Virat Kohli: గవాస్కర్, సచిన్ కంటే కోహ్లీ బెటర్.. త్వరలోనే ఇంతకుముందులా రాణిస్తాడు: పాక్ మాజీ ప్లేయర్

ఇస్లామాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ముదస్సర్ నాజర్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియా దిగ్గజాలు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ కన్నా కోహ్లీనే ఎంతో ధైర్యంగా ముందుకుసాగే క్రికెటర్ అని పేర్కొన్నాడు. విరాట్ త్వరలోనే ఇంతకుముందులా ఆడతాడని, భారీగా పరుగులు చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. గత కొంతకాలంగా కోహ్లీ హాఫ్ సెంచరీలు చేస్తున్నా.. సెంచరీలు మాత్రం చేయడం లేదు. 2019లో బంగ్లాపై టెస్టుల్లో శతకం బాదాడు. కోహ్లీ శతకం బాది ఇప్పటికే రెండేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలోనే నాజర్ ఓ జాతీయ పత్రికకు రాసిన కథనంలో ఈ వ్యాఖ్యలు చేశాడు.

2019 నవంబర్‌లో చివరి సెంచరీ:
విరాట్ కోహ్లీ 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి డే/నైట్ టెస్టులో సెంచరీ చేశాడు. ఆ తర్వాత ఇప్పటివరకు ఒక్క సెంచరీ చేయలేకపోయాడు. దీంతో విరాట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అయితే కోహ్లీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పలుమార్లు సెంచరీకి చేరువైనా దురదృష్టవశాత్తూ మూడంకెల స్కోర్ అందుకోలేకపోయాడు. ప్రతి ఏడాది సెంచరీ చేసే కోహ్లీ.. 2020లో ఒక్క శతకం కూడా సాధించలేకపోయాడు. 2021 కూడా అలానే ముగిసేలా ఉంది. ఈ ఏడాదిలో న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనల్లో కోహ్లీ అంచనాలను అందుకోలేదు. ఐపీఎల్ 2021లో కూడా కోహ్లీ సెంచరీచేయలేదు. టీ20 ప్రపంచకప్ అనంతరం కివీస్ పర్యటన ఉన్న నేపథ్యంలో కోహ్లీ మూడంకెల స్కోర్ అందుకోవాలని ఫాన్స్ ఆశిస్తున్నారు.

70 సెంచరీలు:
2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 96 టెస్టులాడి 51.1 సగటుతో 77765 రుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు (7 డబుల్ సెంచరీలు) 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 254 వన్డేల్లో 59.1 సగటుతో 12169 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 62 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 93 టీ20లలో 50.2 సగటుతో 3225 పరుగులు చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 23 వేలకు పైగా పరుగులు చేశాడు.

త్వరలోనే పరుగులు చేస్తాడు:
'సంవత్సరాల పాటు నిలకడగా పరుగులు చేయడమే విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్ మధ్య ఉన్న ఒకే విధమైన పోలిక. అందువల్లే కోహ్లీని చాలా మంది అభిమానిస్తారు. అయితే కొద్ది రోజులుగా విరాట్ నిలకడగా పరుగులు చేయలేకపోతున్నాడు. ఏళ్ల కొద్దీ ఆడే ఆటగాళ్లలో ఇది సహజమే. మనుషులుగా మనమూ కొన్నిసార్లు మానసికంగా సరిగ్గా ఉండలేం. ఆ సమయంల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. అప్పుడే కోచ్ సహాయం అవసరం అవుతుంది. ఇప్పుడు కోహ్లీ కూడా చాలా ఏళ్లుగా నిరంతరాయంగా ఆడటం వల్ల ఎక్కువ ఒత్తిడికి లోనవుతున్నాడు. ఇన్నాళ్లూ భారత్, బెంగళూరు జట్లకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఇప్పుడు కెప్టెన్సీ వదులుకుంటుండటంతో త్వరలోనే పరుగులు చేస్తాడని ఆశిస్తున్నా' అని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ముదస్సర్ నాజర్ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications