Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీ10 క్రికెట్‌ ఒలింపిక్స్‌కు దోహదం చేస్తుంది: రస్సెల్‌

T10 can help cricket become part of Olympics says Andre Russell

న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో క్రికెట్‌ కూడా చేరడానికి టీ10 ఫార్మాట్‌ దోహదం చేస్తుందని వెస్టిండీస్‌ బిగ్ హిట్టింగ్ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ రసెల్‌ అన్నాడు. ఇటీవలి కాలంలో టీ20 క్రికెట్‌కు విశేష ఆదరణ లభించింది. దీంతో టీ10 క్రికెట్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. టీ20లో అద్భుతంగా రాణించిన ఆండ్రూ రసెల్‌ టీ10లో కూడా ఆడుతున్నాడు. అబుదాబి టీ10లో భాగంగా నార్తర్న్ వారియర్స్ జట్టుకు రసెల్‌ ఆడుతున్నాడు.

మూడవ సీజన్ యుఎఈ రాజధానిలో నవంబర్ 14 నుండి 24 మధ్య జరుగుతుంది. తాజాగా రసెల్‌ ఓ మీడియా సమావేశంలో పాల్గొనగా.. టీ10 ఫార్మాట్ ఒలింపిక్స్‌కు తీసుకెళ్లడానికి దోహదం చేస్తుందా అని అడగగా అతను స్పందించాడు. ఒలింపిక్స్‌కు టీ-10 ఫార్మాట్‌ సరిగ్గా సరిపోతుందని ఆండ్రీ రస్సెల్‌ అభిప్రాయపడ్డాడు. 'ఒలింపిక్స్‌లో క్రికెట్‌ ఉంటే ఎంతో ఆసక్తిగా ఉంటుంది. దీనిని క్రికెటర్లందరూ ఆస్వాదిస్తారు. ఒలింపిక్స్‌లో దేశం తరఫున పోరాడటానికి ప్రతి ఆటగాడు ఇష్టపడతాడు. టీ20 కంటే టీ10 అత్యంత పొట్టి ఫార్మాట్. ఒలింపిక్స్‌కు టీ10 ఫార్మాట్‌ అయితే సరిగ్గా సరిపోతుంది' అని అన్నాడు.

'టీ10లో తొలి బంతి నుంచే విధ్వంసం మొదలుపెట్టాలి. ఈ ఫార్మాట్లో బ్యాట్స్‌మెన్‌కు పెద్దగా సమయం ఉండదు. ప్రతి బంతి ఎంతో కీలకం. ఫీల్డింగ్‌ చేస్తున్న జట్టు బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడానికి ప్రయత్నిస్తారు. దీంతో బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెరుగుతుంది. అయితే బౌలర్ ఎటువంటి బంతుల్ని సంధిస్తాడో ముందుగానే ఊహించి బౌండరీలు బాదడానికి బ్యాట్స్‌మెన్‌ ప్రయత్నించాలి' అని 31 ఏళ్ల రస్సెల్‌ పేర్కొన్నాడు.

'టీ10 ఫార్మాట్ బాక్స్‌ ఆఫీస్‌ ఈవెంట్‌గా భావిస్తున్నా. అబుదాబి టీ10 హోస్ట్ చేయడానికి ఒక అద్భుతమైన ప్రదేశం. సాంస్కృతికంగా కూడా మంచి ప్రదేశాలు ఉన్నాయి. ఒక ఆటగాడిగా కూడా పర్యటించడానికి గొప్ప ప్రదేశం. జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియం అద్భుతంగా ఉంది. స్టేడియంలో మంచి సౌకర్యాలు ఉన్నాయి. అబుదాబి ఉన్నత స్థాయి క్రికెట్ ఈవెంట్లను నిర్వహిస్తోంది. నేను అక్కడకు వెళ్ళడానికి ఎదురు చూస్తున్నా' అని రస్సెల్‌ చెప్పాడు.

Story first published: Thursday, October 17, 2019, 14:38 [IST]
Other articles published on Oct 17, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+