Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒక స్టార్ బ్యాటర్‌‌పై వేటు - మరో ఆల్‌రౌండర్‌కు పిలుపు: ఇంగ్లాండ్ టీ20 వరల్డ్ కప్ టీమ్ ఇదే

T20 World Cup 2022 England squad: Jason Roy dropped and Ben Stokes has been recalled

ముంబై: భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆసియా కప్ 2022 ఆడుతోంది. పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ తలపడుతున్నాయి. బంగ్లాదేశ్ ఇప్పటికే టోర్నమెంట్ నుంచి వైదొలగింది. పాకిస్తాన్-హాంకాంగ్ మధ్య జరిగే ఈ సాయంత్రం జరిగే మ్యాచ్‌తో మరో జట్టు ఎలిమినేట్ అవుతుంది. సూపర్ 4కు వెళ్లే జట్లపై స్పష్టత ఏర్పడుతుంది. భారత్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్లు సూపర్ 4లో ఎంట్రీ ఇచ్చాయి. నాలుగు స్థానాన్ని పాకిస్తాన్ లేదా హాంకాంగ్ భర్తీ చెయ్యాల్సి ఉంది.

ఆసియా కప్ తరువాత..

ఆసియా కప్ తరువాత..

ఇదిలా కొనసాగుతండగానే- టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్ ఫీవర్ ఆవరించుకుంటోంది. ఆసియా కప్ తరువాత ఆయా జట్లన్నీ కూడా ఆడబోయే బిగ్గెస్ట్ టోర్నమెంట్ ఇదే. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఈ మెగా క్రికెట్ ఈవెంట్‌ కోసం టీమిండియాలో ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసియా కప్ నిర్ధారిస్తుంది. ఇక్కడ సత్తా చాటిన వారికే టీ20 ప్రపంచ కప్‌ కోసం ఎంపిక చేసే జట్టులో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ప్రాధాన్యత ఇస్తుంది.

ఇంగ్లాండ్ జట్టు ప్రకటన..

ఆస్ట్రేలియా ఆతిథ్యాన్ని ఇచ్చే టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ కోసం కొద్దిసేపటి కిందటే ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు.. తన జట్టును ప్రకటించింది. 15 మంది ప్లేయర్లతో కూడిన టీమ్‌ను వెల్లడించింది. మరో ముగ్గురిని రిజర్వ్డ్ ప్లేయర్లుగా ఎంపిక చేసింది. ఈ లిస్ట్‌‌ను తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది ఈసీబీ. స్టార్ ఆల్ రౌండర్, టీ20 స్పెషలిస్ట్ బెన్ స్టోక్స్‌ జట్టులోకి పునరాగమనం చేశాడు. అతనితో పాటు క్రిస్ వోక్స్, మార్క్ వుడ్‌ కూడా టీమ్‌లో రీఎంట్రీ ఇచ్చారు.

బెన్ స్టోక్స్ రీ ఎంట్రీ..

బెన్ స్టోక్స్ రీ ఎంట్రీ..

బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్.. ముగ్గురూ కూడా ఈ సంవత్సరం ఇప్పటివరకు ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంటర్నేషనల్స్ గానీ, డొమెస్టిక్ క్రికెట్‌లో గానీ వారు టీ20 మ్యాచ్‌లను ఆడలేదు. వెస్టిండీస్ పర్యటన సమయంలో మార్క్ వుడ్ గాయపడ్డాడు. ఎల్బో ఆపరేషన్ చేయించుకున్నాడు. పూర్తి ఫిట్‌నెస్ కోసం శ్రమిస్తోన్నాడు. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ ఆరంభం అయ్యే సమయానికి వందశాతం ఫిట్‌నెస్‌ను సాధిస్తాడని ఈసీబీ భావిస్తోంది.

కేప్టెన్‌గా జోస్..

కేప్టెన్‌గా జోస్..

ఈ జట్టుకు జోస్ బట్లర్ కేప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఐపీఎల్ 2022 సీజన్‌ రాజస్థాన్ రాయల్స్ తరఫున జోస్ బట్లర్ ఏ రేంజ్‌లో మెరుపులు మెరిపించాడో చూశాం. ఆస్ట్రేలియా గడ్డపై టీ20 ప్రపంచకప్‌లో మరోసారి దుమ్ము దులపడం ఖాయం. పంజాబ్ కింగ్స్ ప్లేయర్ లియామ్ లివింగ్‌స్టొన్, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ క్రిస్ జోర్డాన్ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌ తరఫున ఆడుతున్న జానీ బెయిర్‌స్టో, చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ జట్టు బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్‌కు బ్యాక్‌బోన్.

జేసన్ రాయ్‌కు నో ఛాన్స్..

జేసన్ రాయ్‌కు నో ఛాన్స్..

కాగా- స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్‌కు ఈ టీమ్‌లో చోటు దక్కలేదు. ఫామ్‌లో లేకపోవడం వల్ల అతణ్ని తప్పించింది. పాకిస్తాన్‌తో సిరీస్ ఆడబోయే జట్టులోనూ అతన్ని తీసుకోలేదు ఈసీబీ. జేసన్ రాయ్‌ను తీసుకోకపోవడం వల్ల ఈసీబీ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ స్పందించారు. జేసన్ టీ20 కేరీర్ ముగిసినట్లుగా భావించట్లేదని అన్నారు.

ప్రస్తుతం కేరీర్‌లో అత్యంత గడ్డు పరిస్థితులను అతను ఎదుర్కొంటోన్నాడని, దీని నుంచి బయటపడటానికి కొంత విరామం ఇచ్చామని వ్యాఖ్యానించారు. 50 ఓవర్ల ఫార్మట్‌లో సత్తాచాటుతున్నాడని గుర్తు చేశారు. జేసన్ రాయ్‌పై వేటు పడిన నేపథ్యంలో- జానీ బెయిర్‌స్టో కేప్టెన్‌ జోస్ బట్లర్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలో దిగడం ఖాయమైంది.

పూర్తిజట్టు ఇదే..

పూర్తిజట్టు ఇదే..

జోస్ బట్లర్ (కేప్టెన్), మొయిన్ అలీ, జొనాథన్ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కర్రన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టొన్, డేవిడ్ మలాన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లే, డేవిడ్ విల్లే, క్రిస్ వోక్స్, మార్క్‌ వుడ్. వారితో పాటు టైమల్ మిల్స్, లియామ్ డాసన్, రిచర్డ్ గ్లీసన్‌ను రిజర్వ్డ్ ప్లేయర్లుగా తీసుకుంది.

Story first published: Friday, September 2, 2022, 16:45 [IST]
Other articles published on Sep 2, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+