ఇప్పుడు శ్రీలంక బలంగా తయారైంది. ఆసియా కప్‌లో భారత్‌ను మట్టి కరిపించిందంటే దాని శక్తిసామర్థ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. భారత్, పాకిస్తాన్ వంటి శక్తిమంతమైన జట్లను ఓడించి మరీ ఆసియా కప్‌ను ముద్దాడింది లంక టీమ్. ఆ టోర్నమెంట్ ఇచ్చిన ఊపుతో టీ20 ప్రపంచకప్‌లో అడుగు పెట్టింది. గ్రూప్ దశలో హాట్ ఫేవరెట్‌గా నిలిచింది.

వెస్టిండీస్ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. రెండుసార్లు టీ20 ప్రపంచకప్ ఛాంపియన్‌గా నిలిచిన కరేబియన్ టీమ్ గ్రూప్ దశలో ఆడుతోంది. తన తొలి మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ను ఎదుర్కొనాల్సి ఉంది. సోమవారం ఉదయం 9:30 గంటలకు ఈ మ్యాచ్ ఉంటుంది. మిడిలార్డర్ బ్యాటర్ నికోలస్ పూరన్ జట్టుకు సారథ్యాన్ని వహిస్తోన్నాడు. రెండు వామప్ మ్యాచ్‌లల్లోనూ పరాజయం పాలైన విండీస్ ప్రస్థానం ఎలా ఉంటుందనేది ఆసక్తికరం. ఈ జట్టును కూడా అండర్ డాగ్స్‌గానే పరిగణిస్తోన్నారు.

లంకజట్టులో- పాథుమ్ నిశ్శంక, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), ధనంజయ డిసిల్వా, ధనుష్క గుణతిలక, భానుక రాజపక్స, డాసన్ షనక (కేప్టెన్), వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, మహీశ్ తీక్షణ, దుష్మంత చమీర, దిల్షాన్ మధుశంక ఆడే అవకాశం ఉంది. నమీబియా తుదిజట్టులో- గెర్హార్డ్ ఎరాస్మస్ (కేప్టెన్), దివాన్ లా కాక్, జోనాథన్ స్మిట్, డేవిడ్ వీస్, ఎమ్ వాన్ లింగెన్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, జేన్ గ్రీన్, జాన్ ఫ్రైలింక్, ఆర్ ట్రంపెల్‌మాన్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, బెన్ షికోంగో ఆడొచ్చు.

Story first published: Sunday, October 16, 2022, 7:33 [IST]
Other articles published on Oct 16, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+