For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

NZ vs SCO: టీ20ల్లో సరికొత్త రికార్డు సృష్టించిన మార్టిన్ గప్తిల్!!

T20 World Cup 2021: Martin Guptill becomes 2nd Player to Score 3000 Runs in T20Is

దుబాయ్: టీ20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా దుబాయ్‌ వేదికగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ స్టార్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్.. టీ20ల్లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. పొట్టి ఫార్మాట్‌లో 3000 పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాటర్‌గా గప్తిల్ నిలిచాడు. స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 24 పరుగల వ్యక్తిగత స్కోర్‌ వద్ద గప్తిల్ ఈ మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచులో గప్టిల్ 56 బంతుల్లో 93 పరుగులు చేశాడు.న్యూజిలాండ్‌ ఓపెనర్ తన ఇన్నింగ్స్‌లో 7 సిక్సర్లు, 6 ఫోర్లు బాదాడు. తొలి ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన గప్టిల్.. 19వ ఓవర్‌లో ఔట్ అయ్యాడు. దాంతో 7 పరుగుల తేడాతో మూడో టీ20 ఇంటర్నేషనల్ సెంచరీని అతడు కోల్పోయాడు.

కెరీర్‌లో 105వ అంతర్జాతీయ టీ20 ఆడుతున్న మార్టిన్ గప్తిల్‌ 101 ఇన్నింగ్స్‌ల్లో 2 సెంచరీలు, 18 అర్ధ శతకాలతో 3069 పరుగులు చేశాడు. పొట్టి ఫార్మాట్‌లో తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 3000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ 87 మ్యాచ్​ల్లో ఈ ఫీట్ అందుకున్నాడు. ఇక టీమిండియా కెప్టెన్ 92 మ్యాచ్‌ల్లో 3225 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో రోహిత్‌ శర్మ (113 మ్యాచ్‌ల్లో 2878 పరుగులు), పాల్‌ స్టిర్లింగ్‌ (92 మ్యాచ్‌ల్లో 2570 పరుగులు), ఆరోన్‌ ఫించ్‌ (79 మ్యాచ్‌ల్లో 2554 పరుగులు) వరుస స్థానాల్లో ఉన్నారు.

3000 పరుగులే కాదు.. మార్టిన్ గప్టిల్ మరో ప్రపంచ రికార్డు కూడా నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20ల్లో 150 సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. స్కాట్లాండ్‌పై 7 సిక్సర్లు కొట్టిన గఫ్టిల్.. టీ20ల్లో 154 సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా నిలిచాడు. గప్తిల్ తర్వాత భారత ఓపెనర్ రోహిత్ శర్మ 134 సిక్సర్లతో రెండవ స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌ తరఫున టీ20 ప్రపంచకప్‌లలో రెండో అత్యధిక స్కోర్‌ చేసిన ఆటగాడిగా కూడా గప్తిల్ నిలిచాడు. కివీస్ మాజీ కెప్టెన్ బ్రెండన్‌ మెక్‌కలమ్‌ 2012 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై 123 పరుగులు చేసి ఈ జాబితాలో ముందున్నాడు.

స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ విజయం సాధించింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్‌.. నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 156 పరుగులు మాత్రమే చేసింది. దీంతో కివీస్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్కాట్లాండ్‌ బ్యాటర్లలో మైఖేల్ లియాస్క్‌ (42) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మాథ్యూ క్రాస్‌ (27), జార్జ్‌ మున్సీ (22) పవలేదనిపించారు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, ఇస్‌ సోదీ రెండేసి, టిమ్‌ సౌథీ ఒక వికెట్ తీశారు. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. కివీస్‌ బ్యాటర్లలో మార్టిన్‌ గప్తిల్ (93: 56 బంతుల్లో 4x6, 6X7) తృటిలో శతకం కోల్పోయాడు.

Story first published: Wednesday, November 3, 2021, 20:48 [IST]
Other articles published on Nov 3, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+