Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అదృష్టం కొద్దీ సెమీ ఫైనల్‌లో పాకిస్తాన్ - కేన్ మామకు బిగ్ హర్డిల్..!!

T20 World Cup 2022, 1st Semi final: Pakistan Playing 11 against New Zealand at Sydney

సిడ్నీ: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో భాగంగా పాకిస్తాన్ ఇవ్వాళ లైఫ్ అండ్ డెత్ మ్యాచ్ ఆడబోతోంది. తొలి సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఢీ కొట్టడానికి సమాయాత్తమౌతోంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ దీనికి వేదిక. మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. అదృష్టం కొద్దీ సెమీ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టిన పాకిస్తాన్.. న్యూజిలాండ్‌తో ఎలా ఆడుతుందనేది ఆసక్తి రేపుతోంది. న్యూజిలాండ్‌కు అతిపెద్ద అడ్డంకిగా మారొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

 నక్కతోక తొక్కి..

నక్కతోక తొక్కి..

పాకిస్తాన్ క్రికెట్‌ను అనిశ్చితికి మారుపేరుగా చెబుతుంటారు. ఆ పేరును నిలబెట్టుకుంది పాకిస్తాన్. అనూహ్యంగా సెమీ ఫైనల్‌లో అడుగు పెట్టింది. సూపర్ 12 దశలో దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్ చిత్తు చేయడంతో అదృష్టవశాత్తూ పాకిస్తాన్ సెమీ ఫైనల్‌లో అడుగు పెట్టింది. నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోతుందని ఎవ్వరూ ఊహించివుండరు. అలాంటి అద్భుతం చోటు చేసుకోవడంతో సెమీస్ రేసు నుంచి దక్షిణాఫ్రికా వైదొలగింది. దాని స్థానంలో పాకిస్తాన్ ఆ ఛాన్స్‌ను అందిపుచ్చుకుంది.

బాబర్‌పైనే

బాబర్‌పైనే

కీలకమైన సెమీ ఫైనల్ ముందు పాకిస్తాన్ కేప్టెన్ బాబర్ ఆజమ్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోన్నాడు. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకూ అతను ఒక్క భారీ ఇన్నింగ్ కూడా ఆడలేదు. అతను చేసిన స్కోర్ 39 పరుగులు మాత్రమే. సూపర్ 12 చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై మాత్రమే బాబర్ ఆజమ్ వ్యక్తిగతంగా రెండంకెల స్కోర్ చేయగలిగాడు. ఇక తొలి సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌‌పై అతని ఆటతీరు ఎలా ఉంటుందనేది జట్టు గెలుపోటములను ప్రభావం చేయగలుగుతుంది.

న్యూజిలాండ్ సత్తాకు అసలు పరీక్ష..

న్యూజిలాండ్ సత్తాకు అసలు పరీక్ష..

మరోవంక న్యూజిలాండ్ సత్తాకు ఈ సెమీస్ అసలు సిసలు అగ్నిపరీక్షగా మారింది. 2019లో ప్రపంచకప్ ఫైనలిస్ట్ అయిన ఈ జట్టు ఈ టోర్నమెంట్‌లో అంచనాలకు అనుగుణంగా రాణించింది. సూపర్ 12 దశలో ఘన విజయాలను అందుకుంది. సెమీఫైనల్ చేరిన మొట్టమొదటి జట్టుగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడిక పాకిస్తాన్‌ను ఎలా ఢీ కొడుతుంది?.. ఫైనల్స్‌లో అడుగు పెడుతుందా? లేదా? అనేది ఉత్కంఠతను రేపుతోంది.

 తుదిజట్టు అంచనాలివే..

తుదిజట్టు అంచనాలివే..

పాకిస్తాన్ తుదిజట్టులో- బాబర్ ఆజమ్ (కేప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), షాన్ మసూద్, మహ్మద్ హరీస్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హరీస్ రవూఫ్, మహ్మద్ వాసిం, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది ఆడే అవకాశాలు ఉన్నాయి. న్యూజిలాండ్ జట్టులో- ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (కేప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిఛెల్, జేమ్స్ నీషమ్, మిఛెల్ శాంట్నర్, టిమ్ సౌథీ, ఈష్ సోధీ, లోకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్ ఆడొచ్చు.

Story first published: Wednesday, November 9, 2022, 8:58 [IST]
Other articles published on Nov 9, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+