
టీ20 2022 బ్లాస్ట్ టోర్నీలో భాగంగా టాంటన్‌లోని కూపర్ అసోసియేట్స్ కౌంటీ గ్రౌండ్‌లో శనివారం జరిగిన నాలుగో క్వార్టర్-ఫైనల్ మ్యాచ్‌లో సోమర్‌సెట్ జట్టు ప్రత్యర్థి జట్టు డెర్బీషైర్‌ను చిత్తు చేసింది. అలాగే సోమర్‌సెట్ టీం నిర్ణీత 20ఓవర్లలో 265పరుగులు చేసి టీ20బ్లాస్ట్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా కూడా నిలిచింది.
ఇక డెర్బీషైర్ టీంలోని లెగ్-స్పిన్నర్ మాటీ మెక్‌కీర్నన్ ఈ మ్యాచ్‌లో ఓ చెత్త రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. అతను తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 82పరుగులు సమర్పించుకున్నాడు. 20.5ఎకానమీ రేట్‌తో బౌలింగ్ చేసిన అతను టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత ఎక్స్‌పెన్సివ్ నాలుగు ఓవర్ల స్పెల్ వేసిన బౌలర్‌గా వరస్ట్ రికార్డ్ నెలకొల్పాడు. 28ఏళ్ల మెక్‌కీర్నన్ బౌలింగ్లో సోమర్‌సెట్ బ్యాటర్లు దండిగా పరుగులు దండుకున్నారు. ఇక తన నాలుగు ఓవర్లలో అతను ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్ రిలీ రోసోవ్.. మెక్ కీర్నర్ వేసిన ఓ ఓవర్లో ఏకంగా 34పరుగుల పిండుకున్నాడు. సిక్సర్లు, ఫోర్లతో దంచికొట్టాడు. రోసోవ్ బ్యాటింగ్ దాడికి మెక్ కీర్నర్ తేలిపోయాడు.
ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే.. డెర్బీషైర్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. సోమర్ సెట్ ఓపెనర్లు టామ్ బాంటన్, విల్ స్మీడ్ తమ జట్టుకు సరైన ప్రారంభాన్ని అందించారు. వీరిద్దరూ డెర్బీషైర్ బౌలింగ్ లైనప్‌ను చిత్తు చేశారు. ఇక తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రోసౌవ్ కూడా చెలరేగిపోయాడు. బాంటన్ (41 బంతుల్లో 73 పరుగులు)తో రాణించగా.. రోసౌవ్ కేవలం 36బంతుల్లో 8ఫోర్లు, 7సిక్సులతో 93పరుగులు దండుకున్నాడు. దీంతో 265పరుగుల భారీ స్కోరు నమోదైంది. తదనంతరం బరిలోకి దిగిన డెర్బీషైర్ బ్యాటర్లు 11.2ఓవర్లలోనే 74పరుగులకే ఆలౌటయ్యారు. 17 బంతుల్లో 14పరుగులు చేసిన ఆ జట్టు బ్యాటర్ వేన్ మాడ్సన్ ఆ జట్టులో టాప్ స్కోరర్. సోమర్‌సెట్ తరఫున వెటరన్ పేసర్ పీటర్ సిడిల్, బెన్ గ్రీన్ చెరో మూడు వికెట్లు తీసి డెర్బీషైర్ పతనాన్ని శాసించారు. తద్వారా 191పరుగుల భారీ విజయాన్ని సోమర్ సెట్ నమోదు చేసింది. రోసౌవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.