Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పేరు రాసి పెట్టుకోండి..!!

T20 World Cup 2022: Sachin Tendulkar and Virender Sehwag lauds Namibia

మెల్‌బోర్న్: టీ20 ప్రపంచకప్ 2022 తొలి మ్యాచ్‌లోనే సంచలనం నమోదైంది. తనకంటే ఎంతో బలమైన శ్రీలంకకు షాకిచ్చింది నమీబియా. తొలుత బ్యాటింగ్‌లో, ఆ తరువాత బౌలింగ్‌లో అంచనాలకు అందని విధంగా రాణించింది. ఆసియా కప్ 2022 విన్నర్‌ను చిత్తు చేసింది. సూపర్ 12లో ప్రవేశించడానికి తన అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. ఈ ఊహించని పరాజయంతో టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో శ్రీలంక ప్రస్థానం ఇక ప్రమాదంలో పడినట్టే.

టాస్ ఓడిపోయిన తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. ఏ దశలో కూడా పోరాటాన్ని కనపర్చలేదు. ప్రారంభం నుంచి వరుసగా వికెట్లను కోల్పోతూ వచ్చింది. నమీబియా బౌలర్ల దెబ్బకు చేతులెత్తేశారు బ్యాటర్లు. బ్యాటింగ్ చేయడం మర్చిపోయినట్లు ఆడారు. నమీబియా బౌలర్ల ధాటికి బెంబేలెత్తారు.

పాథుమ్ నిశ్శంక-9, కుశాల్ మెండిస్-6, ధనంజయ డిసిల్వా-12, ధనుష్క గుణతిలక-0, భానుక రాజపక్స-20, కేప్టెన్ డాసన శనక-29, వనిందు హసరంగ-4, చమిక కరుణరత్నె-5, ప్రమోద్ మధుశంక లియానగమగె-0, దుష్మంత చమీర-8 పరుగులు చేశారు. నమీబియా బౌలర్లందరూ వికెట్లను పడగొట్టారు. డేవిడ్ వీస్, బెర్నార్డ్ ష్కోల్జ్, బెన్ షికాంగో, జాన్ ఫ్రైలింక్ రెండు చొప్పున వికెట్లు పడగొట్టారు. జొనాథన్ స్మిత్ ఒక వికెట్ తీసుకున్నాడు.

అంతకుముందు బౌలింగ్‌లోనూ శ్రీలంక పెద్దగా రాణించలేదు. 14 ఓవర్ల వరకు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికీ.. ఆ తరువాత నమీబియా బ్యాటర్ల ధాటికి చేతులెత్తేశారు. 14.2 ఓవర్లల్లో ఆరు వికెట్లు నష్టపోయి 93 పరుగులు చేసిన దశలో నమీబియా లోయర్ ఆర్డర్ బ్యాటర్లు గేర్ మార్చారు. కౌంటర్ అటాక్‌కు దిగారు. లంక బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొన్నారు. జాన్ ఫ్రైలింక్, జొహాన్నెస్ జొనాథన్ స్మిత్.. ధాటిగా ఆడారు. లంక బౌలింగ్‌ను ఉతికి ఆరేశారు.

చివరి అయిదు ఓవర్లల్లో 63 పరుగులను పిండుకున్నారంటే ఈ ఇద్దరు ఏ స్థాయిలో ఆడారో అర్థం చేసుకోవచ్చు. జాన్ ఫ్రైలింక్ 28 బంతుల్లోనే 44 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు మెరుపుల్లాంటి ఫోర్లు ఉన్నాయి. అదే స్థాయిలో రెచ్చిపోయాడు జొనాథన్ స్మిత్ కూడా. 16 బంతుల్లో 31 పరుగులు చేశాడు. ఇందులో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. వీరిద్దరి కౌంటర్ అటాక్‌కు నమీబియా స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి 163 పరుగులు చేసింది.

నమీబియా సాధించిన ఈ విజయం పట్ల ఆ జట్టుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్, టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. సహా పలువురు మాజీలు ప్రశంసించకుండా ఉండలేకపోతోన్నారు. తనకంటే ఎంతో బలమైన శ్రీలంకను నమీబియా కట్టడి చేసిన తీరు అధ్బుతమని కితాబిస్తోన్నారు. నమీబియా క్రికెట్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందని, నిలకడగా ఆడితే అగ్రజట్టుగా ఎదుగుతందని చెప్పారు.

Story first published: Sunday, October 16, 2022, 15:35 [IST]
Other articles published on Oct 16, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+