
గ్రూప్స్ దశలో ఓడినా..
సూపర్ 12 దశలో ఈ రెండు జట్లు సమవుజ్జీలతో ఓడిపోయినప్పటికీ.. ఆ తరువాత బౌన్స్ బ్యాక్ అయ్యాయి. గ్రూప్స్‌లో తాను ఎదుర్కొన్న తొలి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్ ఓడిపోయింది. పాకిస్తాన్ చేతిలో పరాజయం పాలైంది. ఆస్ట్రేలియా కూడా ఇంగ్లండ్ చేతిను గెలవలేకపోయింది ఆ తరువాతి మ్యాచ్‌లల్లో ఈ రెండు జట్లు కూడా దుమ్ము లేపాయి. సెమీ ఫైనల్స్‌లో పాకిస్తాన్‌ను ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ను న్యూజిలాండ్ ఓడించాయి. ఫైనల్స్‌లో అడుగు పెట్టాయి. ఈ రెండు జట్లు అన్ని రంగాల్లోనూ సమవుజ్జీలుగా ఉన్నాయి. టైటిల్ ఫేవరేట్ ఎవరో తేల్చుకోవడం కష్టమే.

ఫైనల్‌కు దూరం..
ఇంగ్లాండ్‌ను ఎదుర్కొన్న తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాటర్ డెవాన్ కాన్వే.. ఏ రేంజ్‌లో ఆడాడో మనం చూశాం. 13 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజ్‌లోకి అడుగు పెట్టిన ఈ బ్యాటర్.. అక్కడే పాతుకుపోయాడు. వెంటవెంటనే మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడటమే కాకుండా.. భారీ షాట్లతో ఇంగ్లీష్ బౌలర్లను హడలెత్తించాడు. 38 బంతుల్లో అయిదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 46 పరుగులు చేశాడు. ఫైనల్‌లోనూ అతను కీలక పాత్ర పోషిస్తాడనుకున్న దశలో గాయపడ్డాడు. చేతికి గాయం కావడంతో ఫైనల్ మ్యాచ్‌కు దూరం అయ్యాడు..
నెట్స్‌లో కష్టపడ్డ సీఫర్ట్..
డెవాన్ కాన్వే స్థానంలో టిమ్ సీఫర్ట్ తుది జట్టులో ఆడటం దాదాపు ఖాయమైంది. రాత్రి అతను దుబాయ్ స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. చాలాసేపు నెట్స్‌లో పాల్గొన్నాడు. బ్యాటింగ్, కీపింగ్‌లో ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. సీఫర్ట్.. టీ20 స్పెషలిస్ట్. అందుకే గాయపడ్డ కాన్వే స్థానంలో అతన్ని తుది జట్టులోకి తీసుకోనుంది న్యూజిలాండ్ మేనేజ్‌మెంట్. చోటు ఖాయం కావడం వల్ల జట్టుతో పాటు నెట్స్‌లో చెమటోడ్చాడు.

చేతికి కట్టుతో..
ప్రాక్టీస్ సమయంలో సీఫర్ట్‌కు హెల్పర్‌గా పని చేశాడు డెవాన్ కాన్వే. కుడి అరచేతికి కట్టు కట్టుకుని మరీ అతను ఈ ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. వికెట్ కీపింగ్ చేయడంలో సహాయం చేస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ను న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు.. తన అధికారిక మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. కీపర్లు ఇద్దరు పరస్పరం సహకరించుకుంటున్నారనే కామెంట్‌ను దానికి యాడ్ చేసింది. ఆ సమయంలో డెవాన్ కాన్వే కుడి అరచేతికి కట్టు కట్టుకుని కనిపించాడు. నొప్పిని భరిస్తూనే అతను తన సహచరుడికి సహాయం చేస్తోండటం పట్ల నెటిజన్లు ఫిదా అవుతున్నారు.


Click it and Unblock the Notifications












