హైదరాబాద్: డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియా అంధుల టీ20 వరల్డ్ కప్‌లో పైనల్స్‌కు చేరింది. దీంతో అంధుల టీ20 వరల్డ్ కప్‌లో టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. నగరంలోని లాల్‌బహదూర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 19.2 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక ఆటగాళ్లలో సురంగ సంపత్ 5 ఫోర్లతో 49 పరుగులు చేయగా, చందన దేశప్రియ 4 ఫోర్లతో 42 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో రణ్‌బీర్ పన్వర్, సునీల్‌లు రెండు వికెట్లు తీసుకోగా, అజయ్ కుమార్ రెడ్డి, గోలూ కుమార్‌లకు ఒక్కో వికెట్ లభించింది.

అనంతరం 175 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా వికెట్ కోల్పోకుండా 13 ఓవర్లలో నిర్దేశిత లక్ష్యాన్ని అందుకుంది. భారత ఓపెనర్ ప్రకాశ్ 52 బంతుల్లో 115 నాటౌట్‌గా సెంచరీని నమోదు చేశాడు. ఇక ఏపీ క్రికెటర్, కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి 30 బంతుల్లో 51 నాటౌట్‌గా నిలిచాడు.
శనివారం కర్ణాటకలోని ఆలూర్‌లో పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో... ఆదివారం బెంగళూరులో జరిగే ఫైనల్లో భారత్ తలపడుతుంది. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో జరిగిన అంధుల క్రికెట్ మ్యాచ్‌కి బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుని హాజరు కావాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫోన్ చేశాడు.
అంధుల క్రికెట్ ప్రపంచకప్‌లో బరిలో ఉన్న టీమిండియాకు మద్దతు తెలపాల్సిందిగా ఫోన్‌లో విజ్ఞప్తి చేశాడు. దీంతో టీమిండియా-శ్రీలంక మధ్య శుక్రవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌కి పీవీ సింధు హాజరయ్యారు. టీమిండియా ఆటగాళ్లకు సింధు తన మద్దతు ప్రకటించింది.