టీ20లు క్రికెట్‌ను మార్చేశాయి: సచిన్ టెండూల్కర్
చెన్నై: టీ20 ఫార్మాట్ వల్ల క్రికెట్‌లో ఎన్నో మార్పులొచ్చాయన్నాడు బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్. ప్రత్యేకంగా బ్యాటింగ్ విధానం పూర్తిగా మారిపోయిందని తెలిపాడు. ఎంఆర్ఎఫ్ టైర్స్‌కు సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సచిన్ టెండూల్కర్.. మార్చి నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్‌పై మాట్లాడాడు.

'టీ20లు క్రికెట్లో ఎన్నో మార్పులను తెచ్చాయి. ఫాస్ట్‌బౌలర్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ షాట్ ఆడటమన్నది అప్పట్లో ఊహకు కూడా అందని విషయం. వీక్షకులు కూడా దీన్ని ఆస్వాదిస్తున్నారు. క్రికెట్‌తో పెద్దగా పరిచయం లేనివారిని టీ20 ఫార్మాట్ ఆకట్టుకుంటుంది. మూడు గంటలపాటు అభిమానులను ఉత్కంఠ, వినోదంతో ముంచెత్తుతుంది' అని సచిన్ అన్నాడు.
చెన్నై సూపర్‌కింగ్స్ పిటిషన్ కొట్టివేత
2013 ఐపీఎల్ ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణానికి సంబంధించి తమపై జస్టిస్ లోధా కమిషన్ విధించిన రెండేళ్ల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలంటూ చెన్నై సూపర్‌కింగ్స్ ఫ్రాంఛైజీ వేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టి వేసింది. చెన్నై, రాజస్థాన్ ఫ్రాంఛైజీలపై సస్పెన్షన్‌ను సవాలు చేస్తూ బిజెపి నేత సుబ్రమణ్య స్వామి వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కూడా కోర్టు కొట్టేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications