Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Scotland: స్కాట్లాండ్‌పై ఘన విజయం.. టీమిండియా బద్దలు కొట్టిన రికార్డులు ఇవే!!

T20 World Cup 2021: India registers biggest win with most balls to spare in T20Is vs Scotland
T20 World Cup : సింహంలా విజృంభిస్తున్న భారత్ Team India Records || Oneindia Telugu

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్‌ 2021లో వరుస పరాజయాల తర్వాత దెబ్బతిన్న సింహంలా విజృంభిస్తున్న భారత్.. గ్రూప్‌-2లో రెండో విజయం నమోదు చేసుకోవడంతో పాటు రన్‌ రేట్‌ను భారీగా మెరుగు పర్చుకుంది. నాకౌట్‌ చేరాలంటే అద్భుతం జరుగాల్సిన స్థితిలో శుక్రవారం స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టారు. ముందుగా రవీంద్ర జడేజా (3/15), మహమ్మద్‌ షమీ (3/15), జస్ప్రీత్‌ బుమ్రా (2/10) సత్తాచాటడంతో స్కాట్లాండ్‌ 85 పరుగులకే ఆలౌటైంది. అనంతరం లక్ష్యఛేదనలో లోకేశ్‌ రాహుల్‌ (19 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్‌ శర్మ (16 బంతుల్లో 30; 5 ఫోర్లు, ఒక సిక్సర్‌) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో భారత్‌ 6.3 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 89 పరుగులు చేసింది.

81 బంతులు మిగిలి ఉండగానే:

81 బంతులు మిగిలి ఉండగానే:

స్కాట్లాండ్‌ నిర్ధేశించిన 86 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 6.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దాంతో భారత్ 81 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను గెలుచుకుంది. ఇది టీ20 ఫార్మాట్‌లో మిగిలి ఉన్న బంతుల పరంగా భారత్‌కు అతిపెద్ద విజయంగా నిలిచింది. అంతకుముందు 2016 ఆసియా కప్‌లో యూఏఈపై భారత్‌ అతిపెద్ద విజయం సాధించింది. యూఏఈని 81/9 స్కోరుకు పరిమితం చేసిన భారత్.. ఆపై 10.1 ఓవర్లలో (59 బంతులు ఉండగానే) 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2016లో జింబాబ్వేపై కూడా భారత్ సులువుగా గెలిచింది. ముందుగా జింబాబ్వేను 99 పరుగులకే ఆలౌట్ చేసి, ఆ తర్వాత 13.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 41 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సాధించింది. 2016లో శ్రీలంకపై 37 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధిచింది. 2010లో వెస్టిండీస్‌పై 30 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.

ప్రపంచకప్‌లలో శ్రీలంక అతిపెద్ద విజయం:

ప్రపంచకప్‌లలో శ్రీలంక అతిపెద్ద విజయం:

టీ20 ప్రపంచకప్‌లలో మిగిలి ఉన్న బంతుల పరంగా శ్రీలంక అతిపెద్ద విజయంను నమోదు చేసింది. 2014లో నెదర్లాండ్స్ జట్టుపై లంక 90 బంతులు ఉండగానే విజయం సాధించింది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ 2021లో బంగ్లాపై ఆస్ట్రేలియా 82 బంతులు ఉండగానే విజయాన్ని అందుకుంది. 2021లో భారత్ 81 బంతులు మిగిలి ఉండగానే స్కాట్లాండ్‌పై మ్యాచ్‌ను గెలుచుకుంది. 2021లోనే శ్రీలంక నెదర్లాండ్స్ జట్టుపై 77 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది. 2007లో న్యూజీలాండ్ (కెన్యాపై 74 బంతులు), 2021లో ఇంగ్లండ్ (వెస్టిండీస్‌పై 70 బంతులు) భారి విజయాలు అందుకున్నాయి. 2021లోనే ఎక్కువగా విజయాలు రావడం విశేషం.

పవర్ ప్లేలో అత్యధిక పరుగులు:

పవర్ ప్లేలో అత్యధిక పరుగులు:

టీ20 ప్రపంచకప్‌లలో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన జట్టు నెదర్లాండ్స్. 2014లో ఐర్లాండ్ జట్టుపై పవర్ ప్లేలో నెదర్లాండ్స్ 91 పరుగులు చేసింది. 2016లో దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్ 89 పరుగులు చేసి రెండో స్థానంలోఉంది. 2009లో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ 83 పరుగులు చేయగా.. 2013లో ఇంగ్లీష్ జట్టుపై దక్షిణాఫ్రికా 83 రన్స్ చేసింది. 2021లో స్కాట్లాండ్‌పై భారత్ 82 రన్స్ చేసి ఈ జాబితాలో ఇదో స్థానంలో ఉంది. టీ20ల్లో భారత్ తరఫున పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసింది కూడా స్కాట్లాండ్‌పైనే. అంతకుముందు 2018లో దక్షిణాఫ్రికాపై భారత్ 78 పరుగులు చేసింది.

Story first published: Saturday, November 6, 2021, 9:43 [IST]
Other articles published on Nov 6, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+