వాంఖడేలో రచ్చ రంబోలా.. స్టేడియంలోనే కొట్టుకున్న ఆటగాళ్లు! (వీడియో)
టీ20 ముంబై 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌లో స్టేడియంలో తీవ్ర ఉత్కంఠతో పాటు ఊహించని డ్రామా చోటుచేసుకుంది. వాంఖడే స్టేడియం వేదికగా ఆర్క్స్ అంధేరి, మరాఠా రాయల్స్ జట్ల మధ్య జరిగిన ఈ టైటిల్ పోరులో మ్యాచ్ ముగిసే సమయానికి ఇరు జట్ల ఆటగాళ్లు పరస్పరం గొడవకు దిగారు. ఒకానొక దశలో ఇద్దరు క్రికెటర్లు చేతులతో దాడి చేసుకునేంత వరకు వెళ్లడంతో అంపైర్లు, మిగతా ఆటగాళ్లు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపు చేయాల్సి వచ్చింది.
19వ ఓవర్లో రాజుకున్న వివాదం
మరాఠా రాయల్స్ నిర్దేశించిన లక్ష్య ఛేదనలో ఆర్క్స్ అంధేరి ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఈ వివాదం మొదలైంది. ఆ ఓవర్ రెండో బంతికి అంధేరి బ్యాటర్ గౌరవ్ జఠార్ సిక్స్ కొట్టాడు. అయితే ఆ తర్వాతి బంతికే ఇర్ఫాన్ ఉమైర్ అతడిని ఔట్ చేశాడు. గౌరవ్ పెవిలియన్ వైపు వెళ్తుండగా.. డగౌట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మరాఠా రాయల్స్ ఆటగాడు రోహన్ రాజేతో అతనికి మాటల యుద్ధం నడిచింది. మొదట ఫోర్త్ అంపైర్ ఇద్దరినీ విడదీసినప్పటికీ.. వారు మళ్లీ ఒకరినొకరు నెట్టుకుంటూ తీవ్రమైన వాగ్వాదానికి దిగారు. దీంతో అంధేరి జట్టు సభ్యులతో పాటు మరాఠా రాయల్స్ ఆటగాళ్లు కూడా స్టేడియంలోకి పెరిగెత్తుకుంటూ వచ్చి రోహన్, గౌరవ్‌ల మధ్య వాగ్వాదం సద్దుమణిగేలా సర్దిచెప్పారు.

ఉత్కంఠ పోరులో మరాఠా రాయల్స్ విజయం
ఈ హైడ్రామా నడుమ సాగిన ఫైనల్ పోరులో సిద్దేష్ లాడ్ నేతృత్వంలోని మరాఠా రాయల్స్ జట్టు ఘనవిజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన మరాఠా రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. జట్టులో చిన్మయ్ రాజేష్ సుతార్ 61 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అంధేరి జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 146 పరుగులు మాత్రమే చేయగలిగింది.
చివరి ఓవర్లో రోహన్ రాజే సూపర్ బౌలింగ్
ఆర్క్స్ అంధేరి జట్టు విజయానకి చివరి రెండు ఓవర్లలో 24 పరుగులు కావాల్సి ఉండగా.. 19వ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. దీంతో చివరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సిన దశలో మరాఠా రాయల్స్ బౌలర్ రోహన్ రాజే అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అంతకుముందు ఓవర్‌లో గొడవకు దిగిన రోహన్, చివరి ఓవర్‌లో ఒత్తిడిని అధిగమించి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి తన జట్టును 8 పరుగుల తేడాతో గెలిపించాడు. కాగా ఆర్క్స్ అంధేరి జట్టు తరఫున ఆడిన సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఈ మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. అర్జున్ 12 బంతులు ఎదుర్కొని కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications