T20 World Cup 2021: రేపటి నుంచే మరో మెగా సమరం.. షెడ్యూల్, పాయింట్లు లాంటి వివరాలు! మ్యాచ్ టై అయితే!

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సందడి శుక్రవారంతో ముగిసింది. అయినా క్రికెట్ ప్రేమికులు నిరాశపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరో క్రీడా సమరంకు ఆదివారం (అక్టోబర్ 17) తెరలేవనుంది. యూఏఈ వేదికగా ఆదివారం నుంచి ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021 పోటీలు మొదలుకానున్నాయి. అక్టోబర్ 17న డబుల్ హెడర్‌తో (క్వాలిఫైయర్ మ్యాచులు) మెగా టోర్నీ ప్రారంభమవుతుంది. తొలి గేమ్‌లో ఒమన్‌ జట్టు పాపువా న్యూ గినియాతో తలపడుతుంది. మరో మ్యాచ్‌లో స్కాట్లాండ్‌తో బంగ్లాదేశ్ తలపడుతుంది. సూపర్ 12 స్టేజ్ మాత్రం అక్టోబర్ 23న ఆరంభం కానుండగా.. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 14న జరుగుతుంది.

16 జట్లు పాల్గొంటున్నాయి:

16 జట్లు పాల్గొంటున్నాయి:

ఐదేళ్ల విరామం తర్వాత టీ20 ప్రపంచకప్ 2021 జరుగుతోంది. పొట్టి టోర్నీని ఈ సారి బీసీసీఐ ఆతిథ్యమిస్తుంది. కానీ మ్యాచ్‌లు మాత్రం యూఏఈ, ఒమన్‌లో జరగనున్నాయి. దేశంలోని కరోనా పరిస్థితి మేరకు టోర్నమెంట్‌ను భారతదేశం నుంచి యూఏఈకు తరలించారు. మెగాటోర్నీలో ఈసారి అత్యధికంగా 16 జట్లు పాల్గొంటున్నాయి. టోర్నమెంట్ క్వాలిఫయర్ మ్యాచులు రెండు రౌండ్లలో జరుగనున్నాయి. గ్రూప్ ఏలో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా ఉండగా.. గ్రూప్ బీలో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పాపువా న్యూ గినియా, ఒమన్ జట్లు ఉన్నాయి. ప్రతీ జట్టు తన గ్రూపులోని ప్రతి ఇతర జట్టుతో ఒకసారి తలపడనుంది. అల్ అమెరత్, షార్జా, అబుదాబిలో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రతీ గ్రూప్ నుంచి అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు సూపర్ 12 కు చేరుకుంటాయి.

రెండు గ్రూపులుగా:

రెండు గ్రూపులుగా:

ఇక టీ20 ప్రపంచకప్ సూపర్ 12 దశలో జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ 1లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లతో సహా క్వాలిఫైయర్ ద్వారా అర్హత సాధించిన మరో రెండు జట్లు ఉంటాయి. గ్రూప్ 2లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ సహా మరో రెండు క్వాలిఫైయర్ జట్లు ఉంటాయి. సూపర్ 12 స్టేజ్ అక్టోబర్ 23న ఆరంభం కానుండగా.. టీ20 ప్రపంచకప్ 2021 కోసం ఇప్పటికే అర్హత సాధించిన జట్లు ఆలోగా ప్రాక్టీస్ మ్యాచులు ఆడనున్నాయి. ఇక్కడ ప్రతీ జట్టు దాని గ్రూపులోని అన్ని జట్టుతో ఓ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచులు షార్జా, అబుదాబి, దుబాయ్‌లో జగరనున్నాయి. సూపర్ 12లో మొత్తం 30 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ప్రతీ గ్రూప్ నుంచి అగ్రస్థానంలో నిలిచిన మొదటి రెండు జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకుంటాయి.

మ్యాచ్ టై అయితే:

మ్యాచ్ టై అయితే:

రెండు రౌండ్లలో ఒక జట్టు విజయం సాధిస్తే.. రెండు పాయింట్లు కేటాయిస్తారు. ఒకవేళ మ్యాచ్ టై అయితే ఒక పాయింట్ ఇవ్వనున్నారు. ఫలితం తేలకున్నా, రద్దు అయితే మాత్రం ఎలాంటి పాయింట్లు కేటాయించరు. రెండు లేదా అంతకంటే ఎక్కువ జట్లు తమ గ్రూపులో సమాన పాయింట్లతో లీడింగ్‌లో ఉంటే.. జట్ల విజయాల సంఖ్య, నెట్ రన్ రేట్, హెడ్-టు-హెడ్ ఫలితం లాంటి వాటిని పరిగణలోకి తీసుకుంటారు. మొదటిసారిగా పురుషుల టీ20 ప్రపంచకప్లో డీఆర్‌ఎస్‌ను అందుబాటులోక ఉంచారు. ప్రతీ జట్టుకు ఒక ఇన్నింగ్స్‌కు గరిష్టంగా రెండు రివ్యూలు వాడుకునే అవకాశం ఉంది. ఇక మ్యాచ్ టై అయితే.. ఇరు జట్లు సూపర్ ఓవర్ ఆడతాయి. ఒకవేళ సూపర్ ఓవర్ కూడా సమం అయితే ఫలితం వచ్చేవరకు వరకు ఇరు జట్లు సూపర్ ఓవర్లు ఆడుతూనే ఉంటాయి. వాతావరణ పరిస్థితులు లేదా సమయ పరిమితుల కారణంగా సూపర్ ఓవర్ సాధ్యం కాకపోతే.. మ్యాచ్ టైగా ప్రకటిస్తారు. ఒకవేళ సెమీ ఫైనల్ సమయంలో ఫలితం తేలకపోతే.. సూపర్ 12 గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. ఫైనల్‌లో ఇదే రిపీట్ అయితే మాత్రం రెండు జట్లు ఉమ్మడి విజేతలుగా నిలవనున్నాయి. గ్రూప్-స్టేజ్ గేమ్‌లకు రిజర్వ్ డేలు లేవు. సెమీ ఫైనల్స్, ఫైనల్‌కు మాత్రమే రిజర్వ్ డేలు ఉన్నాయి.

ప్రైజ్ మనీ:

ప్రైజ్ మనీ:

టీ20 ప్రపంచకప్‌ 2021లో ఛాంపియన్‌‌గా నిలిచిన జట్టు రూ 12.02 కోట్ల ప్రైజ్ మనీ అందుకోనుంది. రన్నరప్‌కు రూ. 6 కోట్లు దక్కనున్నాయి. సెమీ ఫైనలిస్టు జట్లకు రూ. 3 కోట్లు లభిస్తాయి. అన్ని మ్యాచులను స్టార్ స్పోర్ట్స్ ఛానల్స్‌ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. తెలుగులో చూడాలనుకునే వారు మాత్రం స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు ఛానల్ చూడొచ్చు. అలాగే యాప్‌లో చూడాలనుకునే వారు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్లో చూడొచ్చు. మ్యాచులు భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు, రాత్రి 7.30 గంటలకు మొదలుకానున్నాయి. మైదానాల్లోకి ప్రేక్షకులకు అనుమతి ఉంది. అయితే పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, October 16, 2021, 19:37 [IST]
Other articles published on Oct 16, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X