Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup: ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాకు చావోరేవో.. సెమీస్ చేరేదెవరో! ఇరుజట్ల అవకాశాలు ఎలాఉన్నాయంటే?

T20 World Cup 2021: Australia and South Africas Semifinals Qualification Scenario.

దుబాయ్: టీ20 ప్రపంచకప్‌ 2021 సూపర్‌-12 దశ చివరి అంకానికి చేరుకుంది. అయినా ఇప్పటివరకు గ్రూప్ 1, గ్రూప్ 2లలో సెమీస్ వెళ్లే జట్లేవో తేలలేదు. గ్రూపు 1నుంచి ఇంగ్లండ్ సెమీఫైనల్లో అడుగుపెట్టగా.. రెండో బెర్తు కోసం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలు తమ అదృష్టం పరీక్షించుకోనున్నాయి. శనివారం (నవంబర్ 6) జరిగే మ్యాచ్‌ల్లో వెస్టిండీస్‌తో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో దక్షిణాఫ్రికా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇప్పటికే ఇంగ్లండ్ సెమీస్ చేరుకోగా.. వెస్టిండీస్ ఇంటిదారి పట్టింది. దాంతో ఈ మ్యాచులు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాకు కీలకంగా మారాయి. ఆస్ట్రేలియా గెలిచినా.. సెమీఫైనల్‌కు చేరే కథనంలో ఓ ట్విస్ట్‌ ఉంటుంది. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ల మధ్య జరిగే మ్యాచ్‌ పూర్తయ్యేవరకు సెమీ-ఫైనల్‌కు చేరుకునే జట్లేవో సరిగ్గా చెప్పని పరిస్థితి ఉండడం గమనార్హం.

ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లకు సెమీస్ చేరే అవకాశాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. గ్రూప్ 1లో భాగంగా ఆడిన 4 మ్యాచ్‌లు నెగ్గిన ఇంగ్లండ్.. 8 పాయింట్లతో ఇప్పటికే సెమీస్‌ చేరుకుంది. నాలుగింట్లో మూడేసి మ్యాచ్‌లు గెలిచి.. ఒక్కోదాంట్లో ఓడిన ఆస్ట్రేలియా (1.031 రన్‌రేట్‌), దక్షిణాఫ్రికా (0.742) ఆరేసి పాయింట్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. శనివారం విండీస్‌పై ఆసీస్‌.. ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా గెలిస్తే ఎనిమిదేసి పాయింట్లతో ఇరు జట్లు సమంగా నిలుస్తాయి. అప్పుడు మెరుగైన రన్‌రేట్‌ కలిగిన జట్టు సెమీస్ చేరుకుంటుంది.

ఒకవేళ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలలో ఒక జట్టు గెలిస్తే.. మరో జట్టు సెమీస్‌ చేరుకుంటుంది. బంగ్లాదేశ్‌పై భారీ విజయంతో రన్‌రేట్‌ను గణనీయంగా మెరుగు పరుచుకున్న ఆసీస్‌.. విండీస్‌తో పోరులో ఏం చేస్తుందో చూడాలి. సూపర్‌ 12 దశలో ఓటమే ఎరుగని ఇంగ్లండ్‌ను దక్షిణాఫ్రికా ఏమేరకు అడ్డుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గ్రూపు-1లో శ్రీలంక (4 పాయింట్లు), వెస్టిండీస్ (2), బంగ్లాదేశ్‌ (0) జట్లు ఇప్పటికే సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించాయి. ఇంగ్లండ్‌కు జతగా గ్రూప్ 1 నుంచి సెమీస్ చేరే జట్టేదో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

అంతర్జాతీయ టీ20ల్లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ల మధ్య ఇది ​​17వ మ్యాచ్‌. ఇంతకుముందు ఆడిన 16 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా 6 సార్లు గెలుపొందగా.. వెస్టిండీస్ 10 సార్లు గెలిచింది. అబుదాబిలో ఇరు జట్ల మధ్య ఇదే తొలి మ్యాచ్. గత 5 మ్యాచ్‌లలో వెస్టిండీస్ 4-1తో ఆధిక్యంలో ఉంది. టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్లు ఈరోజు ఆరోసారి తలపడనున్నాయి. ఇంతకు ముందు ఆడిన 5 మ్యాచ్‌ల్లో వెస్టిండీస్ 3 మ్యాచ్‌లు గెలుపొందగా, ఆస్ట్రేలియా 2 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. వెస్టిండీస్ ఈరోజు తమ సత్తాకు తగ్గట్టుగా ఆడితే.. ఆస్ట్రేలియా ఆశలపై నీళ్లు చల్లడంతో పాటు విజయంతో డ్వేన్ బ్రావోకు వీడ్కోలు పలకవచ్చు.

ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు టీ20లో 21 సార్లు తలపడనున్నాయి. 21 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ 11 గెలవగా.. దక్షిణాఫ్రికా 9 గెలిచింది. దక్షిణాఫ్రికాతో ఆడిన గత ఐదు మ్యాచ్‌ల్లో 5-0తో ఇంగ్లండ్‌దే పూర్తిగా పైచేయి. అయితే టీ20 ప్రపంచకప్లో మాత్రం దక్షిణాఫ్రికా పైచేయి సాధిస్తుంది. టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్లు తలపడడం ఇది ఆరోసారి. ఇంతకుముందు ఆడిన 5 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా 3 సార్లు గెలుపొందగా.. 2 మ్యాచ్‌లు ఇంగ్లండ్‌ గెలిచింది.

Story first published: Saturday, November 6, 2021, 13:00 [IST]
Other articles published on Nov 6, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+