Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

NZ vs SCO: చివరివరకూ పోరాడిన స్కాట్లాండ్.. ఉత్కంఠభరిత మ్యాచ్‌లో కివీస్ విజయం! సెమీస్ ఆశలు సజీవం!

T20 World Cup 2021: Martin Guptill 93 runs, Trent Boult 2 wickets helps New Zealand beat Scotland

దుబాయ్: టీ20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా దుబాయ్‌ వేదికగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ విజయం సాధించింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. దీంతో కివీస్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరలో ఉత్కంఠ నెలకొన్నా.. కివీస్ అద్భుత విజయం అందుకుంది. స్కాట్లాండ్‌ బ్యాటర్లలో మైఖేల్ లియాస్క్‌ (42) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, ఇస్‌ సోదీ రెండేసి వికెట్లు పడగొట్టగా.. టిమ్‌ సౌథీ ఒక వికెట్ తీశాడు. ఈ విజయంతో కివీస్ తన సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. న్యూజిలాండ్‌ మూడు మ్యాచుల్లో రెండు విజయాలు అందుకుంది.

లియాస్క్‌ పోరాడినా:

లియాస్క్‌ పోరాడినా:

173 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన స్కాట్లాండ్‌కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ట్రెంట్ బౌల్ట్‌ వేసిన మూడో ఓవర్లో ఓపెనర్‌ కైల్‌ కోట్జర్‌ (17) ఔటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన మాథ్యూ క్రాస్‌ (27)తో కలిసి జార్జ్‌ మున్సీ (22) నిలకడగా ఆడాడు. ఈ క్రమంలో ఇద్దరూ విలువైన పరుగులు చేశారు. అయితే ఇష్‌ సోదీ వేసిన ఎనిమిదో ఓవర్లో క్రీజులో జార్జ్‌ మున్సీ ఔటయ్యాడు. కాసేపటికే క్రాస్‌ కూడా పెవిలియన్ చేరాడు. దీంతో 11 ఓవర్లకు స్కాట్లాండ్‌ 77 పరుగులతో నిలిచింది. అయితే ఛేదించాల్సిన లక్ష్యం భారీగా ఉండటంతో ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మ్యాక్‌ లాయిడ్ (17), రిచీ బెర్రింగ్టన్‌ (20) వేగంగా ఆడే క్రమంలో పెవిలియన్‌ చేరారు. ఆఖర్లో వచ్చిన మైఖేల్ లియాస్క్‌ (42) ధాటిగా ఆడినా ఫలితం లేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన స్కాట్లాండ్ 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. దాంతో విజయానికి 17 పరుగుల దూరంలో ఆగిపోయింది. మార్టిన్ గప్తిల్‌కు 'మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది.

 ఆరంభంలోనే భారీ షాక్‌:

ఆరంభంలోనే భారీ షాక్‌:

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టుకు ఆరంభంలోనే భారీ షాక్‌ తగిలింది. సఫ్యాన్‌ షరీఫ్‌ వేసిన ఐదో ఓవర్లో తొలి బంతికి ఓపెనర్ డెరిల్‌ మిచెల్ (13) వికెట్ల ముందు దొరికిపోయాడు. ఐదో బంతికి కెప్టెన్ కేన్‌ విలియమ్సన్ (0) కీపర్‌కి చిక్కాడు. దీంతో న్యూజిలాండ్ ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. కివీస్ 35 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన డెవాన్‌ కాన్వే (1) కూడా విఫలమయ్యాడు. జట్టు స్కోర్ 52 పరుగుల వద్ద కాన్వే ఔట్ అయ్యాడు.

గప్తిల్ సూపర్ ఇన్నింగ్స్:

గప్తిల్ సూపర్ ఇన్నింగ్స్:

అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నా నిలకడగా ఆడిన మరో ఓపెనర్‌ మార్టిన్‌ గప్తిల్.. గ్లెన్‌ ఫిలిప్స్‌తో కలిసి కివీస్ ఇన్నింగ్స్‌ని ముందుకు నడిపించాడు. ఈ క్రమంలోనే క్రిస్‌ గ్రీవ్స్ వేసిన 13వ ఓవర్లో భారీ సిక్సర్‌తో గప్తిల్‌ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి కాస్త నెమ్మదిగా ఆడిన గప్తిల్.. హాఫ్ సెంచరీ అనంతరం గేర్ మార్చాడు. ఆచితూచిఆడుతున్న ఫిలిప్స్‌.. వేగం పెంచే క్రమంలో బ్రాడ్లే వీల్‌ వేసిన 18.2 బంతికి ఔటయ్యాడు. ఆ తర్వాతి బంతికే శతకం దిశగా సాగుతున్న గప్తిల్ కూడా ఔటయ్యాడు. ఆఖర్లో వచ్చిన జేమ్స్ నీషమ్‌ (10), మిచెల్‌ సాంట్నర్‌ (2) నాటౌట్‌గా నిలిచారు. స్కాట్లాండ్‌ బౌలర్లలో సఫ్యాన్‌ షరీఫ్‌, బ్రాడ్లే వీల్‌ రెండేసి, మార్క్‌ వాట్‌ ఒక వికెట్‌ తీశారు.

Story first published: Wednesday, November 3, 2021, 20:06 [IST]
Other articles published on Nov 3, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+