T20 world Cup 2022: వార్మప్ మ్యాచ్‍లో పాకిస్థాన్‍ను చిత్తు చేసిన ఇంగ్లాడ్.. 15 ఓవర్లకే ఖేల్ ఖతం..

ఇంగ్లాండ్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో పాకిస్థాన్ చిత్తుగా ఓడింది. బ్రిస్బేన్ లోని గబ్బా స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో పాక్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. ఓపెనర్ మసూద్ 22 బంతుల్లో 7 ఫోర్లతో 39 పరుగుల చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. చివర్లో మహ్మద్ వసీం 26 పరుగులతో రాణించాడు. ఇఫ్తికార్ అహ్మద్ 22 పరుగులు చేయగా మిగతా వారు తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.

14.4 ఓవర్లలోనే
ఇంగ్లాండ్ బౌలర్లలో విల్లీ రెండు వికెట్లు తీయగా.. స్టోక్స్, సామ్ కరన్, క్రిస్ జోర్డాన్, లివింగ్ స్టోన్ ఒక్కో వికెట్ పడగొడ్డారు. వర్షం కారణంగా మ్యాచ్ 19 ఓవర్లకు కుదించారు. 161 విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ అలవోకగా విజయం సాధించింది. 14.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్, అలెక్స్ హెల్స్ తక్కువ సోర్క్లకే ఔటై జట్టును కష్టాల్లోకి నెట్టారు.

సామ్ కరన్, బ్రుక్స్
ఆ తర్వాత బెన్ స్టోక్స్, వివింగ్ స్టోన్ జట్టను ముందుకు నడిపించారు. 18 బంతుల్లో 36 పరుగుల చేసిన బెన్ స్టోక్స్ మహ్మద్ వసీం బౌలింగ్ లో ఔటయ్యాడు. లివింగ్ స్టోన్ 28 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ 10.3 ఓవర్లలో నాలుగు వికెట్లకు 104 పరుగులు చేసింది. ఆ తర్వాత వచ్చిన సామ్ కరన్, బ్రుక్స్ జట్టును విజయ తీరాలకు చేర్చారు.

చెత్త ఫీల్డింగ్
బ్రూక్ 24 బంతుల్లో 4 సిక్స్ ల్, రెండు ఫోర్లతో 45 పరుగులతో అజేయంగా నిలిచాడు. సామ్ కరన్ 14 బంతుల్లో 3 సిక్స్ లు, రెండు ఫోర్ల సహాయంతో 33 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే పాక్ చెత్త ఫీల్డింగ్ కారణంగా ఇంగ్లీష్ బ్యాటర్లు బతికిపోయారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications