For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup:హాట్‌కేకుల్లా భారత్-పాక్ మ్యాచ్‌ టిక్కెట్లు..గంటలోనే అయిపోయాయిగా!దాయాదుల పోరుకు యమ క్రేజ్!

T20 World Cup 2021: India, Pakistan Match Tickets Sold Out With in one Hour only

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 అనంతరం రెండు రోజుల్లో ప్రారంభం అవనున్న టీ20 ప్రపంచకప్‌ 2021కు రంగం సిద్ధమవుతోంది. ఒమన్, యూఏఈలో జరగనున్న ఈ పొట్టి ప్రపంచకప్‌ కోసం యునైటెడ్ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. అక్టోబ‌ర్ 17న క్వాలిఫైర్ మ్యాచులు ప్రారంభం కానుండగా.. అక్టోబ‌ర్ 23న సూప‌ర్ 12 స్టేజ్ ఆరంభం అవుతుంది. అబుదాబిలో జ‌ర‌గ‌బోయే తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు త‌ల‌ప‌డ‌తాయి. ఇక గ్రూప్ 2లో భాగంగా అక్టోబ‌ర్ 24న భారత్, పాకిస్థాన్ మ‌ధ్య దుబాయ్‌లో తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత దాయాది జట్లు మరోసారి తలపడనున్నాయి. దాంతో ఈ హై ఓల్టేజ్ మ్యాచుపై అందరిలో ఆసక్తి నెలకొంది.

పాక్‌పై టీమిండియాదే పైచేయి:

పాక్‌పై టీమిండియాదే పైచేయి:

భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో గత కొన్నేళ్లుగా ఇరు జట్ల మధ్య ధ్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే దాయాది జట్లు తలపడుతున్నాయి. చివరగా 2012-13లో పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం భారత్‌లో పాక్‌ పర్యటించింది. 2008లో ఆసియా కప్‌ కోసం టీమిండియా.. పాక్‌కు వెళ్లింది. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో టీమిండియాను పాకిస్తాన్ ఓడించింది. ఛాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత ఆ జట్టు భారత్‌తో ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది. 2018 ఆసియా కప్‌, 2019 వన్డే ప్రపంచకప్‌ పోరులో పాక్ ఓడిపోయింది. టీ20 ప్రపంచకప్‌లో పాక్‌తో భారత్ ఐదుసార్లు ఆడింది. అందులో భారత్‌ నాలుగు గెలవగా.. ఓ మ్యాచ్ టైగా బౌల్‌ అవుట్‌లో టీమిండియానే గెలుపొందింది.

 హాట్‌కేకుల్లా మ్యాచ్‌ టిక్కెట్లు:

హాట్‌కేకుల్లా మ్యాచ్‌ టిక్కెట్లు:

అక్టోబర్ 24న జరిగే మ్యాచ్‌తో భారత్, పాకిస్తాన్ జట్లు టీ20 ప్రపంచకప్‌ 2021లో తమ ప్రయాణాన్ని ప్రారంభించనున్నాయి. అందుకే విజయంతో టోర్నీని ఆరంభించాలని ఇరు జట్లు చూస్తున్నాయి. ఐసీసీ, ఆసియా కప్ టోర్నమెంట్లలో మాత్రమే దాయాది జట్ల మధ్య జరిగే పోరుకోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఇరు దేశాల క్రికెట్ అభిమానులతో పాటు మాజీ ఆటగాళ్లు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. టీ20 ప్రపంచకప్ కోసం టిక్కెట్ల విక్రయం ప్రారంభం కాగా.. భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ టిక్కెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. ఎవరూ ఊహించని విధంగా టిక్కెట్లు ఓ గంటలోనే అమ్ముడుపోయాయి. కరోనా వైరస్ వ్యాప్తి ఉన్నా.. టిక్కెట్లు గంటలోనే అమ్ముడుపోవడం విశేషం. దీన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చు దాయాదుల పోరుకు ఎంత క్రేజ్ ఉందొ.

70% సామర్థ్యంతో:

70% సామర్థ్యంతో:

తాజాగా ఐసీసీ ప్రేక్షకులకు ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో ముందుగా ప్రేక్షకులును అనుమతించకుండా టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లు నిర్వహించాలని ఐసీసీ భావించింది. అయితే తాజాగా తన నిర్ణయం మార్చుకున్న ఐసీసీ.. 70% సామర్థ్యంతో టోర్నీని నిర్హహిస్తున్నట్లు తెలియజేసింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సామర్థ్యం 25000. 70% సామర్థ్యం అంటే ప్రతి మ్యాచులో దాదాపు 18500 సీట్లు అందుబాటులో ఉంటాయి. టిక్కెట్ల ప్రారంభ ధర ఒమన్‌లో 10 ఒమాని రియల్, యూఏఈలో 30 దిర్హామ్‌లుగా ఐసీసీ నిర్ణయించింది. టిక్కెట్లను www.t20worldcup.com/tickets నుంచి కొనుగోలు చేయవచ్చు.

 గ్రూప్-2లో భారత్:

గ్రూప్-2లో భారత్:

టీ20 ప్రపంచకప్‌ 2021లోని గ్రూప్-1లో వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు ఉండగా.. గ్రూప్-2లో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ జట్లు ఉన్నాయి. క్వాలిఫికేషన్ రౌండ్ గ్రూప్-ఎలో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా.. గ్రూప్-బిలో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, ఒమన్, న్యూగినియా జట్లు ఉన్నాయి. ఈ గ్రూప్-ఎ, గ్రూప్- బి జట్ల మధ్య అక్టోబరు 17 నుంచి 22 వరకూ క్వాలిఫయర్ మ్యాచ్‌లు జరగనుండగా.. టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-12 ( గ్రూప్-1, గ్రూప్-2) మ్యాచ్‌లకి అర్హత సాధించనున్నాయి. పాకిస్తాన్, న్యూజీలాండ్ లాంటి పటిష్ట జట్లను ఓడిస్తే.. భారత్ సునాయాసంగా సెమీస్ చేరనుంది.

Story first published: Monday, October 4, 2021, 22:38 [IST]
Other articles published on Oct 4, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+