For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup final: ఆస్ట్రేలియన్ల స్కెచ్ మామూలుగా లేదుగా: తుదిజట్టు ప్రిడిక్షన్స్ ఇవే..!

T20 World Cup 2021 final: Australia Predicted Playing XI against Kane Williamsons New Zealand

అబుధాబి: టీ20 ప్రపంచకప్ 2021 టోర్నమెంట్‌ ఫైనల్ మ్యాచ్‌లో రెండు కొత్త జట్లు తలపడబోతున్నాయి. ఇప్పటిదాకా ఈ ఫార్మట్‌లో ఛాంపియన్‌గా నిలవని ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ పోరు సాగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ఆరంభమౌతుంది. ఏ జట్టు గెలిచినా.. తొలిసారి విజేతగా నిలుస్తుంది. టీమిండియా ఈ సారి సెమీ ఫైనల్స్‌కు చేరకపోవడం ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురి చేసినప్పటికీ.. న్యూజిలాండ్ ఫైనల్ చేరడం కొంత ఊరటను కలిగిస్తోంది.

కేన్ టీమ్ గెలవాలంటూ..

కేన్ టీమ్ గెలవాలంటూ..

కేన్ విలియమ్సన్ సారథ్యంలోని కివీస్ గెలవాలని అభిమానులు కోరుకుంటోన్నారు. కేన్ మామకు బెస్ట్ విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ సారి న్యూజిలాండ్ ఖచ్చితంగా గెలుస్తుందంటూ ప్రిడిక్ట్ చేస్తున్నారు. కేన్ విలియమ్సన్‌పై తమకు ఉన్న అభిమానాన్ని ఇలా చాటుకుంటున్నారు. అభిమానుల ఆశలు నెరవేరుతాయా? బ్లాక్ క్యాప్స్.. ఈ సారి టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ ఛాంపియన్‌గా ఆవిర్భవిస్తారా? అనేది ఈ రాత్రికి తేలిపోతుంది.

ఆల్‌రౌండర్లతో నిండుగా..

ఆల్‌రౌండర్లతో నిండుగా..

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. రెండూ సమవుజ్జీలుగా ఉన్నాయి. రెండు జట్లల్లోనూ సమతౌల్యం నెలకొని ఉంది. బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్లతో నిండుగా కనిపిస్తోన్నాయి ఈ రెండు జట్లు. అంతా బాగానే ఉన్నప్పటికీ.. ఫుల్ ఫామ్‌లో ఉన్న డెవాన్ కాన్వే- గాయం వల్ల ఫైనల్ మ్యాచ్‌కు దూరం కావడం న్యూజిలాండ్‌కు కొంత ఆందోళన కలిగిస్తోంది. అతని స్థానంలో మరో టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ టిమ్ సీఫర్ట్‌ను తుది జట్టులోకి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

సమవుజ్జీతో పోరు కోసం..

సమవుజ్జీతో పోరు కోసం..

కాగా- తనతో సమవుజ్జీగా ఉన్న న్యూజిలాండ్‌ను ఓడించడానికి ఆస్ట్రేలియా కసరత్తు పూర్తి చేసింది. యుద్ధానికి సన్నద్ధమైంది. తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకపోవచ్చు. సెమీ ఫైనల్స్‌లో పాకిస్తాన్‌ను మట్టి కరిపించిన జట్టుతోనే పైనల్ ఫైట్‌కు దిగనుంది కంగారూ టీమ్. ఫైనల్ మ్యాచ్ కావడం వల్ల ఎలాంటి ప్రయోగాలను చేపట్టదలచుకోలేదంటూ కోచ్ ఇదివరకే స్పష్టం చేశారు. ఏ ఒక్కరినీ తొలగించలేమని స్పష్టం చేశారు.

ఓపెనర్లు వారే..

ఓపెనర్లు వారే..

డేవిడ్ వార్నర్, కేప్టెన్ ఆరోన్ ఫించ్.. ఎప్పట్లాగే ఇన్నింగ్‌ను ఆరంభించడం ఖాయం. పాకిస్తాన్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆరోన్ ఫించ్ దారుణంగా విఫలం అయ్యాడు. ఎదుర్కొన్న తొలి బంతికే వెనుదిరిగాడు. అయినప్పటికీ.. అతని శక్తిసామర్థ్యాలను తక్కువగా అంచనా వేయలేమని మేనేజ్‌మెంట్ చెబుతోంది. కొత్త బంతిని ఎదుర్కొనడంలో అతనికి తిరుగు లేదని వార్నర్-ఫించ్ జోడీ కనీసం అయిదు ఓవర్ల పాటు నిలదొక్కుకున్నా.. జట్టు భారీ స్కోరు చేస్తుందనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి.

మిడిలార్డర్‌లో..

మిడిలార్డర్‌లో..

టాప్ ఆర్డర్‌లో మిఛెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మిడిలార్డర్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్.. మెరుపులు మెరిపించే సత్తా ఉన్న బ్యాటర్లే. మార్ష్ గానీ, స్మిత్ గానీ తమ సత్తాకు తగినట్లుగా ఆడట్లేదనే కంప్లైంట్ ఉంది. ఈ మ్యాచ్‌లో దాని తుడిచిపెట్టేయాలనే పట్టుదల ఇద్దరిలోనూ కనిపిస్తోంది. దీనికి అనుగుణంగా వారు నెట్ ప్రాక్టీస్‌ చేశారు. గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్ అంటు బంతితోనూ రాణించగలరు. ఆల్‌రౌండర్లనే బ్రాండ్ ఉంది వారిద్దరి మీద. వేడ్ చెప్పుకోనక్కర్లేదు. ఆసీస్.. ఫైనల్స్ చేరడానికి అతనే మూల కారకుడు.

స్పిన్‌కు అనుకూలించే పిచ్..

స్పిన్‌కు అనుకూలించే పిచ్..

దుబాయ్ స్టేడియం స్పిన్‌కు అనుకూలించేలా ఉందంటూ టామ్ మూడీ ఇదివరకే స్పష్టం చేశారు. ఫలితంగా అందరి దృష్టీ ఆడమ్ జంపా మీద నిలిచింది. ఎలాంటి స్పిన్ మాయాజాలాన్ని అతను ప్రదర్శిస్తాడనేది ఆసక్తి రేపుతోంది. సూపర్-12 దశలో జంపా ఆస్ట్రేలియా తరఫున హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. 12 వికెట్లను పడగొట్టాడు. బౌలింగ్ ఎకానమీ కూడా 5.69 మాత్రమే. జంపాతో పాటు పాట్ కమ్మిన్స్, మిఛెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్‌ను ఎదుర్కొనడం న్యూజిలాండ్ సత్తాకు అసలు సిసలు పరీక్ష పెట్టినట్టవుతుంది.

తుది జట్టు ఇలా..

తుది జట్టు ఇలా..

కివీస్‌తో తలపడే ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ ఫైనల్స్ మ్యాచ్‌లో ఆరోన్ ఫించ్ (కేప్టెన్), డేవిడ్ వార్నర్, మిఛెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, ఆడమ్ జంపా, పాట్ కమ్మిన్స్, మిఛెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్‌లో ఆడటం దాదాపు ఖాయమైంది. జట్టులో ఎలాంటి మార్పులు, చేర్పులు ఉండే అవకాశాలు లేవు.

Story first published: Sunday, November 14, 2021, 12:45 [IST]
Other articles published on Nov 14, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+