T20 World Cup: యూఏఈలోనే పొట్టి ప్రపంచకప్.. అక్టోబర్ 17న ప్రారంభం! ఫైనల్ ఎప్పుడంటే?

హైదరాబాద్: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా.. ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ భారత్‌లో జరిగే అవకాశం దాదాపు లేనట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే మెగా టోర్నీ నిర్వహణ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గడువు కోరింది. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా టీ20 ప్రపంచకప్‌ను యూఏఈలో జరిపేందుకు బీసీసీఐ మొగ్గుచూపుతోందట. ఈ విషయంపై ఐసీసీకి సమాచారం కూడా ఇచ్చిందని తెలుస్తోంది.

అక్టోబర్ 17న ప్రారంభం:
తాజా సమాచారం ప్రకారం.. టీ20 ప్రపంచకప్ యూఏఈ వేదికగా అక్టోబర్ 17న ప్రారంభం కానుంది. పొట్టి కప్ ఫైనల్ నవంబర్ 14న జరగనుంది. దాదాపు 28 రోజుల పాటు టీ20 ప్రపంచకప్ అభిమానులను అలరించనుంది. మొత్తం 16 దేశాలు పాల్గొనే ఈ టోర్నీలోని మ్యాచులు అబుదాబి, షార్జా, దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఒమన్ రాజధాని మస్కట్‌ను కూడా నాలుగో వేదికగా పరిగణలోకి తీసుకున్నారట. మొదటి వారం మ్యాచులు ఒమన్‌లో నిర్వహిస్తారని సమాచారం తెలుస్తోంది. ఏదైనా అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచిచూడాల్సిందే.

పన్ను మినహాయింపు లేదు:
టీ20 ప్రపంచకప్‌ను భారత్‌లో నిర్వహించాలని బీసీసీఐ అనుకున్నా.. రెండు ప్రధాన ప్రధానాంశాలు బోర్డుకు ప్రతికూలంగా మారుతున్నాయి. ఈ మెగా టోర్నీకి భారత ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు లభించకపోవడం మొదటిది. కరోనా కారణంగా ఐపీఎల్ 2021 వాయిదా పడిన నేపథ్యంలో 16 దేశాలకు చెందిన ఆటగాళ్లు భారత్‌కు వస్తారా? అన్నది రెండోది. వారం క్రితం రాష్ట్రాల క్రికెట్ బోర్డులతో జరిగిన వర్చువల్ సమావేశంలోనూ ఇదే విషయంపై చర్చించింది బీసీసీఐ.. ఇందులో భాగంగా మెగా టోర్నీని యూఏఈ వేదికగా జరపబోతున్నట్లు వారికి సమాచారం ఇచ్చింది. దీంతోబీసీసీఐకి 41 శాతం ఆర్థిక లాభం చేకూరనుంది. ఒకవేళ భారత్‌లో ఈ టోర్నీ జరిపితే ప్రభుత్వానికి భారీగా పన్ను కట్టాల్సి వచ్చేది. 2016లో జరిగిన టీ20 ప్రపంచకప్‌నకు సంబంధించిన పన్ను మినహాయింపు ఇప్పటివరకు లభించకపోవడం గమనార్హం.

ప్రపంచకప్‌కు ముందే ఐపీఎల్:
కరోనా కేసుల కారణంగా ఐపీఎల్ 2021 నిరవధిక వాయిదా పడిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2021లోని మిగిలిన మ్యాచులను యూఏఈలోనే టీ20 ప్రపంచకప్‌కు ముందు నిర్వహించాలని బీసీసీఐ ఇప్పటికే ప్లాన్ చేసింది. బీసీసీఐ, ఐసీసీ ప్రస్తుతం అనుకుంటున్న షెడ్యూల్ ప్రకారం.. ఐపీఎల్ అనంతరం ప్రపంచకప్ కోసం పిచ్‌లు సిద్ధం చేసేందుకు 2-3 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలో మొదటి వారం మ్యాచులు ఒమన్‌లో నిర్వహిస్తారని సమాచారం తెలుస్తోంది. అయితే రెండు టోర్నీలకు మధ్య 5-7 రోజుల వ్యవధి ఉండాలని ఐసీసీ అంటోంది. ఐపీఎల్ 2021 ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 10న నిర్వహిస్తే అంతా సవ్యంగా సాగనుంది. మరి బీసీసీఐ, ఐసీసీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications