అబుదాబిలో టీ10 లీగ్: విచిత్రపు బౌలింగ్‌తో వార్తల్లో నిలిచిన లంక్ స్పిన్నర్ (వీడియో)

హైదరాబాద్: శ్రీలంకకు చెందిన కెవిన్ కొత్తీగొడ తన ప్రత్యేకమైన బౌలింగ్ యాక్షన్‌తో క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. అతడి బౌలింగ్ యాక్షన్ దక్షిణాఫ్రికా మాజీ స్పిన్నర్ పాల్ ఆడమ్స్‌ను పోలి ఉండటం విశేషం. వివరాల్లోకి వెళితే... 90 దశకాల్లోని క్రికెట్ అభిమానులకు దక్షిణాఫ్రికా స్పిన్నర్ పాల్ ఆడమ్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు.
ప్రత్యేకమైన బౌలింగ్ యాక్షన్‌తో
తన ప్రత్యేకమైన బౌలింగ్ యాక్షన్‌తో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. బంతి విసిరడానికి ముందు తలను పూర్తిగా కిందకు వంచి రెండు చేతులూ పైకి చాస్తూ ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్‌కు బంతులేసేవాడు. అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ఆ తరహా బౌలింగ్ యాక్షన్‌ను చూడలేదు.

పాల్ ఆడమ్స్ మాదిరి బౌలింగ్ చేస్తూ
అయితే, శ్రీలంకకు చెందిన 24 ఏళ్ల కెవిన్ కొత్తీగొడ అచ్చం పాల్ ఆడమ్స్ మాదిరి బౌలింగ్ చేస్తూ వార్తల్లో నిలిచాడు. అబుదాబి వేదికగా జరుగుతున్న టీ10 లీగ్‌లో తన విచిత్రపు బౌలింగ్ యాక్షన్‌తో అందర్ని ఆకర్షిస్తున్నాడు. కాగా, ప్రస్తుతం జరుగుతున్న టీ10 లీగ్‌లో కెవిన్ కొత్తీగొడ బంగ్లా టైగర్స్ జట్టుకు ఆడుతున్నాడు.

గాలే క్రికెట్ క్లబ్ తరుపున అరంగేట్రం
ఆ జట్టు తరుపున ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లాడి ఒక వికెట్‌తో పాటు 43 పరుగులు ఇచ్చాడు. ఈ ఏడాది ఆరంభంలో గాలే క్రికెట్ క్లబ్ తరుపున లిస్ట్-ఏ, టీ20 మ్యాచ్‌ల్లో అరంగేట్రాన్ని చేశాడు. లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు తీసిన అతడు నాలుగు టీ20ల్లో ఆరు వికెట్లు పడగొట్టాడు.

2017 ఐపీఎల్‌లో శివం కౌశిక్ కూడా!
2017 ఐపీఎల్‌లో గుజరాత్ లయన్స్ తరఫున ఆడిన శివం కౌశిక్‌ది కూడా ఈ విధమైన ప్రత్యేకమైన బౌలింగ్ శైలే కావడం విశేషం. అయితే, కెవిన్ బౌలింగ్ యాక్షన్ పాల్ ఆడమ్స్ శైలికి బాగా దగ్గరగా ఉండడంతో అతడి బౌలింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications