For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ నమ్మకం నాకు లేదు: పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు తేల్చేసిన రోహిత్ శర్మ: ప్లేయింగ్ 11పై..!!

T20 World Cup 2022: I have already got my Playing XI for the against Pakistan, says Rohit Sharma

ముంబై: ఇంకొన్ని గంటల్లో టీ20 ప్రపంచకప్ 2022 పోరు ఆరంభం కాబోతోంది. ఆస్ట్రేలియా వేదికగా 12 జట్లు ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌లో తలపడనున్నాయి. దీనికోసం భారత్ సన్నద్ధమౌతోంది. ఈ టోర్నమెంట్‌లో తన ప్రస్థానాన్ని ఈ నెల 23వ తేదీన ఆరంభించనుంది టీమిండియా. తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీ కొట్టబోతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ వేదికగా రెండు నెలల కిందటే ముగిసిన ఆసియా కప్ 2022 టోర్నమెంట్ తరువాత మళ్లీ ఈ రెండు జట్లు పోటీ పడనున్నాయి.

23న మధ్యాహ్నం..

23న మధ్యాహ్నం..

ఆసియా కప్ తరహాలోనే భారత్- తన తొలి మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌తో తలపడనుంది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్‌లో ఈ నెల 23వ తేదీన భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం ఒకటిన్నరకు మ్యాచ్ షెడ్యూల్ అయింది. ప్రస్తుతం ఊపు మీద ఉంది పాకిస్తాన్. న్యూజిలాండ్‌లో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో విజేతగా నిలిచింది. న్యూజిలాండ్-పాకిస్తాన్-బంగ్లాదేశ్ పాల్గొన్న సిరీస్ ఇది. ఫైనల్స్‌లో బ్లాక్ క్యాప్స్‌ను సొంతగడ్డపై మట్టి కరిపించింది.

చివరి నిమిషంలో..

చివరి నిమిషంలో..

ఈ గెలుపు ఇచ్చిన ఉత్సాహంలో ఉంది పాకిస్తాన్. న్యూజిలాండ్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని ఆస్ట్రేలియాపై అడుగు పెట్టింది. ఈ బ్లాక్ బస్టర్ మ్యాచ్‌పై రోహిత్ శర్మ మాట్లాడాడు. చివరి నిమిషంలో తీసుకునే నిర్ణయాలపై తనకు నమ్మకం లేదని స్పష్టం చేశాడు. అందుకే తాను ఇప్పటికే ప్లేయింగ్ 11ను సెలెక్ట్ చేసుకున్నానని అన్నాడు. ఈ సమాచారాన్ని ఆటగాళ్లకు కూడా ఇచ్చానని తేల్చేశాడు. ఫలితంగా వారు ఇప్పటి నుంచే మానసికంగా సన్నద్ధమవుతారని వ్యాఖ్యానించాడు.

ముందుగా సమాచారం..

ముందుగా సమాచారం..

తుదిజట్టు ఎంపిక గురించి ప్లేయర్లకు ముందుగా తెలియజేయాలని తాను కోరుకుంటున్నానని, పాకిస్తాన్‌పై మ్యాచ్ కోసం ఎవరిని ఆడించాలనే విషయంపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నానని రోహిత్ శర్మ తేల్చిచెప్పాడు. ప్లేయర్లకు కూడా సమాచారం ఇచ్చానని వివరించాడు. చివరి నిమిషంలో తీసుకునే నిర్ణయాలపై తనకు నమ్మకం లేదని పునరుద్ఘాటించాడు. చాలినంత సమయం ఉన్నందున ప్లేయర్లు ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా, స్వేచ్ఛగా ఆడుతారని పేర్కొన్నాడు.

140 టార్గెట్ సరిపోదు..

140 టార్గెట్ సరిపోదు..

పాకిస్తాన్‌తో మ్యాచ్ అంటే అభిమానుల్లో ఏర్పడే భావోద్వేగాలు, దానికి ఉండే ప్రాధాన్యతను తనకు తెలుసని, ఆసియా కప్‌లో ఆ జట్టును ఎదుర్కొన్న అనుభవం యంగ్ క్రికెటర్లకు ఉందని చెప్పాడు. వ్యూహాల గురించి ఇప్పుడే మాట్లాడుకోవడం సరికాదని ఓ ప్రశ్నకు బదులిచ్చాడు రోహిత్ శర్మ. 140 పరుగులు చేస్తే విజయం సాధించే పరిస్థితులు ఇప్పుడు లేవని, 14-15 ఓవర్లలో ఆ స్కోర్‌ను అందుకునేలా అన్ని జట్లు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయని రోహిత్ శర్మ చెప్పాడు.

షమీ ఫిట్‌నెస్..

షమీ ఫిట్‌నెస్..

మహ్మద్ షమీ ఫిట్‌నెస్ సాధించడం శుభపరిణామమని, ఆదివారం బ్రిస్బేన్‌లో జరిగే ప్రాక్టీస్ సెషన్‌లో అతను పాల్గొంటాడని రోహిత్ శర్మ చెప్పాడు. అతను ఇంకా జట్టుతో కలవలేదని పేర్కొన్నాడు. షమీ ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడాల్సి ఉందని చెప్పాడు. ఈ సందర్భంగా సూర్యకుమార్ యాదవ్‌పై రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. తన ఫామ్‌ను కొనసాగిస్తాడని ఆశిస్తున్నట్లు చెప్పాడు.

Story first published: Saturday, October 15, 2022, 11:41 [IST]
Other articles published on Oct 15, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+