న్యూఢిల్లీ: వివాదాస్పద భారత మోడల్ పూనం పాండే మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ప్రపంచ టీ20 టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై టీమిండియా ఉత్కంఠ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పూనం పాండే ఓ హాట్ ఫొటోను పోస్ట్ చేసింది.
2015 ప్రపంచ కప్ టోర్నీని టీమిండియా గెలుచుకుంటే పూర్తి నగ్నంగా దర్శనమిస్తామని చెప్పి అప్పట్లో మీడియాలో సంచలనం సృష్టించిన పూనం పాండే.. ఇప్పుడు బంగ్లాపై విజయం సాధించిన టీమిండియాకు ఈ విధంగా శుభాకాంక్షలు తెలిపింది.

'మా స్టైల్లో టీమిండియాకు ఒక చిన్న కానుక, యు రాక్ 'అని తన అర్ధనగ్న ఫొటోను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి పూనం పాండే. కాగా, ఇటీవల పాకిస్థాన్‌పై టీమిండియా గెలిచిన నేపథ్యంలో పాకిస్థాన్ మోడల్ అర్షిఖాన్ అర్ధనగ్న వీడియోను నెట్‌లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.