Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్: తొలి మూడు ఓవర్లలో మూడు వికెట్లు ఢమాల్: ఇదో రికార్డు మరి

T20 World Cup 2021: Australia have won the toss and elect to bowl against Bangladesh

అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో మరో ఆసక్తికరమైన మ్యాచ్‌కు తెర లేచింది. గ్రూప్ 2లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం దీనికి వేదికగా మారింది. ఆస్ట్రేలియాకు ఇది నాలుగో మ్యాచ్. ఇప్పటిదాకా మూడు మ్యాచ్‌లను ఆడిన కంగారూ టీమ్.. రెండింట్లో విజయాన్ని సాధించింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.

బంగ్లా దయనీయంగా..

బంగ్లా దయనీయంగా..

బంగ్లాదేశ్ పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంటోంది. ఇప్పటిదాకా ఆ జట్టు ఇంకా బోణీ కూడా చెయ్యలేదు. నాలుగు మ్యాచ్‌లను ఆడగా.. నాలుగింట్లోనూ ఓటమి పాలైంది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. టోర్నమెంట్‌లో ముందుకు వెళ్లలేని దుస్థితిని ఎదుర్కొంటోంది. ఈ మ్యాచ్ గెలిచినా కూడా బంగ్లాదేశ్ టైగర్లు టోర్నమెంట్‌లో ముందుకు వెళ్లలేరు. సెమీ ఫైనల్స్‌కు చేరుకోవడం గగనమే. ఒక మ్యాచ్‌లో గెలిచామనే ఊరట లభిస్తుందంతే.

తొలి ఓవర్‌లో లిట్టన్ దాస్ బలి..

తొలి ఓవర్‌లో లిట్టన్ దాస్ బలి..

బంగ్లాదేశ్ ఈ టోర్నమెంట్‌లో ఏ మాత్రం రాణించట్లేదు. సత్తా చాటట్లేదు. ఈ మ్యాచ్‌లోనూ అదే పరిస్థితి. తొలి ఓవర్‌లోనే వికెట్‌ను కోల్పోయింది. తాను ఎదుర్కొన్న మొదటి బంతికే ఓపెనర్ లిట్టన్ దాస్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మిఛెల్ స్టార్క్ చేతి నుంచి 144 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్‌లా వెలువడిన బంతికిఅతని వద్ద సమాధానమే లేకుండా పోయింది. వికెట్లను గిరాటేసిందా బంతి. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్‌కు కొద్దిగా దూరంగా పడిన ఆ బంతి.. పిచ్ అయిన వెంటనే స్వింగ్ అయింది. ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకుని లెగ్ స్టంప్‌ను ఎగరవేసింది.

రెండో వికెట్ సౌమ్యా సర్కార్..

రెండో వికెట్ సౌమ్యా సర్కార్..

రెండో ఓవర్‌లో సౌమ్యా సర్కర్ బలి అయ్యాడు. జోష్ హేజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్‌ చివరిబంతికి సౌమ్యా సర్కార్ క్లీన్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. హేజిల్‌వుడ్ సంధించిన పర్‌ఫెక్ట్ లైన్ అండ్ లెగ్త్ బంతిని ఆడటంలో విఫలం అయ్యాడతను. బంతి ఎడ్జ్ తీసుకుని వికెట్ల మీది దూసుకెళ్లింది. ఎనిమిది బంతులను ఎదుర్కొన్న సౌమ్యా సర్కార్ ఒక ఫోర్‌తో అయిదు పరుగులు చేశాడు. రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. వెంటవెంటనే రెండు వికెట్లను కోల్పోయిన బంగ్లా టైగర్లు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

మూడో వికెట్ ముష్ఫికుర్..

మూడో వికెట్ ముష్ఫికుర్..

మూడో ఓవర్‌లోనూ బంగ్లాదేశ్ జట్టు వికెట్‌ను కోల్పోయింది. ఈ దఫా గ్లెన్ మ్యాక్స్‌వెల్ వంతు వచ్చింది. మూడో వికెట్‌గా ముష్ఫికుర్ రహీమ్ అవుట్ అయ్యాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ సంధించిన స్పిన్ బాల్‌ను స్వీప్ చేయబోయిన ముష్ఫికుర్ టైమింగ్ మిస్ అయ్యాడు. అది కాస్తా ప్యాడ్స్‌ను తాకింది. దీనితో మ్యాక్సీ, కీపర్ మ్యాథ్యూ వేడ్ ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేయడం, అంపైర్ తన వేలిని గాల్లోకి లేపడం చకచకా సాగిపోయాయి. ముష్ఫికుర్.. రివ్యూను కోరినప్పటికీ.. ఉపయోగం లేకుండా పోయింది. అప్పటికి జట్టు స్కోరు 10 పరుగులు.

రెండు జట్లు ఇవే..

రెండు జట్లు ఇవే..

ఆస్ట్రేలియా తుది జట్టులో డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్, మిఛెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మాధ్యూ వేడ్ (వికెట్ కీపర్), పాట్ కమ్మిన్స్, మిఛెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్ ఆడుతున్నారు. బంగ్లాదేశ్ టీమ్‌లో మహమ్మద్ నయీం, లిట్టన్ దాస్, సౌమ్యా సర్కార్, ముష్ఫికుర్ రహీమ్, మహ్మదుల్లా, అఫీఫ్ హొస్సెయిన్, షమీమ్ హొస్సెయిన్, మెహదీ హసన్, తస్కీన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షరీఫుల్ ఇమామ్ ఉన్నారు.

Story first published: Thursday, November 4, 2021, 16:02 [IST]
Other articles published on Nov 4, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+