T10 లీగ్: మరో జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా వీరేంద్ర సెహ్వాగ్


హైదరాబాద్: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మరో జట్టుకు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం సెహ్వాగ్ కామెంటేటర్‌గా విధులు నిర్వర్తించడంతో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు మెంటార్‌గా వ్యవహారిస్తున్నాడు.

బ్యాటింగ్ కోచ్‌గా సెహ్వాగ్
అయితే, తాజాగా సెహ్వాగ్ మరో జట్టుతో బ్యాటింగ్ కోచ్‌గా ఉండేందుకు ఒప్పందం చేసుకున్నాడు. గతేడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా టీ10 క్రికెట్ లీగ్ నిర్వహించారు. ఈ లీగ్‌లో మరాఠ అరేబియన్స్ జట్టుకు సెహ్వాగ్ కెప్టెన్‌గా వ్యవహారించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది నవంబర్‌లో ఈ లీగ్ రెండో సీజన్ జరగనుంది.

మరాఠ అరేబియన్స్ యాజమాన్యం సంప్రదింపులు
ఈ నేపథ్యంలో రెండో సీజన్‌లో సెహ్వాగ్ సేవలను ఎలాగైనా జట్టుకు అందించాలన్న ఆలోచలో భాగంగా మరాఠ అరేబియన్స్ యాజమాన్యం అతడితో సంప్రదింపులు జరిపింది. దీంతో జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా ఉండేందుకు సెహ్వాగ్ అంగీకరించాడు. ఈ విషయాన్ని మరాఠ అరేబియన్స్ సహ యజమాని పర్వేజ్ ఖాన్ వెల్లడించారు.

సెహ్వాగ్ లేని మరాఠ అరేబియన్స్ జట్టుని ఊహించలేం
"గతేడాది కెప్టెన్‌గా జట్టుని నడిపించిన సెహ్వాగ్ ఇప్పుడు అదే జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వహించనున్నాడు. ఇందుకోసం ఇప్పటికే అతడితో ఒప్పందం చేసుకున్నాం. సెహ్వాగ్ లేని మరాఠ అరేబియన్స్ జట్టును మేము ఊహించలేం. బ్యాట్స్‌మెన్‌కు అతడి సలహాలు, సూచనలు ఎంతో అవసరం" అని అన్నారు.

మరాఠ అరేబియన్స్ తరుపున ఆడనున్న రషీద్ ఖాన్
ఈ జట్టుకు మెంటార్‌గా పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రమ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా, ఆప్ఘన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్ ఈ ఏడాది మరాఠ అరేబియన్స్ జట్టు తరుపున ఆడనున్నాడు. గత ఏడాది డిసెంబరులో జరిగిన ఈ లీగ్‌లో ఇయాన్ మోర్గాన్ నాయకత్వం వహించిన కేరళ కింగ్స్ జట్టు విజేతగా నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications