For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs PAK: ప్రధాన ఆటగాళ్లు ఆడటం ఏంటి.. బాబర్‌ అజామ్‌ ప్రణాళికలు ఏంటో అర్ధంకావడం లేదు: సల్మాన్

T20 World Cup 2021, IND vs PAK: Salman Butt slams Babar Azams strategy in warm-up matches

కరాచీ: టీ20 ప్రపంచకప్‌ 2021లో ఆడే పాకిస్థాన్‌ జట్టుపై ఆ జట్టు మాజీ ఓపెనర్ సల్మాన్‌ భట్‌ మండిపడ్డాడు. సన్నాహక మ్యాచ్‌ల్లో యువకులు, ఫామ్‌లో లేని ఆటగాళ్లకు అవకాశం ఇవ్వకుండా.. ప్రధాన ఆటగాళ్లు ఆడటం ఏమిటని ప్రశ్నించాడు. పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ ప్రణాళికలు అసలు అర్ధం కావడం లేదన్నాడు. పాకిస్థాన్‌ ప్రస్తుతం అభద్రతాభావంలో ఉందనే అభిప్రాయాన్ని ప్రజలకు కలిగిస్తుందని సల్మాన్‌ భట్‌ పేర్కొన్నాడు. భారత్ వార్మప్‌ మ్యాచ్‌లను బాగా ఉపయోగించుకుందన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి.

టీమిండియాను చూడండి:

టీమిండియాను చూడండి:

సల్మాన్‌ భట్‌ తన యూట్యూబ్‌ ఛానెల్‌లో మాట్లాడుతూ ... 'భారత జట్టు వార్మప్‌ మ్యాచ్‌లను బాగా ఉపయోగించుకుంది. ప్రతి ఒక్కరు ఐపీఎల్‌ ఆడి వచ్చినా.. అందరికీ అవకాశం ఇచ్చింది. ఒకవేళ ఇలా కాకుండా అత్యుత్తమ పదకొండు మందే వార్మప్ మ్యాచ్‌ల్లోనూ ఆడినా వాళ్లని సమర్థించొచ్చు. ఎందుకంటే.. ఐపీఎల్‌లో వాళ్లంతా ఒకే జట్టు తరఫున ఆడలేదు. ఇప్పుడు జట్టుగా ఆడారని వాదించొచ్చు. అయినా కూడా భారత జట్టులో ప్రతి ఒక్కరికీ అవకాశం ఇచ్చారు. ఇప్పుడు పాకిస్తాన్ జట్టులో ఎలాంటి అభద్రతాభావాలు ఉన్నాయో నాకు అసలు అర్థం కావడం లేదు. బాబర్‌ ఆజామ్ ఓ కెప్టెన్. నువ్ ఆటగాళ్లు అందరినీ ఉపయోగించుకోవాలి. ఇంకెప్పుడు అన్ని తెలుసుకుంటావ్' అని అసహనం వ్యక్తం చేశాడు.

 ప్రణాళికలు ఏంటో అర్థంకావడం లేదు:

ప్రణాళికలు ఏంటో అర్థంకావడం లేదు:

'ఓపెనర్లుగా నువ్వూ (బాబర్‌ ఆజామ్), మొహ్మద్ రిజ్వాన్‌ బరిలోకి దిగారు. ఒకవేళ మీరిద్దరూ తొలి ఓవర్‌లో పెవిలియన్‌ చేరితే.. అప్పుడైనా ఇంకో బ్యాటర్ కొత్త బంతితో ఆడాల్సి ఉంటుంది. ఇప్పుడు దక్షిణాఫ్రికాతో ఆడిన వార్మప్ మ్యాచ్‌లో బాబర్‌ ఇన్నింగ్స్ మొదటిలోనే ఔటయ్యాడు. అలాంటప్పుడు ఎలా ముందుకు వెళ్లాలనుకుంటున్నారు?. మీ ప్రణాళికలు ఏంటో నాకు అర్థంకావడం లేదు. ఇప్పటికే ఏడాదిన్నరగా మీరిద్దరే ఓపెనర్లుగా ఆడుతున్నారు. అలాంటప్పుడు వార్మప్‌ మ్యాచ్‌ల్లోనూ మీరే ఆడితే జట్టుకు ఏం ప్రయోజనం. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో మ్యాచ్‌లో హైదర్‌ అలీ, అసిఫ్‌ అలీ, మహ్మద్‌ వసీం, మహ్మద్‌ నవాజ్‌ లాంటి ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాల్సింది. ఒకవేళ మీరు బాగా ఆడి దక్షిణాఫ్రికాపై 300 పరుగులు చేసి గెలిచినా.. మిగతా ఆటగాళ్లకు అవకాశం ఇవ్వకపోతే ఆ మ్యాచ్‌ ఆడి ఏం లాభం' అని సల్మాన్‌ భట్‌ ప్రశ్నించాడు.

ప్రధాన ఆటగాళ్లతోనే బరిలోకి:

ప్రధాన ఆటగాళ్లతోనే బరిలోకి:

వార్మప్‌ మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ తొలుత వెస్టిండీస్‌పై గెలుపొందినా.. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఓటమిపాలైంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌ ప్రధాన ఆటగాళ్లతోనే ఆడింది. మరోవైపు భారత్ కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌, రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్ పంత్‌, హార్దిక్‌ పాండ్యా , రవిచంద్రన్‌ అశ్విన్‌, భువనేశ్వర్‌ కుమార్‌లకు అవకాశం ఇచ్చింది. వాళ్లంతా బాగా ఆడారు. భువీ మొదటి మ్యాచులో తేలిపోయినా.. రెండో మ్యాచులో ఫామ్ అందుకున్నాడు. ఇలానే అందరూ రాణించారు. దీంతో ప్రపంచకప్‌కు ముందు ఫామ్‌లోకి రావడమే కాకుండా పూర్తి ఆత్మవిశ్వాసం పొందారు భారత ప్లేయర్స్. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్‌ జట్టుపై ఆ జట్టు మాజీ ఓపెనర్ సల్మాన్‌ బట్ అసహనం వ్యక్తం చేశాడు.

Story first published: Thursday, October 21, 2021, 19:26 [IST]
Other articles published on Oct 21, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+