Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ravi shastri: టీమిండియా కోచ్‌గా చేయగలిగినంతా చేశా.. టైటిల్ గెలవనందుకు చింతిస్తున్నా: శాస్త్రి

T20 World Cup 2021: Ravi Shastri says As a Team India coach I did everything I could

దుబాయ్: టీమిండియా క్రికెట్ జ‌ట్టు హెడ్ కోచ్‌గా ర‌విశాస్త్రి నాలుగేళ్ల కాల ప‌రిమితి ముగిసింది. టీ20 ప్రపంచకప్‌ 2021 సూపర్ 12లో భాగంగా సోమవారం రాత్రి నమీబియాతో జరిగిన మ్యాచే టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రికి చివరిది. ఈ సందర్భంగా తనను టీమిండియా కోచ్‌గా నియమించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ ప్రెసిడెంట్ ఎన్ శ్రీనివాసన్‌కి శాస్త్రి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. 2014లో ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టీమిండియా 1-3 తేడాతో ఘోర పరాజయం పాలై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో శ్రీనివాసన్ తనపై నమ్మకంతో.. జట్టును బలోపేతం చేసే బాధ్యతలను అప్పగించాడని శాస్త్రి చెప్పాడు. టీమిండియా కోచ్‌గా చేయగలిగినంతా చేశానన్నాడు.

చేయగలిగినంతా చేశా:

చేయగలిగినంతా చేశా:

సోమవారం రవిశాస్త్రి మాట్లాడుతూ... 'ఇన్నేళ్లుగా టీమిండియా కోచ్‌గా కొనసాగడం గొప్ప విషయం. డ్రెస్సింగ్ రూమ్‌లో నాకు ఇదే చివరి రోజని తెలుసు. భారత క్రికెట్‌ జట్టుకు సేవలందించే గొప్ప అవకాశాన్ని ఇచ్చిన బీసీసీఐకి ప్రత్యేక ధన్యవాదాలు. కోచ్‌గా నేను చేయగలిగినంతా చేశాను. నా సామర్థ్యంపై నమ్మకంతో టీమిండియా కోచ్‌గా బాధ్యతలు అప్పగించిన ఎన్ శ్రీనివాసన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. నా పనితీరుపై ఆయనకు నమ్మకం ఎక్కువ. ఆయన నమ్మకాన్ని నేను 100 శాతం నిలబెట్టాననుకుంటున్నా. కోచ్‌గా నా ప్రయాణంపై సంతృప్తిగానే ఉంది' అని అన్నాడు.

డ్రెస్సింగ్ రూమ్‌లో భావోద్వేగం:

డ్రెస్సింగ్ రూమ్‌లో భావోద్వేగం:

నమీబియా మ్యాచ్ అనంతరం భారత డ్రెస్సింగ్ రూమ్‌లో భావోద్వేగాలకు నిలయంగా మారింది. రవిశాస్త్రి వీడ్కోలు సమయంలో ఆటగాళ్లు చాలా ఉద్వేగానికి గురయ్యారు. ప్రధాన కోచ్‌తో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌ని కూడా కౌగిలించుకున్నారు. నిజానికి రవిశాస్త్రితో పాటు వీరిద్దరి పదవీకాలం కూడా టీమిండియాతో ముగిసింది. హాట్‌హాట్‌గా ఉండే డ్రెస్సింగ్ రూమ్‌లో రవిశాస్త్రి వీడ్కోలు సమయంలో భావోద్వేగం చెందాడు. బరువైన హృదయంతోనే రవిశాస్త్రి డ్రెస్సింగ్ రూమ్‌లో 70 సెకన్ల పాటు మాట్లాడాడు.

 అంచ‌నాల‌కు మించి రాణించింది:

అంచ‌నాల‌కు మించి రాణించింది:

న‌మీబియాతో మ్యాచ్ ముగిసిన త‌ర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో ప్లేయ‌ర్ల‌తో ర‌విశాస్త్రి ముచ్చ‌టించాడు. 'భారత జ‌ట్టు నా అంచ‌నాల‌కు మించి రాణించింది. క్రికెట్ చ‌రిత్ర‌లో ఇదో అత్యుత్త‌మ జ‌ట్టు. అయితే ఐసీసీ టైటిల్ గెలవనందుకు కాస్త చింతిస్తున్నాను. అయితే ఈ టీమ్‌పై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ జట్టు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. ఆటగాళ్లు అనుభవం నుంచి నేర్చుకుంటూ గెలుస్తున్నారు. 12 నెల‌ల వ్య‌వ‌ధిలో మ‌ళ్లీ మెగా టోర్నీ రావ‌డం అరుదు. బ‌హుశా ఆ టోర్నీలో భారత ఆటగాళ్లు రాణిస్తారు' అని ర‌విశాస్త్రి ఆశాభావం వ్యక్తం చేశాడు. వ‌చ్చే ఏడాది మ‌ళ్లీ ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ ఉన్న విష‌యం తెలిసిందే. 2014లో టీమిండియా డైరెక్టర్‌గా నియమితుడైన రవిశాస్త్రి.. 2017లో కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఆ తర్వాత 2019లో మరోసారి అతడి పదవీ కాలాన్ని బీసీసీఐ పొడిగించింది. నవంబర్ 14తో శాస్త్రి పదవీకాలం ముగిసింది.

Story first published: Tuesday, November 9, 2021, 14:06 [IST]
Other articles published on Nov 9, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+