
మరాఠా జట్టుకు బ్రేవో కెప్టెన్:
యువరాజ్ రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో ఆడాడు. ఇప్పుడు అబుదాబి టీ20 లీగ్‌లో ఆడడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. జింబాబ్వే మాజీ కెప్టెన్, ఇంగ్లాండ్ మాజీ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్‌ను మరఠా అరేబియన్స్ జట్టు ఇటీవలే ప్రధాన కోచ్‌గా నియమించుకుంది. ఆ తర్వాత యువీతో ఒప్పందం కుదుర్చుకుంది. మరాఠా తరఫున శ్రీలంక స్టార్ బౌలర్ లసిత్ మలింగా, వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రేవోలు ఇప్పటికే ఆడుతున్నారు. డ్వేన్ బ్రేవో మరాఠా జట్టుకు కెప్టెన్.

లీగ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా:
ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు హజ్రతుల్లా జజాయ్, నజీబుల్లా జాద్రాన్.. ఆస్ట్రేలియా పవర్ హిట్టింగ్ బ్యాట్స్‌మన్ క్రిస్ లిన్ కూడా మరాఠా తరఫున ఆడనున్నారు. యువరాజ్ మాట్లాడుతూ... 'టీ10 ఫార్మాట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా. దిగ్గజ క్రికెటర్లు ఈ లీగ్‌లో ఆడుతున్నారు. వారందరితో కలిసి ఆడటాన్ని నేను ఆస్వాదిస్తా. టీ10 లీగ్‌ల్లో ఆడాలంటే ఎక్కువగా శ్రమించాలి. క్రికెట్‌లో సరికొత్త జోష్‌ను తీసుకొచ్చే ఫార్మాట్ ఇది' అని అన్నాడు.

కలందర్స్ జట్టుకు అఫ్రిది:
అబుదాబి వేదికగా నవంబర్ 15 నుంచి 24 వరకు టీ10 మూడో సీజన్ జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొననున్నాయి. ఈ లీగ్‌లో పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రీది బరిలోకి దిగనున్నాడు. అఫ్రిది కలందర్స్ జట్టు తరుపున ఆడనున్నాడు. థిసారా పెరీరా, నిరోషన్ డిక్‌వెల్లా, మొయిన్ అలీ, కీరన్ పోలార్డ్, ఆండ్రూ రసెల్ పలు జట్లకు ఆడుతున్నారు.

పాక్ ఆటగాళ్లకు భారీ షాక్:
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తమ దేశ ఆటగాళ్లకు భారీ షాక్ ఇచ్చింది. పాక్ ఆటగాళ్లు టీ10 క్రికెట్ లీగ్‌లో ఆడేందుకు ఇచ్చిన అనుమతిని పీసీబీ తాజాగా ఉపసంహరించుకుంది. ఇదివరకు టీ10 క్రికెట్‌కు పీసీబీ అనుమతి ఇచ్చినా.. తాజాగా పాల్గొనవద్దని స్పష్టం చేసింది. ఆటగాళ్లపై పనిభారం అధికమవుతుందనే ఉద్దేశంతో పీసీబీ ఈ నిర్ణయం తీసుకుంది. పీసీబీ తాజా నిర్ణయంతో 10 లీగ్‌లో పాకిస్తాన్ ఆటగాళ్ళు కనబడరు.


Click it and Unblock the Notifications












