లార్డ్స్: ట్వంటీ 20 క్రికెట్ తొలి మ్యాచ్ లోనే సంచలనం నమోదైంది. పసికూనగా ప్రపంచ కప్ టోర్నీలో అడుగుపెట్టిన నెదర్లాండ్స్ జట్టు ఆతిథ్య ఇంగ్లాండ్ ను మట్టి కరిపించింది. 4 వికెట్ల తేడాతో జయభేరి మోగించి అందరినీ ఆశ్చర్యపర్చింది. ఇంగ్లాండ్ సూపర్ 8 అవకాశాల్ని సంక్లిష్టం చేసింది. ఇంగ్లాండ్ తమ ముందు ఉంచిన 163 పరుగుల లక్ష్యాన్ని నెదర్లాండ్స్ సరిగ్గా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆరంభంలో రీకర్స్ (20) అండతో 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గ్రూత్ (30 బంతుల్లో 49; 6X4, 1X6) చెలరేగాడు. గ్రూత్ కీలక సమయంలో ఔటైనా బోరెన్ (30), డోస్చాటే (22) నెదర్లాండ్స్‌కు సంచలన విజయాన్నందించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ మెరుపు ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేక 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్లు ల్యూక్ రైట్ (49 బంతుల్లో 71; 8X4), రవి బొపారా (46) చెలరేగారు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్సరూ లేకపోవడం విశేషం.
చివరి ఓవర్ లో నెదర్లాండ్స్ విజయానికి 7 పరుగులు కావాలి. బ్రాడ్ బౌలింగ్ చేస్తున్నాడు. తొలి ఐదు బంతులకు ఐదు సింగిల్స్. చివరి బంతికి రెండు పరుగులు చేయాలి. బ్రాడ్ విసిరిన యార్కర్ బంతిని షిఫెర్లి షాట్ కొట్టాడు. బంతిని అడ్డుకున్న బ్రాడ్ రనౌట్ చేయడానికి నాన్‌స్త్టెక్ వైపు బంతి విసిరాడు. అది కాస్తా వికెట్లకు తగలకుండా పోయింది. విజయానికి అవసరమైన 2 పరుగుల్ని నెదర్లాండ్స్ పూర్తి చేసింది.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్: బొపారా (సి) సీలార్ (బి) డోస్చాటే 46; రైట్ (సి) బోరెన్ (బి) డోస్చాటే 71; షా (సి) కెర్వెజీ (బి) షిఫెర్లి 5; మోర్గాన్ (సి) జ్యుడెరెంట్ (బి) బోరెన్ 6; కాలింగ్‌వుడ్ (సి) షిఫెర్లి (బి) సీలార్ 11; కీ నాటౌట్ 10; ఫోస్టర్ నాటౌట్ 3; ఎక్స్‌ట్రాలు 10 మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 162 వికెట్ల పతనం: 1-102, 2-113, 3-127, 4-144, 5-153 బౌలింగ్: నానెస్ 4-0-30-0; షిఫెర్లి 4-0-33-1; డోస్చాటే 4-0-35-2; సీలార్ 4-0-33-1; బోరెన్ 4-0-31-1
నెదర్లాండ్స్ ఇన్నింగ్స్: కెర్వెజీ (సి) బ్రాడ్ (బి) అండర్సన్ 1; రీకర్స్ (సి) షా (బి) బ్రాడ్ 20; జుడిరెంట్ (స్టంప్డ్) ఫోస్టర్ (బి) రషీద్ 12; గ్రూత్ (సి) కీ (బి) కాలింగ్‌వుడ్ 49; బోరెన్ (సి) షా (బి) అండర్సన్ 30; డోస్చాటే నాటౌట్ 22; వాన్‌బంగ్ (సి) రైట్ (బి) అండర్సన్ 8; షిఫెర్లి నాటౌట్ 5; ఎక్స్‌ట్రాలు 16 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 163 వికెట్ల పతనం: 1-2, 2-23, 3-66, 4-116, 5-133, 6-146 బౌలింగ్: అండర్సన్ 4-0-23-3; సైడ్‌బాటమ్ 4-0-23-0; బ్రాడ్ 3-0-32-1; రషీద్ 4-0-36-1; రైట్ 2-0-18-0; కాలింగ్‌వుడ్ 2-0-17-1