
హైదరబాద్: ఇప్పటి వరకు ఉన్న వన్డే మ్యాచ్ కన్నా షార్ట్ ఫార్మాట్ టీ 20 ఇప్పుడు దానికంటే పొట్టి క్రికెట్ మరొకటి మొదలైంది. టీ 10 క్రికెట్ అభిమానులు ఎప్పుడా అని ఎదురుచూస్తోన్న పొట్టి క్రికెట్ నేటి నుంచే మొదలుకానుంది. డిసెంబరు 14 నుంచి 17 వరకు నాలుగు రోజులు ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.
కాబట్టి ప్రతి దేశం నుంచి ఒకరిద్దరు నాణ్యమైన ప్లేయర్లు ఉంటే సరిపోతుందని సెహ్వాగ్ ఇంతకుముందు ఓ మీడియా సమావేశంలో తెలిపాడు. మరోవైపు షార్జా వేదికగా డిసెంబర్‌లో జరగనున్న టీ10 క్రికెట్ లీగ్‌లో వీరేంద్ర సెహ్వాగ్, కుమార సంగక్కర వంటి మాజీలతో పాటు ప్రస్తుత క్రికెటర్లు మహమ్మద్ అమీర్, కీరన్ పొలార్డ్ లాంటివారు గ్రౌండ్‌లో అడుగుపెట్టనున్నారు.
తొంబై నిమిషాల నిడివితో సాగనున్న ఈ మ్యాచ్ వీక్షకులకు కన్నుల పండుగగానే నిలవనుంది. షార్జా వేదికగా గురువారం ఈ సరికొత్త టోర్నీ మొదలుకానుంది. ప్రస్తుతం ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొననున్నాయి. తొలి మ్యాచ్ బెంగాల్ వారియర్స్- కేరళ కింగ్స్ మధ్య రాత్రి 8 గంటలకు జరగనుంది.అవి ఇలా.. బెంగాల్ టైగర్స్, కేరళ కింగ్స్, మరాఠా అరేబియన్స్, పక్తూన్స్, పంజాబీ లెజెండ్స్, టీమ్ శ్రీలంక

ఏ జట్టులో ఎవరు..
మారాఠా అరేబియన్స్:
వీరేంద్ర సెహ్వాగ్ (ఐకాన్ ప్లేయర్), మొహమ్మద్ అమీర్, మొహమ్మద్ షమీ, ఇమాద్ వసీం, కమ్రాన్ అక్మల్, అలెక్స్ హాలెస్, రోస్ వైట్లీ, లెండీ సిమ్మన్స్, రిలే రొస్సౌ, హర్దుస్ విల్జోన్, క్రిష్మార్ సంతోకీ, డ్వాన్ బ్రావో, రియోలొఫ్ వాన్ దేర్ మెర్వే,, షైమన్ అన్వర్, జహూర్ ఖాన్
కేరళ కింగ్స్ :
ఇయోన్ మోర్గాన్ (ఐకాన్ ప్లేయర్), లియోమ్ ప్లంకెట్, సొహైల్ తన్వీర్, వహబ్ రియజ్, రియాన్ టెన్ డస్‌చటే, బాబర్ హయత్, కీరోన్ పొల్లార్డ్, సామియేల్ బద్రే, ర్యాద్ ఎమ్రిత్, చద్విక్ వాల్టన్, నికోలస్ పోరన్, షకీబ్ అల్ హసన్, పాల్ స్టిర్లింగ్, రోహన్ ముస్తఫా, ఇమ్రాన్ హైదర్
పంజాబ్ లెజెండ్స్:
షోయబ్ మాలిక్(ఐకాన్ ప్లేయర్), హసన్ అలీ, ఉమర్ అక్మల్, మిషబ్ ఉల్ హక్, ఫహీమ్ అష్రఫ్, ఉసామా మీర్, అబ్దుల్ రజఖ్, క్రిస్ జోర్డాన్, అదిల్ రషీద్, కార్లొస్ బ్రాత్ వైటె, రంగనా హెరాత్, లుకే రొంచీ, దావ్లాత్ జాద్రాన్, షరీఫ్ అసదుల్లాహ్, గులామ్ షబ్బీర్
ఫఖ్తూన్స్:
షహీద్ అఫ్రీదీ(ఐకాన్ ప్రేయర్), షఖార్ జమాన్, అహ్మద్ షాహ్‌జాద్, జునైద్ ఖాన్, సొహైల్ ఖాన్, ఉమర్ గుల్, మొహమ్మద్ ఇర్ఫాన్, షహీన్ అఫ్రీదీ, ద్వానే స్మిత్, లియోమ్ డాసన్, తమీమ్ ఇఖ్బాల్, నజీబుల్లాహ్ జాద్రాన్, మొహమ్మద్ నబీ, అమ్జాద్ జావేద్, సక్లైన్ హైదర్
కొలంబో లయన్స్:
దినేశ్ ఛండీమాల్ (కెప్టెన్), షెహన్ జయసూర్య, దిల్షాన్ మునవీరా, రమిత్ రంబుక్వెల్లా, భానుకా రజపక్సా, వనీదు హసరంగా, ఏంజిలా పెరారా, తిక్షిలా దే సెల్వా, విశ్వ ఫెర్నాండో, సచిత్రా సెనానాయకే, షెహాన్ మదుశంకా, లాహిరూ మదుశంకా, కసున్ మదుశంకా, ఏంజిలో పెరారా, కితురువాన్ వితనాగే, అలంకార అశాంకా
బెంగాల్ టైగర్స్:
సర్ఫరాజ్ అహ్మద్ (ఐకాన్ ప్లేయర్), మొహమ్మద్ నవాజ్, రుమ్మాన్ రాయీస్, అన్వర్ అలీ, హసన్ ఖాన్, ముస్తఫీజుర్ రహ్మన్, సునీల్ నరీన్, డారెన్ సమ్మీ, డారెన్ బ్రావో, జాన్సన్ ఛార్లెస్, ఆండ్రె ఫ్లెచర్, టామ్ కోహ్లెర్ కాడ్మొర్, కెమెరాన్ డెల్పోర్ట్, మొహమ్మద్ నవీద్, రమీజ్ షెహ్‌జాద్, నబీల్ బైగ్
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.