న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స‌న్‌రైజ‌ర్స్‌కు ఊహించని షాక్‌.. ఐపీఎల్ 2021 నుంచి స్టార్ పేస‌ర్‌ ఔట్! ఆందోళనలో ఫాన్స్!

T Natarajan To Miss Out Rest Of IPL 2021 Due To Injury Big Blow To SRH


హైదరాబాద్:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2021లో వ‌రుస‌గా మూడు మ్యాచ్‌లు ఓడి.. ఎట్టకేలకు ఓ విజయాన్ని అందుకున్న స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జట్టుకు భారీ షాక్ త‌గిలింది. స‌న్‌రైజ‌ర్స్ స్టార్ పేస‌ర్‌ టీ న‌ట‌రాజ‌న్.. ఐపీఎల్ 2021లోని మిగతా మ్యాచులకు దూరం కానున్నాడు. ఈ విష‌యాన్ని స్పోర్ట్స్ అనలిస్ట్ బొరియా మజుందార్ ట్విటర్ వేదికగా తెలిపాడు. నటరాజన్ ఎడ‌మ మోకాలికి అయిన గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతోనే టోర్నీ నుంచి అతడు తప్పుకోనున్నాడని సమాచారం. కీలక సమయంలో న‌ట‌రాజ‌న్ దూరమవడం స‌న్‌రైజ‌ర్స్‌కు గట్టి ఎదురుదెబ్బే అని చెప్పాలి. విషయం తెలిసిన హైదరాబాద్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

RCB vs RR: ప్రతీకారం తీర్చుకున్న దూబే.. మెరిసిన తేవాతియా! బెంగళూరు లక్ష్యం 178!RCB vs RR: ప్రతీకారం తీర్చుకున్న దూబే.. మెరిసిన తేవాతియా! బెంగళూరు లక్ష్యం 178!

 స్కానింగ్ చేసుకోవాల్సిందే:

స్కానింగ్ చేసుకోవాల్సిందే:

టీ నటరాజన్ గాయంపై స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తాజాగా స్పదించాడు. 'నటరాజన్ మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. క్వారంటైన్ రూల్ నిబంధనతో నట్టూ స్కానింగ్ చేసుకునే పరిస్థితి లేదు. స్కానింగ్ చేసుకోవాలంటే అతను బయో బబుల్ వీడాలి. ఒకవేళ బబుల్ వీడితే.. మళ్లీ వచ్చి ఏడు రోజుల క్వారంటైన్ పాటించాల్సి ఉంటుంది. ఫిజియోలు అతని గాయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. కానీ ఎదో ఒక టైమ్‌లో అతను స్కానింగ్ చేసుకోవాల్సిందే' అని వార్నర్ చెప్పాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో టోర్నీ మొత్తానికి నట్టూ దూరం కానున్నాడు.

 ఐపీఎల్‌ 2020లో 16 వికెట్లు:

ఐపీఎల్‌ 2020లో 16 వికెట్లు:

యూఏఈలో జరిగిన ఐపీఎల్‌ 2020 సీజన్‌లో సన్‌రైజర్స్‌ తరపున 16 వికెట్లతో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకొని.. టీ నటరాజన్ అందరి ప్రశంసలు పొందాడు. ఈ ప్రదర్శనే గతేడాది జరిగిన ఆసీస్‌ పర్యటనకు అతన్ని నెట్‌ బౌలర్‌గా అవకాశం కల్పించింది. అయితే ఆ పర్యటనలో అనూహ్యంగా నటరాజన్‌ మూడు ఫార్మాట్లలో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. దీంతో భారత్‌ తరఫున ఈ రికార్డు సృష్టించిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. కంగారు గడ్డపై అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని సిరీస్ విజయాలో కీలక పాత్ర పోషించాడు.

ఎన్‌సీఏలో ఫిట్‌నెస్‌ సాధించి:

ఎన్‌సీఏలో ఫిట్‌నెస్‌ సాధించి:

అయితే స్వదేశానికి తిరిగొచ్చాక గాయపడడంతో.. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌తో పాటు టీ20 సిరీస్‌కు తంగరాసు నటరాజన్ దూరమయ్యాడు.ఆపై బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) అకాడమీలో ఫిట్‌నెస్‌ సాధించి..‌ ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో చోటు దక్కించుకున్నాడు. ఆపై ఐపీఎల్ 2021లోకి వచ్చాడు. మొదటి రెండు మ్యాచులు ఆడిన అనంతరం ఫిట్‌నెస్‌ లేదంటూ ముంబై, పంజాబ్ జట్లతో జరిగిన మ్యాచులు ఆడలేదు.

 భువీ కూడా లేకుంటే:

భువీ కూడా లేకుంటే:

ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఏమి కలిసి రావడం లేదు. మూడు ఓటముల తర్వాత ఎట్టకేలకు హైదరాబాద్ బోణీ కొట్టింది. టీ నటరాజన్ మోకాలి గాయంతో టోర్నీకి దూరం కానుండగా.. భువనేశ్వర్ కుమార్ కూడా గాయం బారిన పడ్డాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతని తొడ కండరాలు పట్టేయడంతో బౌలింగ్ కోటా పూర్తి చేయకుండానే భువీ మైదానం వీడాడు. గతేడాది కూడా గాయంతోనే జట్టును వీడిన భువీ.. మళ్లీ గాయపడటంతో సన్‌రైజర్స్ శిభిరంలో ఆందోళన నెలకొంది. భువీ కూడా లేకుంటే.. సన్‌రైజర్స్ పని ఇక అంతే సంగతులు. కేన్ విలియమ్సన్ రీ ఎంట్రీ ఇవ్వడం ఒక్కటే సానుకూలాంశం.

Story first published: Thursday, April 22, 2021, 22:53 [IST]
Other articles published on Apr 22, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X