
సూపర్ 12లో తొలి మ్యాచ్‌కు..
టీమిండియా తన తొలి మ్యాచ్‌ను ఈ నెల 23వ తేదీన ఆడబోతోంది. వచ్చే ఆదివారం తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఎదుర్కొనబోతోంది. ఆగస్టులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ముగిసిన ఆసియా కప్ 2022 తరువాత మళ్లీ ఈ రెండు జట్లు తలపడబోతోండటం ఇదే తొలిసారి. రెండు నెలల వ్యవధిలోనే మరోసారి భారత్-పాకిస్తాన్ మధ్య బిగ్గెస్ట్ ఫైట్ జరగబోతోండటం ఇప్పటి నుంచే అభిమానులను ఉత్కంఠతకు గురి చేస్తోంది.

రెండు వామప్స్..
అంతకంటే ముందు- రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా రెండు వామప్ మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. ఇందులో ఒకటి ఆస్ట్రేలియాతో.. మరొకటి న్యూజిలాండ్‌తో. ఈ రెండు కూడా టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్ అధికారిక వామప్ మ్యాచ్‌లు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదివరకు రెండు వామప్స్ ఆడినప్పటికీ.. అవి లోకల్ టీమ్స్‌తో. అందులో ఒకదాంట్లో భారత్ ఓడిపోయింది కూడా. ఇప్పుడిక అఫీషియల్ మ్యాచ్‌లల్లో తలపడనుంది.
రేపే తొలి మ్యాచ్..
తొలి వామప్ మ్యాచ్- బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో షెడ్యూల్ అయింది. సోమవారం ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. అరగంట ముందు టాస్ పడుతుంది. అటు ఆస్ట్రేలియా, ఇటు భారత్.. రెండూ కూడా తమ పూర్తిస్థాయి జట్లతో ఆడాల్సి ఉంటుంది. ఈ ప్రిస్టేజియస్ టోర్నమెంట్‌లో టీమిండియా ప్రస్థానం ఎలా ఉండబోతోందనేది తేల్చయబోతోందీ వామప్ మ్యాచ్. అంతకుముందు వామప్‌లో ఇంగ్లాండ్ చేతిలో పరాభవాన్ని చవి చూసింది ఆసీస్.

బ్యాలెన్స్ మ్యాచ్‌లు..
సూపర్ 12లోని అన్ని జట్లు కూడా వామప్‌లల్లో తలపడనున్నాయి. న్యూజిలాండ్-దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్-పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్-బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన-పాకిస్తాన్, బంగ్లాదేశ్-దక్షిణాఫ్రికా మధ్య వామప్స్ ఉంటాయి. రెండో వామప్.. ఈ నెల 19వ తేదీన ఉంటుంది. ఇదే గబ్బా స్టేడియంలో మ్యాచ్ కొనసాగుతుంది. ఇదే చివరిది కూడా. సూపర్ 12 దశ 22వ తేదీన ఆరంభమౌతంది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ ఆడనున్నాయి.


Click it and Unblock the Notifications












