న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

షెడ్యూల్ ప్రకారమే టీ20 ప్రపంచకప్‌.. స్పష్టం చేసిన ఐసీసీ!!

T20 World Cup 2020 in October likely to go ahead as per schedule, confirms ICC
T20 World Cup 2020 In October Likely To Go Ahead As Per Schedule

మెల్‌బోర్న్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) ప్రభావం క్రీడారంగంపై ఇంకా కొనసాగుతూనే ఉంది. మహమ్మారి రోజరోజుకు పంజా విసురుతుండడంతో ఇప్పటికే అనేక టోర్నీలు రద్దు కాగా.. మరికొన్ని అదే బాట పడుతున్నాయి. కరోనా ధాటికి ఆస్ట్రేలియాలో అక్టోబర్‌లో ప్రారంభం కావాల్సిన పురుషుల టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ ప్రకారం జరుగుతుందా లేదా అన్న సందేహాలు నెలకొన్నాయి. అయితే ప్రపంచకప్‌కు ఇంకా 6 నెలల సమయం ఉందని, షెడ్యూల్ ప్రకారమే టీ20 ప్రపంచకప్‌ జరుగుతుందని ఐసీసీ భావిస్తోంది.

కరోనాపై బుడతడి జాగ్రత్తలు.. సెహ్వాగ్‌ ఫిదా (వీడియో)!!కరోనాపై బుడతడి జాగ్రత్తలు.. సెహ్వాగ్‌ ఫిదా (వీడియో)!!

షెడ్యూల్ ప్రకారమే ప్రపంచకప్‌:

షెడ్యూల్ ప్రకారమే ప్రపంచకప్‌:

మెగా టోర్నీ జరగనున్న ఆస్ట్రేలియాలో కరోనా బారిన పడిన సంఖ్య 5788 ఉండగా.. ఇప్పటివరకు 39 మంది మరణించారు. దీంతో టీ20 ప్రపంచకప్‌ జరగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ఐసీసీ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. 'ప్రస్తుతం టోర్నమెంట్ షెడ్యూల్ ప్రకారం ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. టోర్నీ కోసం స్థానిక ఆర్గనైజింగ్ కమిటీ అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటుంది. తుది నిర్ణయం తీసుకునే ముందు కరోనా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తుంది. ప్రస్తుతానికి టోర్నీ అనుకున్నట్లుగా జరుగుతుంది. ఇంకా 6 నెలల సమయం ఉంది. అప్పటివరకు పరిస్థితి చక్కబడుతుంది. షెడ్యూల్ ప్రకారం ఈవెంట్ ముందుకు సాగాలని కోరుకుంటున్నాం' అని ఐసీసీ పేర్కొంది.

ప్రపంచకప్‌కు పోటీ:

ప్రపంచకప్‌కు పోటీ:

మరోవైపు అనుకున్న ప్రకారమే ప్రపంచకప్‌ను నిర్వహిస్తామని టీ20 ప్రపంచకప్‌ నిర్వాహక కమిటీ సీఈఓ నిక్‌ హాక్లీ స్పష్టం చేస్తున్నాడు. దేశంలో వాయిదా పడ్డ ఆస్ట్రేలియన్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌, జాతీయ రగ్బీ లీగ్‌లతో ప్రపంచకప్‌కు పోటీ ఎదురయ్యే అవకాశముంది. అయినా సరే.. ముందుగా అనుకున్న ప్రకారమే ప్రపంచకప్‌ను నిర్వహిస్తామన్నారు. 2020 అక్టోబర్ 18 నుండి 2020 నవంబర్ 15 వరకు ఆస్ట్రేలియాలోని ఏడు వేదికలలో ప్రపంచకప్‌ టోర్నీ జరగనుంది.

అభిమానుల మద్దతుంది:

అభిమానుల మద్దతుంది:

'టోర్నీ ఆరంభానికి దాదాపు ఇంకా 6 నెలల సమయం ఉంది కాబట్టి అన్నీ సర్దుకుంటాయనే అనుకుంటున్నా. ఒకవేళ పరిస్థితులు కుదురుకోకపోతే ఏం చేయాలనే విషయంపై కూడా ఆలోచిస్తున్నాం. ఐసీసీ, సభ్య దేశాలు, నిర్వాహక కమిటీతో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏ ఫుట్‌బాల్‌, రగ్బీ లీగ్‌లను తిరిగి నిర్వహించాలనుకుంటే ప్రపంచకప్‌కు పోటీ తప్పదు. వాటి కంటే ప్రపంచకప్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. టిక్కెట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మాకు అభిమానుల మద్దతుంది' అని నిక్‌ తెలిపాడు.

Story first published: Tuesday, April 7, 2020, 9:29 [IST]
Other articles published on Apr 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X